Description
About the book :
In an easy to read fashion, the book exposes the various
భారతదేశం-పురాతన దేశం. విశ్వగురువుగా కీర్తింపబడిన దేశం. సనాతన ధర్మం మన దేశానికి ప్రాణం. విశ్వవిద్యాలయాల నుంచి డిగ్రీలు చేతపట్టుకుని బయటకు వస్తున్న మేధావులు బ్రిటను వారు దుర్బుద్ధితో కల్పించిన విష సిద్ధాంతాలను, తప్పుడు చరిత్రను వల్లెవేసుకుని వస్తున్నారు. తరతరాలకు కల్పిత చరిత్రను బోధిస్తున్నారు. ఈ ప్రచారవేత్తలలో దుర్బుద్ధితో కొందరు, అమాయకంగా, అనాలోచితంగా కొందరు ఈ కుట్ర కొనసాగింపులో భాగస్వాములవుతున్నారు. ఈ విషపన్నాగం నుంచి విముక్త అయినప్పుడే మనకు నిజమైన బౌద్ధిక స్వరాజ్యం ఏర్పడుతుంది. అటువంటి స్వాతంత్య్ర సాధన కోసం, స్వ-జాతీయ భావనిష్ఠతో బి.ఎస్. శర్మగారిచే రచింపబడిన పుస్తకం ‘సత్యపథం’.
A నుంచి Z వరకు వర్గీకృతమైన ఈ 26 వ్యాసాలలో బ్రిటను వారు ప్రచారం చేసిన వివిధ ద్రోహపూరిత అసత్యాలను గురించిన విశ్లేషణను రచయిత అందించారు . తరతరాలుగా వాస్తవాల వక్రీకరణను ఎందుకు ప్రచారం చేస్తున్నారో, దుష్ఫలితాలు, , అసలు సత్యం ఏమిటో వివరించారు. ఈ వ్యాసాలతో ఆవిష్కృ వాస్తవాలు మళ్లీ వెలుగు చూడాలి. చరిత్రలోని వక్రీకరణలు తొలగాలి!
colonial myths perpetrated within the Bharatiya society.


Reviews
There are no reviews yet.