గీతా దర్శనము – సచిత్ర గ్రంథము Gita Darshnamu – Sachitra Grandhamu
గీతాదర్శనము ( ముఖ్య గీతాశ్లోకాలకు సచిత్ర వ్యాఖ్యానం ) రామాయణము దృశ్యకావ్యమని అందురు. శ్రీమత్ భగవద్గీత తత్త్వసారము. కానీ భగవద్గీతను కూడా …
Diary 2024 with Hindu tithis in Telugu
Diary 2024 with Hindu tithis in Telugu
2024 Diary with four dates per page ;
Special additions : Hindu tithi calendar in Telugu
కార్తికమాస వైభవము Karthikamaasa vaibhavamu
బ్రహ్మముహూర్తం కొద్దిగా దాటిన కాలం కార్తికమాసం. కార్తికమాసంలో అన్నీ ముఖ్యమైనవే. అందరికి అవకాశం ఇచ్చే ఉపాసనాకాలం కార్తికమాసం. కార్తికమాసంలోనే ద్వాదశిదీపాలు, కార్తికపౌర్ణమి, …
చార్వాకం : నాటి నుండి నేటికీ Charvakam Nati nundi netiki
చార్వాకం : నాటి నుండి నేటికీ Charvakam Nati nundi netiki
`చార్వాకం’ అంటే ఏమిటి? అది పురాతన కాలంలోనే ఉండేదా? లేక ఇప్పుడు కూడా ఉందా? చార్వాకులు ఎలా ఆలోచిస్తారు? ఎలా ప్రవర్తిస్తారు? వారి జీవన లక్ష్యం ఏమిటి? చార్వాక ధోరణి ఇప్పుడు ఎక్కడ ఉంది? అది ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేస్తోంది? ప్రజాజీవితాన్ని ప్రభావితం చేసే ప్రస్తుత చార్వాకా(ప్రచ్చన్న చార్వాకాలు)లకు పురాతన చార్వాకానికి పోలిక ఏమిటి? ఈ విషయాలను తెలుసుకోవాలంటే `చార్వాకం – నాటి నుండి నేటికి’ అనే పుస్తకం తప్పక చదవాలి. సాంస్కృతిక విధ్వంసానికి పూనుకున్న చార్వాక ధోరణిని అర్ధం చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ధీర యువతకు (Dheera Yuvathaku)- To the Brave Youth
ద్విభాషా పుస్తకంగా రూపొందిన ఈ పుస్తకంలో స్వామి వివేకానంద సూక్తులు ఆంగ్లంలోను, తెలుగులోను పొందుపరచబడ్డాయి.
గంగలో విషనాగులు Gangalo Vishanaagulu : Breaking India 2.0
గంగలో విషనాగులు Gangalo Vishanaagulu : Breaking India 2.0
This is an abridged Telugu translation of Snakes in the Ganga , Breaking India 2.0 .
“బ్రేకింగ్ ఇండియా” రచయిత రాజీవ్ మల్హోత్రా, విజయవిశ్వనాథన్తో కలిసి చేసిన విస్తృత పరిశోధనల ఫలితంగా 860 పుటలతో, 63పుటల ఎండ్ నోట్స్, 59 పుటలు ఉపయుక్త గ్రంథసూచీతో ఆంగ్లంలో వెలువడిన ఉదంతం Snakes in the Ganga” యొక్క సంక్షిప్తరూపమే ‘గంగలో విషనాగులు’ అనే ఈ పుస్తకం. యోగిక భారతదేశాన్ని ఒక నాగరికతారాజ్యంగా ఎదగనీయకుండా, దాని సాంస్కృతిక మూలాలను పెకలించే ప్రయత్నాలు చేస్తున్న దేశవిచ్ఛిన్నకర శక్తుల విషయమై హెచ్చరించడమే ఈ పుస్తకపు లక్ష్యం.
