Description
ధర్మం కేవలం మానవజాతికి మాత్రం సంబంధించిన ఆలోచన కాదు. సంపూర్ణ సృష్టి ప్రక్రియ ధర్మంతో ఆవరింపబడి ఉంది. నీరు, నిప్పు, గాలి-ప్రతిదానికీ తనదైన ధర్మం ఉంది. ఆ ధర్మం కాకుండా దానికి అస్తిత్వమే ఉండదు. కాలడం అగ్ని ధర్మం. అగ్ని లాగే ఉండి, కేవలం వెలుతురునిచ్చే, వేడిమి లేని మరింకేదాన్నో చూపితే దాన్ని అగ్ని అనలేము. గాలి తన చలన గుణాన్ని, మరచి ఒకేచోట నిలబడిపోతే అది గాలి అనిపించుకోదు. ఆధారమిచ్చేది భూమి (నేల) ధర్మం. కాబట్టి ఆమెను ధరా, ధరిత్రి, ధరణి మొదలగు పేర్లతో పిలవడం జరిగింది. ఒకవేళ అది తన ధర్మాన్ని వదిలేస్తే ఈ పేర్లన్నీ అర్ధహీనమవుతాయి. ఇలా ఈ బ్రహ్మాండంలో ఉన్న ప్రతి ఒక్క చిన్న, పెద్ద వస్తువుకూ తనదైన ధర్మముంది. ఆ ధర్మమే దాని అస్తిత్వం, స్వభావం, గుర్తు అవుతుంది.
Author : Ranga Hari ; Paperback ; Publisher : Sahitya Niketan, Vijayawada


Reviews
There are no reviews yet.