Description
About the book :
- Original in Hindi. Translated to Telugu by Vishwa Samvaad Kendra, Telangana
ఆ 15 రోజుల్లో అనేక సంఘటనలు జరిగాయి….! అవన్నీ ప్రత్యేకమైనవే.
ఆ 15 రోజులు మనకు ఎన్నో గుణపాఠాలు నేర్పాయి..
ఆ సమయంలో సాగిన ఈ భయంకర మారణకాండలో 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకటిన్నర కోట్లమంది శరణార్ధులుగా మిగిలారు.
ఢాకాలోని ఢాకేశ్వరీ దేవి ఆలయం మనది కాకుండా పోయింది. బారిసాల్ కాళికాదేవి దర్శనం చేసుకోవడం, దుర్గా సరోవరంలో పుణ్యస్నానం చేయడం ఇక మనకు సాధ్యం కాదు. సిక్కు మతపు సంస్థాపకుడైన గురునానక్ జన్మస్థలమైన నన్ కానా సాహెబ్ ఇక మన దేశంలో భాగం కాదు. హింగలాజ్ దేవి దర్శనం చేసుకోవడం మనకు వీలుకాదు.
మౌంట్ బాటన్ చెపితే స్వతంత్ర భారతంలో కూడా యూనియన్ జాక్ (బ్రిటిష్ జెండా) ఎగురవేయడానికి సిద్ధపడిన నెహ్రూ ధోరణి మనం చూశాం. `లాహోర్ మరణిస్తే దానితోపాటు మీరు కూడా చచ్చిపోండి’ అని గాంధీజీ లాహోర్ లో హిందువులకు చెప్పిన రోజునే `రాజా దాహిర్ నుంచి ప్రేరణ పొంది, ధైర్యంతో, కలిసి జీవించండి’అంటూ హైదారాబాద్ (సింధ్)లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ శ్రీ గురూజీ ధైర్యాన్ని నింపడం కూడా చూశాం.
సింధీ మహిళలు బాగా అలంకరించుకుని, అందమైన దుస్తులు ధరిస్తారు కాబట్టే ముస్లింలు వారిని వేధిస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడి భార్య సుచేత కృపలానీ హిందూ మహిళలకు `బోధిస్తున్నప్పుడే’, `హిందూ మహిళలు సంస్కారవంతులు, శక్తిశాలులు, సమర్ధులుగా ఉండాలి’ అంటూ కరాచీలో రాష్ట్ర సేవికా సమితికి చెందిన మౌసీజీ చెప్పడం చూశాం. కాంగ్రెస్ లోని హిందూ కార్యకర్తలు ప్రాణభయంతో పాకిస్థాన్ వదిలిపెట్టి భారత్ కు పారిపోతే, ముస్లిం కార్యకర్తలు ముస్లిం లీగ్ తో కలిసిపోయారు. కానీ సంఘ స్వయంసేవకులు ధైర్యంగా నిలబడి ప్రాణాలను సైతం ఒడ్డి హిందువులు, సిక్కులను సురక్షితంగా భారత్ కు చేర్చడం కూడా చూశాం.
ఆలోచనావిధానంలో, పని చేసే పద్దతిలో ఎంత తేడా…?
ఆ 15 రోజుల కీలక సంఘటనల గురించిన ఉత్కంఠభరిత కథనం ఈ పుస్తకం….
తప్పక చదవండి…చదివించండి.
Publisher : Samvit Prakashan ; Language : Telugu ; Paperback.
About the Author :
- Prashant Pole has done B.E. Hons. (Electronics & Telecom) and M.A. in Marathi. Presently, he is Director of Disha Consultants and Web Bharati at Nagpur. He has professional experience of more than 34 years, has travelled to more than 35 countries. He was head of the research department in Meltron (Maharashtra Electronics Development Corporation). He developed special equipment for firing missiles at Interim Test Range at Balasore (1990). He was member of the IT Task Force of Maharashtra government in 1998-99. He was Member of IT Task Force for Ministry of Surface Transport and Shipping, GoI. Currently, he is working as a consultant for many multinational Telecom, IT companies and Banks. He is a Member of Board of Governance, IIIT, Jabalpur and IT Expert for Bombay University.
