Sale!

విస్మృత సామ్రాజ్యం విజయనగరం Vismruta Samrajyam Vijayanagaram

ఉత్తర దిశనుండి మహమ్మదీయుల దండయాత్రలను నిరోధించి దక్షిణ భారతదేశాన్ని రెండు శతాబ్దాలకు పైగా కాపాడిన హిందూ రాజ్యంగా విజయనగరం చరిత్రకారులు మన్ననలందుకున్నది. విజయనగర సామ్రాజ్య వైభవాన్ని చాటిచెప్పే మహానగరం విజయనగర పట్టణం, శత్రు రాజులు కూడా జీవితంలో ఒక్కసారి ఈ నగరాన్ని దర్శించి తరించాలని ఉవ్విళ్లూరారంటే అందులో ఆవంతైనా అతిశయోక్తి లేదు.

Original price was: ₹175.00.Current price is: ₹168.00.

Compare
SKU: Emeso_016 Categories: , Tags: ,

Description

ఉత్తర దిశనుండి మహమ్మదీయుల దండయాత్రలను నిరోధించి దక్షిణ భారతదేశాన్ని రెండు శతాబ్దాలకు పైగా కాపాడిన హిందూ రాజ్యంగా విజయనగరం చరిత్రకారులు మన్ననలందుకున్నది. విజయనగర సామ్రాజ్య వైభవాన్ని చాటిచెప్పే మహానగరం విజయనగర పట్టణం, శత్రు రాజులు కూడా జీవితంలో ఒక్కసారి ఈ నగరాన్ని దర్శించి తరించాలని ఉవ్విళ్లూరారంటే అందులో ఆవంతైనా అతిశయోక్తి లేదు.

ఆనాడు దేశవిదేశాలనుండి ఎందరో యాత్రికులు విజయనగరాన్ని సందర్శించారు. తాము చూసిన విజయనగర పట్టణాన్నీ, నాటి చరిత్రనూ కథనం చేశారు. తాము చూసిందానికి ఆనోటా ఈ నోటా విన్న చరిత్రను కూడా కొంత చేర్చారు. ఈ యాత్రికుల్లో డామింగో పెయిస్, ఫెర్నావో న్యూనిజ్ పేర్కొనదగినవారు.

ఈ ఇద్దరు పోర్చుగీసు యాత్రికుల కథనాన్ని పోర్చుగీసు భాషనుండి ఆంగ్లంలోకి అనువదించి ప్రచురించాడు స్యూయల్. వీటితోపాటు బారోస్, బరాడాస్లల కథనాన్నీ ఆయన అనువదించాడు. ఫెరిస్తా, ఇబన్ బతూతా, నికోలొ కొంటి, వర్తెమా, కాస్టన్ హెడా, బర్బోసా మొదలైన వారందరి కథనాలనుండి సమాచారాన్ని సేకరించి, నాటికి తెలియవచ్చిన శాసనాధారాలను పరిశీలించి తొలిసారిగా విజయనగర చరిత్రను ప్రామాణికంగా వెలువరించిన గౌరవం రాబర్ట్ స్యూయల్కే దక్కుతుంది.

ఆయన తన చరిత్ర గ్రంథం ‘ఎ ఫర్ టెన్ ఎంపైర్’ (A Forgotten Empire ) ను భారతదేశ చరిత్రకు తాను చేసిన సేవగా చెప్పుకోవడంలో ఏమాత్రం అత్యుక్తి లేదు. క్రీ.శ. 1900లో ప్రచురితమైన ఈ గ్రంథం శాస్త్రీయంగా, నిష్పక్షపాతంగా రచించిన గ్రంథం

ISBN : 978-9380409030; Author : Robert Sewell; Translation & editing : D. Chandrasekhar Reddy  ; Emesco books ;

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

Select at least 2 products
to compare