ఇదీ క్రైస్తవం – idi Craistavam
ఇదీ క్రైస్తవం – idi Craistavam
హిందువులు క్రైస్తవుల మాటలకు, చేతలకు తమకు చేతనైన రీతిలో వ్యాఖ్యానించుకొని, అర్థం చేసుకొంటున్నారు. తమ అవగాహన మేరకు క్రైస్తవులతో వ్యవహరిస్తున్నారు. క్రైస్తవుల పట్ల హిందువుల అవగాహన సమగ్రమైనది కాదని అనేక సందర్భాల్లో ఋజువైంది. క్రైస్తవుల మాటలకు, చేతలకు హిందువులు చెప్పుకొంటున్న అర్థాలు సరైనవి కావని దేశంలో గతంలో జరిగిన ఇప్పుడు జరుగుతున్న అనేక సంఘటనలను బట్టి చెప్పవచ్చు. కాబట్టి హిందువులు క్రైస్తవమతాన్ని, క్రైస్తవమతగ్రంథాన్ని, క్రైస్తవ ప్రవక్తను గురించి మరింత నిర్దుష్టంగా తెలుసుకొనే ప్రయత్నం చెయ్యాలి. ఈ పుస్తకం అందుకు సహాయపడుతుంది.
చార్వాకం : నాటి నుండి నేటికీ Charvakam Nati nundi netiki
చార్వాకం : నాటి నుండి నేటికీ Charvakam Nati nundi netiki
`చార్వాకం’ అంటే ఏమిటి? అది పురాతన కాలంలోనే ఉండేదా? లేక ఇప్పుడు కూడా ఉందా? చార్వాకులు ఎలా ఆలోచిస్తారు? ఎలా ప్రవర్తిస్తారు? వారి జీవన లక్ష్యం ఏమిటి? చార్వాక ధోరణి ఇప్పుడు ఎక్కడ ఉంది? అది ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేస్తోంది? ప్రజాజీవితాన్ని ప్రభావితం చేసే ప్రస్తుత చార్వాకా(ప్రచ్చన్న చార్వాకాలు)లకు పురాతన చార్వాకానికి పోలిక ఏమిటి? ఈ విషయాలను తెలుసుకోవాలంటే `చార్వాకం – నాటి నుండి నేటికి’ అనే పుస్తకం తప్పక చదవాలి. సాంస్కృతిక విధ్వంసానికి పూనుకున్న చార్వాక ధోరణిని అర్ధం చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
గోవా ఇంక్విజిషన్ : క్రైస్తవమత విచారణ సంస్థ (Telugu ) Goa Inquisition
ఇంక్విజిషన్ అనేది క్రైస్తవ మతస్తులు కానివారిని, తమకు నచ్చని సాటి క్రైస్తవులకు అవిశ్వాసులనే ముద్ర వేసి, వేటాడి, శిక్షించడానికి ఏర్పడిన ఒక క్రైస్తవమత విచారణ సంస్థ. “హోలీ పోలీస్” (పవిత్ర పోలీస్) అనేది ఇంక్విజిషన్ అధికార నామం. క్రైస్తవమతం పుట్టిన నాటి నుంచీ అసహనం దాని సహజ లక్షణంగా ఉంటూ వచ్చింది. రోము సామ్రాజ్యానికి ఆధికారిక మతంగా మారిన తరువాత అది మరింత గట్టి పడింది.
13వ శతాబ్దిలో దక్షిణ ఫ్రాన్సును అల్లకల్లోలం చేసి, అక్కడి జనాభాను తుడిచిపెట్టి, నాగరికతను రూపుమాపిన క్రూసేడులు ఇంక్విజిషన్ అనే మతయుద్ధాలు ‘పవిత్ర’ సంస్థ ఆవిర్భావానికి దారితీశాయి.