పరతంత్రం పై స్వతంత్ర పోరాటం Paratantram Pai Swatantra Poratam
ఈ పుస్తకం దేశ స్వాతంత్ర్య పోరాటాన్ని వివిధ కోణాల్లో విశ్లేషిస్తూ ఒక దిగ్విజయ చరిత్రను సంక్షిప్తంగా పాఠకులకు అందించే పుస్తకం
టిప్పు నిజస్వరూపం Tipu Nijaswarupam
టిప్పు నిజస్వరూపం Tipu Nijaswarupam
టిప్పు స్వాతంత్య్ర సమరయోధుడు, ఉదారవాది, సహనశీలి ఇంకా సమర్థవంతమైన పాలకుడని ఆరాధించేవారు కొందరైతే, అతను మతోన్మాది, ఎంతోమందిని పొట్టన పెట్టుకున్న నరహంతకుడని, రేపిస్ట్ అని మరి కొందరి అభిప్రాయం. క్లుప్తంగా చెప్పాలంటే – టిప్పు అభీష్టం నెరవేరి ఉంటే, బహుశా తూర్పు, పశ్చిమ పాకిస్తాన్తో పాటు, దక్షిణ పాకిస్తాన్ కూడా ఏర్పాటయ్యి ఉండేది.
“సత్యాన్ని ఆవిష్కరించాలి – అన్న ఏకైక లక్ష్యంతో చరిత్రకారుడు తిన్నగా ముందుకు సాగాలి; అంతేకానీ గాలివాటం ప్రకారం తెరచాపను సవరిస్తూ, మార్పులు చేస్తూ వెళ్ళడం సరికాదు”, అన్న డా. రమేష్ చంద్ర మజుందార్ గారి సూత్రమే ఈ రచనకు ప్రాతిపదిక. టిప్పు నిజస్వరూపం, ఉన్నది ఉన్నట్లుగా చూపించడం ఈ పుస్తకం వ్రాయడం వెనుక ఉన్న ముఖ్యఉద్దేశ్యం.
ప్లాస్టిక్ గుప్పిట్లో భూగోళం Plastic Guppatlo Bhugolam
ప్లాస్టిక్ గుప్పిట్లో భూగోళం Plastic Guppatlo Bhugolam
ప్లాస్టిక్ కాలుష్యం గురించి గత నాలుగు సంవత్సరాలుగా నేను చేసిన అధ్యయనాన్ని 38 వ్యాసాల సంకలనం పుస్తకంగా వెలువడింది. నిజానికి ప్లాస్టిక్ కాలుష్యం గురించి తెలుగులో వచ్చిన మొట్టమొదటి సైంటిఫిక్ పుస్తకం ఇది.
శ్రీరామచరితం Sri Rama Charitam
శ్రీరామచరితం Sri Rama Charitam
శ్రీ శివ సహస్రనామ స్తోత్రము (చంద్రికా భాష్యము) Sri Shiva Sahasranama Stotramu
ఈ శివ సహస్రనామ స్తోత్రం (చద్ధికాభాష్యంలో) అనేక ధర్మాలు, రహస్యాలు దాగివున్నాయి. శివుని ఒక్కో నామం వెనుక ఒక్కో ధర్మం, ఒక్కో విశిష్టత కనిపిస్తుంది. అలాంటిది వేయి నామాల విశిష్టత, ప్రాముఖ్యత వివరించడానికి ఈ జన్మ సరిపోదనిపిస్తుంది. మనం ఎన్ని పాపాలు చేసినా శివ సహస్రనామ స్తోత్ర పఠనం వల్ల పాపాలన్నీ పరమేశ్వరుని అనుగ్రహంతో నశించి పోతాయన్న సత్యాన్ని కూడా వ్యాసమహర్షి ఇందులో ప్రస్తావించాడు.