Other books by the Author :
https://hindueshop.com/staging/author/prashant-pole/
Also read :
Other books by the author :
https://hindueshop.com/staging/product/ve-pandrah-din-hi/



Mahathi – :
‘ ఆ 15 రోజులు ‘ పుస్తకం చాలా అద్భుతంగా వుంది. ప్రతీ ఒక్కరూ చదవాల్సిన & తెలుసుకోవాల్సిన విషయాలున్న పుస్తకం. ఇప్పటి యువత ( or middle aged కూడా) ఆ సమయానికి పుట్టి కూడా వుండరు. మరి ఇలాంటి పుస్తకాలు ప్రాచుర్యంలోకి రాకపోతే ఈ విషయాలు ఎప్పటికీ తెలిసే అవకాశమే వుండదు. వాస్తవాలు ఎపుడూ కాలం వలన మసకబారకూడదు, మరుగున పడకూడదు. నేనైతే ఈ పుస్తకాన్ని నా మనవళ్ళు మనవరాళ్ళకి కూడా అందచేస్తాను. నాకైతే పుస్తకం చదువుతున్నంత సేపూ కాసేపు కోపం, ఇంకాసేపు రోషం, మరికాసేపు బాధ ….. ఏంటో తెలీని భావోద్వేగం కలిగాయి.
ఇంకో మూడురోజుల్లో సింధూనది లేని భారతదేశంలో నివసించబోతున్నాం అని గురూజీ బైఠక్ లో భావోద్వేగానికి లోనయ్యారట, పాల్గొన్నవారందరూ కన్నీరు పెట్టుకున్నారట.
హిందూ, సిక్కు మహిళల మీద అత్యాచారలు యధేఛ్ఛగా సాగుతుంటే కాబోయే ప్రధాని తన నివాసంలో మౌంట్ బాటన్ లేఖలకు ప్రత్యుత్తరాలు రాసుకుంటూ గడిపారట.
అబ్బా, అసలు పటేల్జీ ఋణం దేశం తీర్చుకోగలుతుందా! నిజాం, భోపాల్ లు భారత్లో విలీనం కాకపోతే …. అటూ, ఇటే కాదు, మధ్యలో కూడా పాకిస్తాన్ వుండేది.
లాహోర్ లోని హిందువులు కాందిశీకులుగా వలసపోతూ ఆఖరిసారి శ్రీరాముని కుమారుడైన లవుని మందిరాన్ని దర్శించి ఇంకెప్పటికీ రాలేమేమో అని తల్లడిల్లారట.
కనీసం మన పిల్లల తరానికైనా గురూజీ, సావర్కార్, మదన్ మోహన మాలవీయ వంటివారు ఆశించిన శాశ్వత అఖండ భారతం సంప్రాప్తిస్తుందేమో చూడాలి.
ఈ పుస్తకాన్ని మాకు చేరువ చేసినందుకు హిందూ ఈషాప్ కు కృతజ్ఞతలు. ఇలాంటి మరెన్నో జాతీయవాద భావజాల సాహిత్యాన్ని అందిస్తూ లోకహితానికి కారణమవ్వాలని ఆశిస్తున్నాము.
భారత మాతకి జయమగు గాక.
srsprasad – :
Please, Please read this book. Wonderfully described the day to day events and attitude of different people who could have influenced and could have got the situation otherwise but their real motive was different.
I read this book thoroughly. My heart filled with pain and sorrow for the Hindus who suffered barbaric situation and lost their life.
One thing I realized is “Ghandi” and “Nehru” are NOT what we learned in our academics so far.