Idi Chraistavam – Telugu – ఇది క్రైస్తవం

క్రైస్తవులు ఏ లక్ష్యంతో మన మధ్య పనిచేస్తున్నారు? వారి చర్యలు, ప్రచారాల ద్వారా మనకు కలిగే కష్టనష్టాలేమిటి? — ఈ విషయాలను హిందువులు తగినంత పట్టించుకోలేదు.

ఈ పుస్తకం క్రైస్తవాన్ని అర్ధం చేసుకోవడంలో హిందువులకే కాక క్రైస్తవులకు కూడా సహాయపడుతుంది.

5.00 out of 5 based on 1 customer rating
(1 customer review)

150.00

1 in stock

Compare

Description

  • రచన : అరిందమ

హిందువులకు కొన్ని వందల ఏళ్లుగా క్రైస్తవులతో పరిచయం ఉంది. హిందూ దేశంలో క్రైస్తవులు నివసిస్తూ మతప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంకా అనేక విధాలుగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఇటీవల క్రైస్తవుల నుండి హిందువులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. హిందు-క్రైస్తవ సంబంధాలలో అనేక ఒడిదుడుకులు చోటుచేసుకున్నాయి. హిందువులు క్రైస్తవుల మాటలను, చేతలను తమకు చేతనైన రీతిలో వ్యాఖ్యానించుకుని అర్ధం చేసుకుంటున్నారు. తమ అవగాహన మేరకు క్రైస్తవులతో వ్యవహరిస్తున్నారు.

క్రైస్తవుల పట్ల హిందువుల అవగాహన సమగ్రమైనది కాదని అనేక సందర్భాల్లో రుజువైంది. క్రైస్తవుల మాటలకు, చేతలకు హిందువులు చెప్పుకుంటున్న అర్ధాలు సరైనవి కావని దేశంలో గతంలో జరిగిన, ఇప్పుడు జరుగుతున్న అనేక సంఘటనలను బట్టి చెప్పవచ్చు. కాబట్టి హిందువులు క్రైస్తవాన్ని, క్రైస్తవ మత గ్రంథాన్ని, క్రైస్తవ ప్రవక్తను గురించి మరింత నిర్దుష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఈ పుస్తకం అందుకు సహాయపడుతుంది. ఇప్పటి వరకు హిందువులు క్రైస్తవ ప్రచారం ద్వారా మాత్రమే క్రైస్తవం గురించి తెలుసుకున్నారు. ఆ ఎరుక మీద అభిప్రాయాలు ఏర్పరచుకుని, ఆ అభిప్రాయాల ఆధారంగా క్రైస్తవులతో వ్యవహరిస్తున్నారు. కానీ క్రైస్తవ ప్రచారంలో నిజమెంత? నిజాయితీ ఎంత? వారు చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉందా? ఒకవేల వారి మాటలకూ, చేతలకు పొంతన లేనట్లయితే దానికి కారణం ఏమిటి?

క్రైస్తవులు ఏ లక్ష్యంతో మన మధ్య పనిచేస్తున్నారు? వారి చర్యలు, ప్రచారాల ద్వారా మనకు కలిగే కష్టనష్టాలేమిటి? — ఈ విషయాలను హిందువులు తగినంత పట్టించుకోలేదు.

ఈ పుస్తకం క్రైస్తవాన్ని అర్ధం చేసుకోవడంలో హిందువులకే కాక క్రైస్తవులకు కూడా సహాయపడుతుంది.

1 review for Idi Chraistavam – Telugu – ఇది క్రైస్తవం

  1. 5 out of 5

    (verified owner):

    Every Hindu must read this book.
    ప్రతి హిందువు తప్పకుండా చదవ వలసిన పుస్తకం.

Add a review

Select at least 2 products
to compare