Rudraragalu-రుద్రరాగాలు
Annamaiah Padamrutam అన్నయ్య పాదామృతం
శ్రీనివాసుడిని సేవించి తరించిన పరమభాగవతోత్తముడు తాళ్లపాక అన్నమాచార్యులు. ఆయన ప్రతి పదం ఆ పరమాత్మ పాదాలకు సమర్పించిన పరిమళ పారిజాతం. ఆయన ప్రతి పాట తెలుగు వాకిళ్లకు కట్టిన వసివాడని పచ్చతోరణం. ఆ పదకవితాపితామహుడు. వేలకొలది కీర్తనలతో ఆ వేంకటేశ్వరుడిని వినుతించటమే కాదు, ‘నా వలన నీకు కీర్తి, నీ వలన నాకు పుణ్యము’ అని స్వామిపై సాధికారతతో ప్రేమగా ప్రకటించుకున్నాడు. ఆధ్యాత్మికత నుంచి అభ్యుదయం వరకు అన్నమయ్య తన సంకీర్తనల్లో స్పృశించని అంశమంటూ లేదు. అమరభాష అయిన సంస్కృతంలో కీర్తించినా, అచ్చమైన తెలుగులో ఆలపించినా, భావప్రకటనలో ఆ వాగ్గేయకారుడు చేయని ప్రయోగమంటూ లేదు. అలా ఆ సంకీర్తనాచార్యుడి సాహిత్యం ఓ సారస్వత క్షీరసాగరం అంటే అతిశయోక్తి కాదు. అందుకే పారమార్థిక పురోగతికే కాదు ప్రాపంచిక పరిణతికి కూడా ఆయన సద్భావనలు దీపగోపురాలు, సమాజంలోని భావకాలుష్యానికి సత్వర నివారణోపాయాలు.
మన సూరూజీ Mana Suruji
మన సూరూజీ Mana Suruji
శ్రీ సూర్యనారాయణ రావు గారు అనేక సంవత్సరాలు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ ప్రచారక్ గా పని చీసారు , వేలాది మందికి ప్రేరణగా నిలిచారు . వారిని విన్న వారు వారిని “అపర వివేకానంద” అనే వారు. ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ సేవ ప్రముఖ్ బాధ్యతను నిర్వహించి అనేక సేవ కార్యాలకు సూత్రధారి అయ్యారు. ఈ పుస్తకం వారి జీవితాని పరిచయం చేసి ఒక చిన్న ప్రయత్నం
వేదాలు ఉపనిషత్తుల నుండి కథలు Vedalu Upanishatalu Nundi Kathalu
వేదాలు ఉపనిషత్తుల నుండి కథలు Vedalu Upanishatalu Nundi Kathalu
ఇస్లాం అంతరంగం Islam Antarangam
ఇస్లాం అంతరంగం Islam Antarangam
ఈ గ్రంధరచన మూడు భాగాలుగా సాగింది;
మొదటి భాగంలో ఇస్లాం మత మూలాధార విషయాలు, మరియు షరియత్ గురించిన విశేషాలు ఉన్నాయి,
వివిధ ముస్లిం మత సంప్రదాయాలు, ఉప సంప్రదాయాలు రెండవ భాగంలో ఉన్నాయి;
ఇస్లాం `స్త్రీలు’ మొదలైన వివిధ అంశాల గురించి ఏమి చెప్తుందో, మూడవ భాగం వివరిస్తుంది.
This is a Telugu translation of the book ” Islam Ka Antardarsan in Hindi “
హిందూజన రక్షకుడు ఛత్రపతి శివాజీ Hindu janarakshakudu
హిందూజన రక్షకుడు ఛత్రపతి శివాజీ Hindu janarakshakudu
శివాజీ జీవిత లక్ష్యం ఏమిటి? యవనుల నాశనమే తన జీవితాశయమని ఆయన ఎందుకన్నారు? యవనులు చేసిన దారుణాలు ఏమిటి? ఆ దారుణాలు చేయడానికి కారణమైన వారి మతసూత్రాలు ఏమిటి? ఇస్లామిక్ రాజ్యపు స్వభావం ఏమిటి? శివాజీ స్థాపించిన హైందవీ సామ్రాజ్య లక్షణాలు ఏమిటి?
ఈ విషయాలను సంక్షిప్తంగా, క్లుప్తంగా వివరించే శ్రీ గజానన్ భాస్కర్ మహందలే రచన `Chatrapati Shivaji : Saviour of Hindu India’ కు తెలుగు అనువాదం `హిందూ జన రక్షకుడు ఛత్రపతి శివాజీ’ తప్పక చదవండి.
