Sale!

కార్యకర్త – Karyakarta ( Telugu )

శ్రీ దత్తోపంత్ జీ, ఒక కార్యకర్తకు ఉండవలసిన అనేక గుణాలను, అతనికి ఎదురుకాగల ప్రమాదాలను చాలా విస్తృతంగా, క్షుణ్ణంగా చర్చించారు.

Original price was: ₹300.00.Current price is: ₹290.00.

3 in stock

Compare

Description

*కార్యకర్త* పుస్తక పరిచయం:
మాననీయ దత్తోపంత్ బాపూరావ్ ఠేంగ్డే జీ భావనిధిని ఆవిష్కరించే పుస్తకానికి ముందుమాట వ్రాయబూనటం, చరాచర సృష్టినంతటినీ తన తేజః ప్రసారంలో ఆవరించిన సూర్యభగవానునికి చిరుదీపంతో హారతి నీయటం వంటిదది!
1. అధిష్ఠానము, 2. కార్యపద్ధతి, 3. కార్యకర్త అనే మూడు దృక్కోణాల నుండి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ గురించిన చర్చ ఇందులో చేయబడింది.
శ్రీ దత్తోపంత్ జీ, ఒక కార్యకర్తకు ఉండవలసిన అనేక గుణాలను, అతనికి ఎదురుకాగల ప్రమాదాలను చాలా విస్తృతంగా, క్షుణ్ణంగా చర్చించారు. కార్యకర్త ఎప్పుడూ, ఇతరులయొక్క, సమాజంయొక్క శ్రేయస్సు గురించే ఎందుకు ఆలోచించాలి? అని ఎవరైనా అడిగితే, శ్రీ దత్తోపంత్ జీ సమాధానం: The best should suffer, so that the rest may prosper.
తమ సహజ సిద్ధమైన ప్రతిభ (శక్తి), లోకానుభవం వల్ల కలిగిన నైపుణ్యము, సంఘ కార్యంలో ఆర్జించిన అనుభవము, ప.పూ గురూజీ సాన్నిహిత్యం వల్ల సంక్రమించిన జ్ఞానసంపద, సామాన్య దృష్టిని ఆశ్చర్యచకితం చేసే విస్తృతి, విషయ వైవిధ్యమూ,  ఈ పుస్తక రూపంలో కనబడుతుంది.
అధర్వ వేదం నుండి బైబిల్ వరకు, సంత్ జ్ఞానేశ్వర్ నుండి  ఉమర్ ఖయ్యాం వరకు, డయోనీసియస్ నుండి కారల్ మార్క్స్ వరకు, పతంజలి యోగ సూత్రాల నుండి ఎమర్సన్, కార్ల్ ఐల్ వరకు, సమర్థ రామదాస్ నుండి జోసెఫ్ మాజినీ వరకు, నారద భక్తి సూత్రాల నుండి విశ్వ గుణా దర్శ చంపువు వరకు, యోహాను సువార్త నుండి వండర్ లాండ్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్ వరకు అనేక సంస్మరణల ఉదాహరణల రత్న భాండరం ఈ గ్రంథంలో కాంతులీనుతోంది.
ఈ పుస్తకమంతా అపరోక్షానుభూతివల్ల ప్రాప్తించిన మౌలిక జ్ఞానంతో నిండి ఉన్న ఒక ఉపనిషత్తు వలె అనిపించుతూ ఉంది. అవును… ఇది సంఘోపనిషత్తు – మా. గో. వైద్య

Author

Dattopant Thengadi

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

Select at least 2 products
to compare