Sale!

విద్యకు విముక్తి ?! Vidyaku Vimukti ?!

5.00 out of 5 based on 1 customer rating
(1 customer review)

Original price was: ₹120.00.Current price is: ₹100.00.

24 in stock

Compare
SKU: SatPr_034 Categories: , , Tags: , , ,

Description

‘ద్రోణాచలం’ అంటే తెలియదు, ‘డోన్’ అంటే తెలుస్తుంది! ‘శృంగవరపుకోట’ అంటే తెలియదు, ‘ఎస్.కోట’ అంటే ఎఱుక అవుతోంది!! ఇదంతా థామస్ బాబింగ్టన్ మెకాలే అన్నవాడు మన దేశంలో ఆవిష్కరించిన బ్రిటన్ జాతీయ విద్యావిధాన ఫలితం! పాశ్చాత్యశకం 1834లో అతగాడు ఈ విధానాన్ని మన నెత్తికెత్తాడు, మన విద్యను బందీ చేసిపోయాడు! పాశ్చాత్య శకం 1834 వరకు మనదేశంలో ఉన్నత విద్యాబోధనకు మాధ్యమం సంస్కృత భాష! ‘మెకాలే’ ఉన్నత విద్యాబోధన మాధ్యమ భాషగా సంస్కృతాన్ని తొలగించి ఆ స్థానంలో ఆంగ్లభాషను ప్రవేశపెట్టాడు! కానీ బ్రిటన్ విముక్త భారత్లో ప్రాథమిక పాఠశాల స్థాయిలో కూడా ఆంగ్లభాష మాధ్యమంగా బోధనలు మొదలయ్యాయి! భారతీయ విద్య ఆంగ్ల చెఱశాలలో చిక్కుకుంది. ‘మెకాలే’ విత్తిన బీజాలు మొలకెత్తి పెరిగి విషవృక్షాలుగా విస్తరించిపోవడం నడుస్తున్న చరిత్ర!

అనాదిగా మనదేశంలో విద్యావ్యవస్థ పరిపాలన వ్యవస్థ నియంత్రణకు గురి కాలేదు! విద్యావిధానం సర్వస్వతంత్ర వ్యవస్థగా కొనసాగింది! బ్రిటన్ విముక్త భారత్లో ఈ విధానం పునురుద్ధరణకు నోచుకొని ఉండాలి! న్యాయవ్యవస్థ వలె విద్యావ్యవస్థ ఉండాలన్నది ఆకాంక్ష! రాజ్యాంగ వ్యవస్థలో ప్రస్తుతం కార్య నిర్వాహక (మంత్రివర్గం) విభాగం, శాసననిర్మాణ విభాగం (చట్టసభలు) న్యాయవిభాగం (న్యాయస్థానాలు) ఉన్నాయి. రాజ్యాంగ వ్యవస్థలో నాలుగవ స్వతంత్ర విభాగంగా విద్యావిభాగం ఏర్పడాలి. 2020 జూలై 29వ తేదీ నాడు కేంద్రప్రభుత్వం నూతన జాతీయ విద్యావిధానాన్ని ఆవిష్కరించింది. ఈ నేపథ్యంలో ఈ రచన జరిగింది.

Publisher : Samvit Prakashan ; PaperBack ; Author :  Thangedukunta Hebbar Nageswararao ; Pages : 113

1 review for విద్యకు విముక్తి ?! Vidyaku Vimukti ?!

  1. 5 out of 5

    :

    Excellent book for everyone to understand how British education has systematically destroyed very Samskrit language and how post independence by continuing same policies it is causing existential crisis for regional languages. How New Education Policy aims to restore back our legacy especially by emphasising on education of kids in regional languages

Add a review

Select at least 2 products
to compare