స్వాతంత్ర్య సమరంలో విజ్ఞాన శాస్త్రం swatantrya samaramlo vigyana shastram
స్వాతంత్ర్య సమరంలో విజ్ఞాన శాస్త్రం swatantrya samaramlo vigyana shastram
స్వాతంత్ర్య అమృత మహోత్సవాల సందర్భంగా స్వాతంత్ర్య సంగ్రామంలో విజ్ఞాన శాస్త్ర రంగం ద్వారా జరిగిన కృషిని, వెలుగులోకి రాని గాధలను వెలికితీయుటకు విజ్ఞాన భారతి చేసిన చిన్న ప్రయత్నమే ఈ పుస్తకం.
సెక్యులర్ ప్రపంచం’లో సెమిటిక్ మతాలు Secular Prapanchamlo Semitic mathalu
సెక్యులర్ ప్రపంచం’లో సెమిటిక్ మతాలు Secular Prapanchamlo Semitic mathalu
అబ్రహామీయ మతాలు (సెమిటిక్ మతాలు) అంటే ఏమిటి? వాటి తాత్విక భూమిక, మూలాలు ఏమిటి? వాటి లక్ష్యం ఏమిటి? అవి పనిచేసే తీరు ఏమిటి? ప్రపంచంలోనేకాక, మన దేశంలో అవి సృష్టించిన, సృష్టిస్తున్న సమస్యలు ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానమే ‘సెక్యులర్ ప్రపంచం’లో సెమిటిక్ మతాలు అనే పుస్తకం.
విస్మృత సామ్రాజ్యం విజయనగరం Vismruta Samrajyam Vijayanagaram
విస్మృత సామ్రాజ్యం విజయనగరం Vismruta Samrajyam Vijayanagaram
ఉత్తర దిశనుండి మహమ్మదీయుల దండయాత్రలను నిరోధించి దక్షిణ భారతదేశాన్ని రెండు శతాబ్దాలకు పైగా కాపాడిన హిందూ రాజ్యంగా విజయనగరం చరిత్రకారులు మన్ననలందుకున్నది. విజయనగర సామ్రాజ్య వైభవాన్ని చాటిచెప్పే మహానగరం విజయనగర పట్టణం, శత్రు రాజులు కూడా జీవితంలో ఒక్కసారి ఈ నగరాన్ని దర్శించి తరించాలని ఉవ్విళ్లూరారంటే అందులో ఆవంతైనా అతిశయోక్తి లేదు.
సృష్టి సంరక్షణ లో భారతీయ ఆవు
భారతీయ దేశీ ఆవు ప్రాముఖ్యము మరియు ఆవశ్యకతలను గూర్చి వివరించి చెప్పుటయే ఈ పుస్తకరచనలోని ముఖ్యోద్దేశము. మనదేశీ ఆవు భారతీయ జీవనానికి …
మహేతిహాసం Mahethihaasam
మహేతిహాసం Mahethihaasam
“భారతాన్ని మూల గ్రంథాధ్యయనం చేయకుండానే దుష్ట పక్షపాతం పెంచుకున్నవారి కాల్పనిక గాథలు ఎన్నో అపోహలనీ, అసత్యాలనీ పోగుచేశాయి. వాటిని తూర్పారబట్టి, అసలు భారతంలోని యథార్థాంశాలను సప్రమాణంగా విశ్లేషించిన వ్యాసాలివి. మూల భారతంలోని శ్లోకాలను ఉటంకిస్తూ పూర్వాపర పరిశీలనతో రచించిన వ్యాసాలు మహాభారత స్వరూపాన్ని ఆవిష్కరించే సత్య దర్శనాలు. ” – బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ
ఉపనిషత్ ప్రసంగలు upanishat prasangaalu
ఉపనిషత్ ప్రసంగలు upanishat prasangaalu
సమశ్రుతి Samashruti
సమశ్రుతి Samashruti
రచయిత : బాల త్రిపుర సుందరి


