నిజాం vs నిజం Nizam vs Nijam

తెలంగాణ స్వాతంత్ర పోరాటం ఒక చరిత్ర మాత్రమే కాదు.ఇది తెలంగాణ ప్రజల జీవన్మరణ పోరాటం మరియు ఒక ఆత్మగౌరవ నినాదం. ప్రతి పౌరుడు చదివి గర్వించదగ్గ చరిత్ర. ఏడుగురు విదేశీ నిజాముల దాస్య శృంఖలాలను పటాపంచలు చేసి, స్వతంత్ర భారతంలో కలవడానికి తెలంగాణ ప్రజలు జరిపిన అద్భుత తెలంగాణ స్వాతంత్ర        పోరాటం ఇందులో ఆవిష్కృతమవుతుంది.

5.00 out of 5 based on 1 customer rating
(1 customer review)

150.00

Out of stock

Compare

Description

About the book : 

హైదరాబాద్ స్వాతంత్ర పోరాటం యొక్క వ్యాప్తి ఇవాల్టి తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ ,  కర్ణాటక , మహారాష్ట్ర లో జరిగినది .  తెలంగాణ స్వాతంత్ర పోరాటం ఒక చరిత్ర మాత్రమే కాదు.ఇది తెలంగాణ ప్రజల జీవన్మరణ పోరాటం మరియు ఒక ఆత్మగౌరవ నినాదం. ప్రతి పౌరుడు చదివి గర్వించదగ్గ చరిత్ర. ఏడుగురు విదేశీ నిజాముల దాస్య శృంఖలాలను పటాపంచలు చేసి, స్వతంత్ర భారతంలో కలవడానికి తెలంగాణ ప్రజలు జరిపిన అద్భుత తెలంగాణ స్వాతంత్ర        పోరాటం ఇందులో ఆవిష్కృతమవుతుంది. హైదరాబాద్ సంస్థానంలో మన పూర్వీకులు కట్టుబానిసలా కంటే దుర్భర జీవనం గడిపారు, దేశ స్వాతంత్ర్యం కన్నా 13 నెలల 2 రోజులు ఆలస్యంగా ఈ ప్రాంతానికి స్వాతంత్ర్యం ఎందుకు వచ్చినది? నిజాములు జరిపిన సాంస్కృతిక దురాక్రమణ ఏమిటి? వారు జరిపిన మతమార్పిడులు, 1857 స్వరాజ్య సంగ్రామానికి నిజం వెన్నుపోట్లు, రైల్వే నిర్మాణం పేరుతో  నిజాం సాగించిన దురాగతాలు, ఈ పుస్తకం ఆధారాలతో సహా మన ముందు ఉంచుతుంది.
రక్తాన్ని పులుముకున్న రజాకార్లు, ప్రత్యేక దేశం అనే కుట్రతో కమ్యూనిస్టులు జరిపిన ఉద్యమం కూడా మరో రజాకార్ రక్తపాత ఉద్యమమే. భారత ప్రధాని నెహ్రూ పక్షపాత ధోరణి మరియు బుజ్జగింపు రాజకీయాలను తేటతెల్లం చేస్తుంది. నిజాం దోచుకున్న తెలంగాణ ప్రజల సొమ్ము నిజాం పేరిట ట్రస్టుల పేరుతో ఎందుకు మార్చబడినది, తెలంగాణ ఆడపడుచుల ధన మాన ప్రాణాలను దోచుకున్న కాశీం రజ్వి కి ఉరిశిక్ష పడకుండా అడ్డుకున్న జాతీయ నాయకుడు ఎవరు? మన సంపద కొల్లగొట్టి మనలను బానిసలుగా చేసిన నిజామును శిక్షించడంకు బదులు రక్షించి రాజప్రముఖ్ చేసింది ఎవరు? వందేమాతర ఉద్యమాన్ని ఉస్మానియా యూనివర్సిటీలో ఉర్రూతలూగించి వందేమాతరం గా పేరుగాంచిన త్యాగమూర్తి, వారి ప్రాణాలకు తెగించి నిజాంపై బాంబు విసిరిన తెలంగాణ భగత్ సింగ్ ఎవరు? విదేశీ పాలకుల చేతిలో మరణించడానికి బదులు తుపాకీతో తనను తానే కాల్చుకుని వీరమరణం పొందిన అజ్ఞాత వీరుడు సురపురం సంస్థానాధీశులు రాజా వెంకటప్పయ్య నాయక్, ఆదివాసుల ముద్దుబిడ్డ రాంజీగోండును చెట్ల కొమ్మల లో ఎందుకు ఉరితీశారు? జల్ జంగల్ జమీన్ పేరుతో తుడుందెబ్బ  మోగించిన కొమరం భీమ్ ను ఎందుకు కాల్చి చంపారు? నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న తెలంగాణ సావర్కర్ గా పేరుగాంచిన దాశరధి, వీర బైరాన్ పల్లి యొక్క పోరాట పటిమ మరియు ఆర్య సమాజ్, హిందూ మహాసభలు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ అనేక హిందూ సంస్థలు జరిపిన అలుపెరగని పోరాటాలు, చరిత్రలో దాగి ఉన్న అనేక సత్యాలను ఈ పుస్తకం మన ముందు ఉంచింది. నిజం తెలుసుకునేందుకు ఈ పుస్తకాన్ని చదువుదాం  ఇతరులు నిజం తెలుసుకోవడం కోసం ఈ పుస్తకాన్ని చదివిద్దాం.
#పుస్తక రచయిత#
  డా. బొప్ప భాస్కర్ అధ్యాపకులు, ఒక సామాజిక, రాజకీయ శాస్త్రవేత్త, విద్యార్థి ఉద్యమాలలో క్రియాశీలకంగా ఉండి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. తెలంగాణ చారిత్రక నేపథ్యం, ఉద్యమ పోకడలపై అనేక పుస్తకాలు అధ్యయనం చేసి తెలంగాణ చరిత్రలో జరిగిన అన్యాయాలను, వక్రీకరించి బడిన తెలంగాణ గత చరిత్ర రాబోవు తరాలకు నిజానిజాలు తెలియజేయాలని ఆకాంక్షతో ఈ పుస్తక రచన చేయడం జరిగింది.

1 review for నిజాం vs నిజం Nizam vs Nijam

  1. 5 out of 5

    :

    చరిత్ర లో తుడిచి వేసిన నిజాలను తిరిగి తెచ్చిన రచయిత కు ధన్యవాదాలు

Only logged in customers who have purchased this product may leave a review.

Select at least 2 products
to compare