బంగ్లా హిందువుల అజ్ఞాత మరణకాండ Bangla Hinduvula Agyata Maranakanda
1947లో భారత దేశ విభజన, 1971లో బంగ్లాదేశ్ ఆవిర్భావం నేపథ్యంలో ఇస్లామిక్ జిహాది మూకలు చేసిన దారుణ మారణకాండ కారణంగా కొన్ని లక్షల హిందూ కుటుంబాలు ధ్వంసం అయ్యాయి. ఆ కాందిశీకుల అనుభవాలు ఈ పుస్తకం లో చదవండి .
లోకమాత దేవి అహిల్యాబాయి హోల్కర్ Lokmata Devi Ahilyabai
లోకమాత దేవి అహిల్యాబాయి హోల్కర్ Lokmata Devi Ahilyabai
భారతదేశ చరిత్రలోనే ఒక శక్తిమంతమైన మహిళామణి రాణి అహిల్యాదేవి. ఆమె అకుంఠిత దీక్షాతత్పరత, కర్తవ్య నిర్వహణ, దూరదృష్టి సాటిలేనివి. తన 33 ఏళ్ళ పాలనలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని, హిందుత్వంకోసం నిలబడ్డ ధీశాలి. తన భర్తను చిన్నతనంలోనే కోల్పోయింది. మహావీరుడైన మామగారు మల్హార్రావు వేసినబాటలో రాజ్యానికి ఏకైక వారసురాలుగా సుభిక్షంగా పాలించింది.
వెయ్యేళ్ల ధర్మయుద్ధం Veyela Dharmayuddham ( Ide Haindvam 2)
వెయ్యేళ్ల ధర్మయుద్ధం Veyela Dharmayuddham ( Ide Haindvam 2)
ఇప్పటి దాకా దేశ చరిత్రలను రాసినవారు 712లో సింధు దురాక్రమణ లగాయతు 1707 లో ఔరంగజేబు మరణం వరకూ వెయ్యేళ్ల కాలాన్ని మహమ్మదీయుల ఆధిపత్య కాలం కింద సాధారణంగా లెక్కవేస్తారు. నిజానికి వెయ్యేళ్ల పర్యంతమూ సాగింది మహమ్మదీయుల అధికారం కాదు- హిందువుల ధర్మయుద్ధం. ఆ లోకోత్తర మహా సంగ్రామమే “వెయ్యేళ్ల ధర్మయుద్ధం”
శివా నీ నిరీక్షణలో Shiva nee Neereekshana
శివా నీ నిరీక్షణలో Shiva nee Neereekshana
గ్యానవాపి రహస్యాలను ఎంతో వివరంగా, ఆసక్తికరంగా, వివరించారు విక్రమ్ సంపత్. పాఠకుల మనసు గెలుచుకునే, ఆలోచింపచేసే రచన. ఇదిగో, తెలుగులో మీకోసం.
రుద్రమదేవి Rudramma Devi
రుద్రమదేవి Rudramma Devi
ఆడది అంటే అబల కాదు ఆదిపరాశక్తి అని అక్షరాల నిరూపించి వీరోచిత జీవన అభ్యున్నతితో తన రాజ్యం సస్యశ్యామలమై ప్రజలందరూ సుఖసంతోషాలతో …
Desa Vibhajana VishadaGadha-దేశవిభజన విషాద గాధ
Desa Vibhajana VishadaGadha-దేశవిభజన విషాద గాధ
దేశవిభజనయొక్క అనివార్యత లేదా సమర్థనీయతకు సంబంధించిన ఈ మౌలిక భూమికను నిశితంగా పరీక్షించవలసిన అగత్యముంది. “దేశవిభజన అనివార్యం అయిందా?” “అంతిమంగా ఆ వినాశకరమైన ముగింపుకు దారితీసిన అంశాలేవి?” “అందులో ఈనాటి పాలకులకు పనికివచ్చే హెచ్చరికలేమైనా వున్నాయా?” “భావితరాల వారు మరువరాని ఏదైనా అనుభూతిగానీ, సాకారం చేసుకోవలసిన స్వప్నంగానీ అదేమైనా మిగిల్చిందా?” ఇలాంటి ప్రశ్నలన్నిటికి సమాధానాలు కావల్సిందే- – వాస్తవాలతో నిండిన సత్యమైన, ప్రామాణికమైన, సముచితమైన సమాధానాలు కావాలి. ఆ దిశగా ఒక చిన్న ప్రయత్నమే ప్రస్తుత గ్రంథం.
