Description
Authors : Santosh Ayyalasomayajula & K Sahadev
ఈ పుస్తకం ఎందుకు?
గ్రామంలో ఒక సమస్య ఏర్పడింది. అది పరిష్కారం కావట్లేదు. అధికారులు పట్టించుకోవట్లేదు. ఆ ఊరివాళ్ళు సమస్య పరిష్కారం కోసం, అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా ఉద్యమం చేపట్టారు. ధర్నా చేశారు. అధికారికి విజ్ఞాపన పత్రం ఇచ్చారు. సమస్య పరిష్కరిస్తామని అధికారి వారికి హామీ ఇచ్చారు. కొన్ని రోజులు గడిచాయి. ఆ సమస్య మాత్రం అలాగే ఉంది. గ్రామస్తులు ఎదురుచూడటం తప్ప ఏమీ జరగట్లేదు. మళ్ళీ ధర్నా కార్యక్రమం చేయాలి అనుకున్నప్పటికీ, అప్పటికే విసిగి వేసారిపోయిన ప్రజలు చేసేదేముందిలే అని కాలం గడుపుతున్నారు.
ఒక సమస్యపై పోరాటం చేయాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు, తాత్కాలికంగా ధర్నా, రాస్తారోకో వంటి శక్తి ప్రదర్శన కార్యక్రమాలతో నిరసన తెలియజేసి, అధికారులు ఇచ్చే నోటిమాట హామీలతో సంతృప్తి చెంది, ఇక ఆ సమస్యను మర్చిపోయి వేరే సమస్య మీద దృష్టి కేంద్రీకరించే పద్దతి ఇప్పుడు కొనసాగుతోంది. ఈ ‘తాత్కాలిక పోరాటం’ లేదా ‘తాత్కాలిక నిరసన ప్రదర్శన’ల కారణంగా రాజకీయ పార్టీలకు ప్రచారం వస్తుందేమో తప్ప నిజంగా సమస్య పరిష్కారం కాదు.
సమస్యను సమర్ధవంతంగా ఎదుర్కోవాలి అంటే రెండు మార్గాలు.. ఒకటి, సమస్య పరిష్కారం అయ్యేదాకా పోరాటం చేయడం, రెండు.. అసలు సమస్య ఉత్పన్నం కాకుండానే ముందే జాగ్రత్తపడటం. క్రైస్తవ మతమార్పిళ్లపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ చేస్తున్న పోరాటంలో భాగంగా అనేక గ్రామాలలో పర్యటించడం, వివిధ రూపాల్లోని సమస్యలు తెలుసుకోవడం, వాటి పరిష్కారానికి సూచనలు చేయడం మాకు నిత్యకృత్యంగా మారింది. ఆ సమస్య తాత్కాలిక పరిష్కారం కోసం కాకుండా, భవిష్యత్తులో ఎదురయ్యే అవకాశం ఉన్న మరికొన్ని సమస్యల గురించి ముందుగా హెచ్చరించి కొన్ని కీలకమైన సూచనలు చేస్తుంటాము. కొందరు పాటిస్తారు, కొందరు విని ఊరుకుంటారు. సమస్య వచ్చాక చూద్దాంలే అనుకుంటారు. పాటించని వారిలో అనేకమంది తిరిగి అదే తరహా సమస్యలపై మమ్మల్ని సంప్రదిస్తారు. సమస్య పీకల మీదకి వచ్చాక పరిష్కారం కోసం పరుగులు తీయటం అంటే దాహం వేసినప్పుడు నీటి కోసం బావిని తవ్వడం వంటిదే.
పైన చెప్పుకున్న గ్రామంలో సమస్యపై పోరాటం తీరును ఇప్పుడు కాస్త మార్చి చూద్దాం.. ధర్నా స్థానంలో గ్రామస్థుల సంతకాలతో సంబంధిత అధికారులకు వ్రాతపూర్వక ఫిర్యాదు చేస్తే? ఇంతవరకు తాము ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారం కోసం తీసుకున్న చర్యల వివరాలు, చేసిన ప్రయత్నాల వివరాలు సమర్పించమని కోరుతూ సమాచార హక్కు చట్టం క్రింద దరఖాస్తు చేస్తే? సమస్యపై గ్రామస్థులు అందరూ కలిసి గ్రామసభ తీర్మానం చేస్తే? ఎలా ఉంటుంది?
