Description
1925లో కమ్యూనిస్టు పార్టీ పుట్టినప్పటినుండి వందేళ్ళ వైపు బలహీనంగా పాకుతున్న వేళ ఆ పార్టీ పరిస్థితి ఇలా ఎందుకు తయారైంది అనే విషయం పలువురితో చర్చించినపుడు అది స్వయంకృతాపరాధం అనేది ధృవీకరణ అయింది.
ప్రతి దశాబ్దంలో ఒక పెద్ద చారిత్రాత్మక తప్పిదం కమ్యూనిస్టులు చేశారు. అయితే జ్యోతిబసుని ప్రధానమంత్రి పదవిని స్వీకరించకుండా సిపిఎం అడ్డుకోవడం మాత్రమే తప్పిదంగా బహిరంగంగా అంగీకరించారు. దానికి ముందు అనేక తప్పిదాలు, దాని తర్వాత మరికొన్ని తప్పిదాలు చేస్తూనే ఉన్నారు. ఆ తప్పిదాల చిట్టా చాలా పెద్దది. అందులో నుండి చాలా ముఖ్యమైనవి గుర్తించి వ్యాసాలుగా ప్రచురించే యత్నం చేశాము.
నేను అడిగిన వెంటనే ఆలోచనను మెచ్చి, అంగీకరించి తమ వంతుగా ఒక కమ్యూనిస్టుల తప్పిదాన్ని ఎంచుకుని వ్యాసంగా వ్రాసి యిచ్చిన సాటి రచయితలకు, కార్టూన్లు అందించిన శ్రీధర్, సరసి, నాగిశెట్టి గార్లకు ధన్యవాదాలు. రచయితలందరూ పేరుమోసిన వారు. సూటిగా, స్పష్టంగా వ్రాసినవారు. కాబట్టి ఈ పుస్తకాన్ని కమ్యూనిస్టులపై వాస్తవాలుగా స్వీకరించాల్సిందే. చదివి చర్చించమన్నదే కోరిక.
Author : Duggaraju Srinivas Rao ; Publisher: Sahitya Niketan V’wada.