హిందూజన రక్షకుడు ఛత్రపతి శివాజీ Hindu janarakshakudu
హిందూజన రక్షకుడు ఛత్రపతి శివాజీ Hindu janarakshakudu
శివాజీ జీవిత లక్ష్యం ఏమిటి? యవనుల నాశనమే తన జీవితాశయమని ఆయన ఎందుకన్నారు? యవనులు చేసిన దారుణాలు ఏమిటి? ఆ దారుణాలు చేయడానికి కారణమైన వారి మతసూత్రాలు ఏమిటి? ఇస్లామిక్ రాజ్యపు స్వభావం ఏమిటి? శివాజీ స్థాపించిన హైందవీ సామ్రాజ్య లక్షణాలు ఏమిటి?
ఈ విషయాలను సంక్షిప్తంగా, క్లుప్తంగా వివరించే శ్రీ గజానన్ భాస్కర్ మహందలే రచన `Chatrapati Shivaji : Saviour of Hindu India’ కు తెలుగు అనువాదం `హిందూ జన రక్షకుడు ఛత్రపతి శివాజీ’ తప్పక చదవండి.
హైదరాబాద్ ప్రజాసమరం Hyderabad Prajasamaram
హైదరాబాద్ ప్రజాసమరం Hyderabad Prajasamaram
హైదరాబాద్లో బాధ్యతాయుత ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తూ “హైదరాబాద్ కి అవామీ జంగ్” పేరిట పాతికేళ్ళ ప్రాయంలో ఆయన ఉర్దూలో పుస్తకం రాశారు. దానికి “హైదరాబాద్ ప్రజాసమరం” పేరిట మెహక్ హైదరాబాదీ చేసిన అనువాదమిది.
గోవా ఇంక్విజిషన్ : క్రైస్తవమత విచారణ సంస్థ (Telugu ) Goa Inquisition
ఇంక్విజిషన్ అనేది క్రైస్తవ మతస్తులు కానివారిని, తమకు నచ్చని సాటి క్రైస్తవులకు అవిశ్వాసులనే ముద్ర వేసి, వేటాడి, శిక్షించడానికి ఏర్పడిన ఒక క్రైస్తవమత విచారణ సంస్థ. “హోలీ పోలీస్” (పవిత్ర పోలీస్) అనేది ఇంక్విజిషన్ అధికార నామం. క్రైస్తవమతం పుట్టిన నాటి నుంచీ అసహనం దాని సహజ లక్షణంగా ఉంటూ వచ్చింది. రోము సామ్రాజ్యానికి ఆధికారిక మతంగా మారిన తరువాత అది మరింత గట్టి పడింది.
13వ శతాబ్దిలో దక్షిణ ఫ్రాన్సును అల్లకల్లోలం చేసి, అక్కడి జనాభాను తుడిచిపెట్టి, నాగరికతను రూపుమాపిన క్రూసేడులు ఇంక్విజిషన్ అనే మతయుద్ధాలు ‘పవిత్ర’ సంస్థ ఆవిర్భావానికి దారితీశాయి.
సంక్షిప్త భారత దేశ చరిత్ర – సంస్కృతి (Telugu ) Sankshipta Bharata Desa Charitra
సంక్షిప్త భారత దేశ చరిత్ర – సంస్కృతి (Telugu ) Sankshipta Bharata Desa Charitra
ఆఖరి ప్రవక్త .. అతని మతం Aakhari pravakta.. athani matham
ఆఖరి ప్రవక్త .. అతని మతం Aakhari pravakta.. athani matham
ఆఖరు ప్రవక్తగా ముస్లింలు చెప్పే మహమ్మద్ ప్రవక్త జీవితమే ఇస్లాంకు ఆధారం. ప్రవక్త ఏం చెప్పారో, ఏం చేశారో అదే తమకు ఆచరణీయం, అనుసరణీయని ముస్లింలు పదేపదే ప్రకటిస్తుంటారు. ఆ విధంగానే తాము నడుచుకుంటామని, నడుస్తున్నామని చెపుతారు.
ఇంతకీ మహమ్మద్ జీవితం ఏమిటి? ఆయన చెప్పిన, చేసిన పనులు ఏమిటి? అన్న విషయాలను వివరించే అనేక అరబిక్ గ్రంధాలు ఉన్నాయి. అలాగే అనేకమంది యూరోపియన్లు పరిశోధన చేసి ప్రవక్త జీవితచరిత్రను వ్రాశారు. అరబిక్ పండితుడు, పరిశోధకుడు డా. మార్గోలియత్ వ్రాసిన ‘Mohammad & The Rise of Islam’ అనే 600పేజీల బృహత్ గ్రంథపు సంక్షిప్త అనువాదమే ‘ఆఖరు ప్రవక్త – అతని మతం’. ఇస్లాం పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవాలనుకునేవారికి ఉపయుక్తమైనది.