దేశంలో వ్యవస్థ అనేది పేపర్ల మీదనే నడుస్తుంది. అంటే ప్రభుత్వ యంత్రాంగంలో ఏవిధమైన పని జరగాలన్నా అందుకు సంబంధించి మొదట ఏదైనా జీవో లేదా ఆదేశం జారీ చేయడమో జరగాలి. ఇక్కడ ప్రతీదీ వ్రాతపూర్వకంగానే ఉంటుంది తప్ప నోటిమాటతో ఏదీ జరగదు, జరగకూడదు. అదే పెన్ను, కాగితానికి ఉన్న బలం.
అదే విధంగా దేశ పౌరుడు ఏదైనా సమస్యపై ఒక నిర్దిష్ఠమైన పద్ధతిలో వ్రాసి సమర్పించే ఫిర్యాదులకు మన దేశంలో చాలా విలువ ఉంటుంది. ఈ ఫిర్యాదులకు స్పందించే బాధ్యత ప్రభుత్వ అధికారులకు ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఫిర్యాదులు చేసే విధానాన్ని మనం విస్మరిస్తున్నాం. దీనికి కారణం కూడా ఉంది. అమెరికా వంటి విద్యాధిక దేశాలతో పోల్చితే మన దేశంలో పౌరులకు చట్టాలపై అవగాహన చాలా తక్కువ. ప్రభుత్వాలు కూడా ప్రజలకు చట్టపరమైన అవగాహన కార్యక్రమాలు అంతగా ప్రోత్సహించవు. ఫలితంగా అవినీతి, వ్యవస్థలో జవాబుదారీతనం లేకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీన్ని ప్రశ్నించాల్సిన విధంగా ప్రశ్నించకపోవడం, పోరాడాల్సిన విధంగా పోరాటం చేయకపోవడం వల్ల అవినీతికి పాల్పడే వారు తమ పనులు యథేచ్ఛగా చేసుకుపోతున్నారు.
ఉద్యమం అంటే కేవలం బహిరంగ శక్తి ప్రదర్శన మాత్రమే కాదు. మనకున్న శక్తి, ఆర్ధిక, మానవ వనరులు, మౌలిక సదుపాయాల సహాయంతో, అందుబాటులో ఉన్న చట్టాలను వినియోగించుకుని పెన్ను, పేపర్ సహాయంతో చేసే ఉద్యమం ద్వారా ఎలాంటి సత్ఫాలితాలు సాధించవచ్చుననే అంశాలు తెలియజేయడమే మా ఉద్దేశం.
రెండు తెలుగు రాష్ట్రాల స్నేహితులు, హిందూ కార్యకర్తలు అనేక మంది అనేక సందర్భాల్లో ఇలాంటి ఒక పుస్తకం వ్రాస్తే బాగుంటుందని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల హిందూ కార్యకర్తలతో పాటు వివిధ గ్రామాల్లోని ప్రజలు తమకు ఎదురయ్యే సమస్యలపై తమకు తాముగా పోరాటం చేసేందుకు కావాల్సిన అవగాహన కలిగే విధంగా ఒక పుస్తకం వ్రాస్తే బాగుంటుందని అనేకసార్లు కోరడంతో ఈ పుస్తకాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నాము. ప్రజలు తమకు ఎదురయ్యే సమస్యలపై న్యాయపోరాటం చేయడానికి న్యాయశాస్త్రం (లా) చదవాల్సిన అవసరం లేదు, దేశీయ చట్టాలపై కనీస అవగాహనా ఉంటే చాలు అని ఈ పుస్తకం చదివేవారికి అర్ధమవుతుంది. ఇది న్యాయ (లీగల్) పోరాటం చేసే వారిని దృష్టిలో పెట్టుకుని వ్రాసిన పుస్తకం.