మనదే మనదే కాశ్మీరం manade manade kaashmiram
కాశ్మీర్ కథ Kaashmir Katha ( Telugu )
యావద్భారతాన్ని చిరకాలంగా కలవరపరుస్తున్న కాశ్మీర్ సమస్యకు మూలమేమిటి?
ఈ కథ ఎక్కడ మొదలైంది ? ఎన్ని మలుపులు తిరిగింది? సుందర కాశ్మీరాన్ని పాకీ దయ్యాల దిబ్బగా మార్చిన పాపంలో ఎవరి వాటా ఎంత ఎంత? అనర్థాలకు అసలు కారణమైన 370వ అధికరణం ఏ పరిస్థితుల్లో పుట్టింది ? కాశ్మీర్ కూ, దేశానికీ ఎంత హాని చేసింది?
నిజాం vs నిజం Nizam vs Nijam
తెలంగాణ స్వాతంత్ర పోరాటం ఒక చరిత్ర మాత్రమే కాదు.ఇది తెలంగాణ ప్రజల జీవన్మరణ పోరాటం మరియు ఒక ఆత్మగౌరవ నినాదం. ప్రతి పౌరుడు చదివి గర్వించదగ్గ చరిత్ర. ఏడుగురు విదేశీ నిజాముల దాస్య శృంఖలాలను పటాపంచలు చేసి, స్వతంత్ర భారతంలో కలవడానికి తెలంగాణ ప్రజలు జరిపిన అద్భుత తెలంగాణ స్వాతంత్ర పోరాటం ఇందులో ఆవిష్కృతమవుతుంది.
స్వరాజ్య సాధనలో ఆర్ ఎస్ ఎస్ Swarajya Sadhanalo RSS
స్వరాజ్య సాధనలో ఆర్ ఎస్ ఎస్ Swarajya Sadhanalo RSS
స్వాతంత్ర్యాన్ని స్వరాజ్యంగా మలచడంలో కూడా సంఘం కీలక పాత్ర పోషించింది. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తల్లో దేశం ఎదుర్కొన్న బాలారిష్టాలను, సమస్యలను తీర్చడంలో వేలాది సంఘ స్వయంసేవకులు అపూర్వమైన ధైర్యసాహసాలు, త్యాగాన్ని ప్రదర్శించారు. ముఖ్యంగా రక్తసిక్తమైన దేశ విభజన సమయంలో ముస్లింలీగ్ ముష్కర మూకల నుండి సిక్కులు, హిందువులను కాపాడి సురక్షితంగా భారత్ కు చేర్చడంలో స్వయంసేవకులు చూపిన తెగువ, దేశభక్తి అమోఘం.
Angleyula elubadi antuleni dopidi ఆంగ్లేయుల ఏలుబడి అంతులేని దోపిడి
Angleyula elubadi antuleni dopidi ఆంగ్లేయుల ఏలుబడి అంతులేని దోపిడి
About the book :
The colonial loot of Bharat during the British rule is documented in this book
పురాణవైర గ్రంథమాల 12 నవలలు Purana Vaira Granthamala
పురాణాల చారిత్రికతను తిరస్కరించే ధోరణిని విశ్వనాథ సత్యనారాయణ పురాణవైరమన్నారు. చారిత్రికాంశాలను పురాణాల నుంచి స్వీకరించి ఆయన పురాణవైర గ్రంథమాల రచించారు. ఈ నవలామాలిక లక్ష్యాలను పేర్కొంటూ ఆ లెక్క(పాశ్చాత్య చరిత్ర కారుల లెక్క) ప్రకారము కలి ప్రవేశము మొదలు- సంయుక్తా పృథ్వీరాజుల కథ దనుక, పాశ్చాత్యులు తారుమారు చేసిరి. ఆ కాలము, అనగా సుమారు మూడువేల యేండ్ల కాలము, మహమ్మదు గోరీ వచ్చువరకు మన చరిత్రలో పాశ్చాత్యులు చేసిన అవక తవకలు కాదని నవలల రూపమున నిరూపించుటకు చేసెడి ప్రయత్న మిది. అందుచేత దీనికి “పురాణవైరము” అని శీర్షిక ఏర్పరుపబడినది. అన్నారు విశ్వనాథ సత్యనారాయణ.
1. భగవంతుని మీది పగ ; 2. నాస్తికధూమము ; 3. ధూమరేఖ ; 4. నందోరాజా భవిష్యతి
5. చంద్రగుప్తుని స్వప్నము ; 6. అశ్వమేధము ; 7. అమృతవల్లి ; 8. పులిమ్రుగ్గు
9. నాగసేనుడు ; 10. హెలీనా ; 11. వేదవతి ; 12. నివేదిత
స్వతంత్ర సమర జ్వాలలు Swatantra Samara Jwaalalu
1857 నుండి 1947 వరకు స్వాతంత్య్ర సంపాదనకు జరిగిన ప్రయత్న పరంపర ఎంతో ఆకర్షణీయంగా, ఉజ్వలంగా, ప్రేరణదాయకంగా వివరించారు. బాలలకే గాక అందరికీ ఇది ఉపయుక్తం.
ఆ 15 రోజులు aa 15 rojulu
ఆ 15 రోజుల్లో అనేక సంఘటనలు జరిగాయి….! అవన్నీ ప్రత్యేకమైనవే.
ఆ 15 రోజులు మనకు ఎన్నో గుణపాఠాలు నేర్పాయి..
ఆ సమయంలో సాగిన ఈ భయంకర మారణకాండలో 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకటిన్నర కోట్లమంది శరణార్ధులుగా మిగిలారు.
ముస్లిం వేర్పాటువాదం – దేశ విభజన (Pack of 2) Muslim verpaatuvaadam desa vibhajana
ముస్లిం వేర్పాటువాదం – దేశ విభజన (Pack of 2) Muslim verpaatuvaadam desa vibhajana
About the Set : టర్కీలోని ఖలీఫా పదవిని పునరుద్ధరించాలంటూ సాగిన ఆందోళనే ఖిలాఫత్ ఉద్యమం. ప్రపంచంలోని మరే ముస్లిం దేశంగాని, …
ఖిలాఫత్: ముస్లిం వేర్పాటువాదం-దేశవిభజన Khilafat Telugu
ఖిలాఫత్: ముస్లిం వేర్పాటువాదం-దేశవిభజన Khilafat Telugu
Brief description :
టర్కీలోని ఖలీఫా పదవిని పునరుద్ధరించాలంటూ సాగిన ఆందోళనే ఖిలాఫత్ ఉద్యమం. ప్రపంచంలోని మరే ముస్లిం దేశంగాని, ముస్లింగాని ఈ ఉద్యమంలో పాల్గొనలేదు. భారత్ తో కానీ, భారత్ లో అప్పట్లో సాగుతున్న స్వాతంత్ర్య ఉద్యమంతోకానీ ఏమాత్రం సంబంధంలేని ఈ ఉద్యమానికి మద్దతునివ్వాల్సిందేనంటూ గాంధీజీ కాంగ్రెస్ ను ఒప్పించారు. హిందూ, ముస్లిం ఐక్యత సాధిస్తే బ్రిటిష్ పాలనను అంతంచేయవచ్చన్న ఆయన అంచనాలు తల్లక్రిందులై చివరికి ముస్లిం వేర్పాటువాదం దేశ విభజనకు దారితీసింది.
రాజిల్లు రామభూమి శ్రీ రామజన్మభూమి Rajillu Ramabhoomi Sri RamaJanmabhoomi
రాజిల్లు రామభూమి శ్రీ రామజన్మభూమి Rajillu Ramabhoomi Sri RamaJanmabhoomi
ఈ పుస్తకంలో శ్రీ రామజన్మభూమి ప్రాంగణ పున: ప్రాప్తి , మందిర నిర్మాణ చరిత్ర పొందుపర్చి ఉన్నాయి.
The book documents the History of Sri Rama Janmbhoomi, the movement to reclaim the site and re-building the temple. Language : Telugu
ఋగ్వేద సాంకేతికత ఖగోళ రహస్యాలు Rigveda Saanketikata Khagola Rahasyalu
Author : ప్రొ. సుభాష్ కాక్ About : వేదాలలోని సాంకేతిక రహస్యాల గురించి సంప్రదాయేతరరీతులలో అన్వేషించి, అనన్యసామాన్యమైన శిఖరాలను ఆవిష్కరించినవారిలో …
హిందూదేశంపై ముస్లింల దండయాత్రలకు అవిస్మరణీయ ప్రతిఘటనా పరంపర Hindu desampai muslimla dandayaatralaku avismaraneeya pratighatana parampara
హిందూదేశంపై ముస్లింల దండయాత్రలకు అవిస్మరణీయ ప్రతిఘటనా పరంపర Hindu desampai muslimla dandayaatralaku avismaraneeya pratighatana parampara
హిందూదేశంపై ముస్లింల దండయాత్రలకు అవిస్మరణీయ ప్రతిఘటనా పరంపర
Telugu translation of the Marathi book
“Islami Aghatawar Hinducha Pratyaghat” by Dr Sharad Hebalkar