క్రైస్తవ మతమార్పిళ్లపై పోరాటం అంశం ప్రధానంగా వ్రాసిన ఈ పుస్తకంలో లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ జరిపిన ప్రయోగాల గురించి మధ్యమధ్యలో ఉదాహరణలుగా వివరించడం జరుగుతుంది.
ఈ పుస్తకం చదివే పాఠకులకు, కార్యకర్తలకు గమనిక ఏమిటంటే, ఇందులో పొందుపరిచిన జీవోలు, చట్టాలు, నిబంధనలు కాలానుగుణంగా ఆయా పరిస్థితులను బట్టి, ప్రభుత్వాలను బట్టి మారే అవకాశం ఉంది. ఈ పుస్తకం రాసేనాటికి అమలులో ఉన్న నిబంధనలు, జీవోల గురించి ప్రస్తావించడం జరిగింది. అయితే ఈ నిబంధనలకు ప్రభుత్వం కాలానుగుణంగా చేసే సవరణల గురించి ఎప్పటికప్పుడు కార్యకర్తలు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది.
2. ‘మతప్రచారహక్కు’తో ప్రమాదం: రాజ్యాంగ నిర్మాణ కమిటీలో చర్చ
3. మతస్వేచ్ఛ Vs నైతికత: రాజ్యాంగ హక్కు, పరిమితులు
4. మతం మారితే రిజర్వేషన్ ఉండదు – రాష్ట్రపతి రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాల) ఉత్తర్వు 1950
5. మతమార్పిడి/పునరాగమనం సందర్భాల్లో `కులం’ స్థితిపై కోర్టు తీర్పులు
6. ఎస్సీ రిజర్వేషన్ల దుర్వినియోగంపై ఫిర్యాదు చేసే విధానం
7. మతమార్పిడి ప్రక్రియలో ‘బాప్టిజం’ తప్పనిసరి కాదు
8. దేశంలో మతమార్పిడి నిరోధక చట్టాలు – పూర్వాపరాలు
9. స్వాతంత్య్రం తరువాత దేశంలో మతమార్పిడి నిరోధక చట్టాలు
10. లవ్ జిహాద్: ప్రేమ, వివాహం ద్వారా మతమార్పిళ్లు
11. లౌడ్ స్పీకర్ల ద్వారా ధ్వని కాలుష్యం – సమస్యలు – పరిష్కార మార్గాలు
12. మతస్వేచ్ఛ పేరిట శబ్ద కాలుష్యం – పలు న్యాయస్థానాల తీర్పులు
13. బాలల హక్కుల సంరక్షణ
14. పాఠశాలల్లో మతప్రచారం రాజ్యాంగ విరుద్ధం
15. బాలల సంరక్షణ కేంద్రాల్లో అవినీతి, అక్రమాలు
16. విదేశీ పాస్టర్ల వీసా నియమాల ఉల్లంఘనలు – చట్టపరమైన చర్యలు
17. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్: నిబంధనలు, చర్యలు & సవరణలు
18. సమాచార హక్కు చట్టం 2005: కార్యకర్తల చేతిలో బ్రహ్మాస్త్రం
19. ప్రార్ధనా మందిరాల నిర్మాణానికి నియమ నిబంధనలు
20. ‘స్వస్థత’ పేరిట మతమార్పిడులు చట్టవిరుద్ధం
21. విద్యాలయ ప్రాంగణాల్లో మత సభలు చట్టవిరుద్ధం
22. గ్రామసభల ద్వారా దేశ రక్షణ
23. ఘటనపై ఫిర్యాదు చేయడం తప్పనిసరి
24. ఫిర్యాదులకు అధికారులు స్పందించకపోతే?
25. మతమార్పిళ్లు దేశానికి పెను ప్రమాదం
26. ఆంధ్రప్రదేశ్ లో మతమార్పిడులపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ రిపోర్ట్
27. కార్యకర్తలకు ముఖ్య సూచనలు
ISBN : 978-81-955401-3-6 ; Samvit Prakashan ; Paperback ; Pages : 115;


Srikanth – :
మతం పేరుతో అక్రమాలు, న్యాయపోరాటానికి మార్గాలు!!
ఇది కేవలం పుస్తకం కాదు.. సామాన్య గ్రామీణ ప్రజల నుండి అసామాన్య ఉద్యమాలు చేసే కార్యకర్తల వరకు ఒక కరవాలం..
ఇందులో పొందుపరిచిన విషయాలు అన్నీ ఇన్ని కావు.. సమకాలీన సమస్యలు, దేశానికి ధర్మానికి ఈ సమస్యల వల్ల కలిగే నష్టాల పైన ఎలా పొరదలో కూలంకషంగా గా చెప్పడం జరిగింది.. అలాగే ఈ సమస్యలను కేవలం నిరసన ద్వారానో లేక బాహ్య ఉద్యమం ద్వారానో మాత్రమే కాకుండా చట్టాన్ని ఎలా వాడుకోవచ్చు, వాడుకొని సమస్యని సమూలంగా ఎలా పరిష్కరించవచ్చు అని సవివరంగా citations, references, examples తో చెప్పడం జరిగింది..
ఈ పుస్తకం రాయడానికి సంతోష్ అన్న గారు, సహదేవ్ అన్న గారు చేసిన రీసెర్చ్, వారి కష్టం అంత ఇంత కాదు అని నేను భావిస్తున్నాను.. నాకు ఇందులో అన్నిటికంటే నచ్చిన విషయం, విషయాన్ని సూటిగా, గోడ కట్టినట్టు ఎటువంటి భావోద్వేగాలకి తావు లేకుండా చాలా సూక్ష్మం, కాంప్లికేషన్స్ తో కూడుకున్న విషయాలను సాధారణ తెలుగు మాత్రమే చదివగలిగే వారికి కూడా అర్ధం అయ్యేలా రాయడం.
అసలు ప్రభుత్వం, చట్టం ఎలా పనిచేస్తుంది అని కూడా అవగాహన లేని నాలాంటి సామాన్య పౌరుడికి చాలా ఉత్సాహాన్ని, దేశానికి ధర్మానికి చాలా ఉపయోగపడేవి చాలా తెలుసుకున్న ఈ రోజు అన్న ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది.
ఇందులో నాకు అన్నిటికంటే నచ్చిన టాపిక్స్ ఎంత తోపు మిషనరీస్ని కూడా చట్టబద్దం గా ఎలా మట్టి కరిపీంచవచ్చో ఆచరణలో LRPF చేసి చూయించిన విధానం.
ఇదొక్క పుస్తకం మన దగ్గర ఉంటే చాలు మనకి రోజు చూసే చాలా సమస్యలకి వాటి సమాధానాలకి నిఘంటువు లాగా ఉంటుంది..
ఈ పుస్తకానికి ఇది చాలా చిన్న రివ్యూ .. చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయి ఇందులో.. చదవటం మొదలు పెడితే ఆపలేం.. అంతే engaging గా రాశారు..
Ponnapalli Rajasekhara Somayajulu – :
This is a must read book and not just to read, understand and do our part to stop the conversions with our intellectual brain. There are so many legal laws, which are drafted in the book and we do not need to search in the internet and a One stop place to know all laws to stop the missionaries activities. Please purchase the book and read to protect the Hindu Dharma.
Aparna Dusi (verified owner) – :
This book gave a lot of enthusiasm to a common citizen like me who didn’t even know how the actual government and law works, I have learned a lot of things that are very useful for the country… self Satisfaction and self confidence 🙏😊
A much needed and highly recommended handbook
Swapna – :
ధర్మ రక్షకులకు మాత్రమే కాదు సగటు ప్రజానీకానికి ఎంతో ఉపయుక్తంగా ఉంది ఈ పుస్తకం. గ్రామీణ ప్రాంత ప్రజలకు తమ గ్రామంలో ఏర్పడే సమస్యలు ఎలా పరిష్కారం చేసుకోవాలో చాలా బాగా సూచించారు
Dinesh y (verified owner) – :
Excellent book.
But, if we try to do the things in the book and if any of them ( muslims or Christians) targets us individually, who will save us.
HindueShop – :
We need to create our own eco-system. Get connected with a local Hindu organisation