Telugu Newsletter – Magh 5123
- February 25, 2022
- 0 Comment(s)
హిందూ ఈషాప్ బులెటిన్- మాఘ మాసం
హిందూ ఈషాప్లో కొత్త పుస్తకాలు
నేతాజీ Netaji By MVR Sastry
భారత స్వాతంత్ర్య సమర ప్రధాన సేనాపతి ఆల్ టైమ్ గ్రేట్ విప్లవ వీరుడు నేతాజీ సుభాస్ చంద్ర బోస్ ( Netaji Subhash Chandra Bose ) రాజకీయ జీవిత అద్భుత చరిత్ర భారత స్వాతంత్ర్య పోరాట ప్రధాన ఘట్టాలు, వాటిలో బోస్ పాత్ర, ప్రభావాలపై విఖ్యాత రచయిత ఎం.వి.ఆర్.శాస్త్రి విలక్షణ విశ్లేషణ. ఈ పుస్తకం వారు వ్రాసిన ” నేతాజీ సుభాస్ చంద్ర బోస్” పుస్తకం రెందువ భాగం .
ఆరోగ్య సాధన Arogya Sadhana
స్ప్రాచీన భారతంలో మన పూర్వీకులు సహజ జీవన విధానాల ద్వారా సంపూర్ణ ఆరోగ్యమును కలిగి వారి ఐహిక, ఆధ్యాత్మిక జీవిత లక్ష్యాలను సాధించగలిగారు. అటువంటి జీవన విధానాన్ని ఈ ఆధునిక కాలంలో కూడా సాధించడానికి అవసరమైన సాధనా పద్ధతులు శాస్త్రీయంగా, సులువుగా మరియు ఆచరణ యోగ్యంగా ఈ పుస్తకంలో వివరింపబడ్డాయి.
కొన్ని పుస్తకాలు – మీ కోసం
శ్రీమద్ రామాయణ కల్పవృక్షం Six Vols Srimad Ramayana Kalpavriksham
విశ్వనాథ సత్యనారాయణ రచన “రామాయణ కల్పవృక్షం” అతని సాహితీ ప్రతిభకు, తాత్విక భావాలకు, ఆధ్యాత్మిక ధోరణికి, తెలుగు సాహిత్యంలో పద్య కావ్యాల విశిష్టతకు నిదర్శనంగా ప్రసిద్ధమైంది. రామాయణాన్ని, విశ్వనాథను, పద్యకవిత్వాన్ని విమర్శించే వారికి కూడా ఇది ఒక ప్రధాన లక్ష్యంగా ఉంటున్నది. మొత్తం రామాయణం సెట్లో ఆరు పుస్తకాలు ఉన్నాయి, ఇందులో ఒక్కొక్కటి ఒక కాండతో వ్యవహరిస్తాయి. అన్ని కాండలను కవిత్వ రూపంలో మాత్రమే వర్ణించారు. దయచేసి పద్యాలకు వివరణ భాగం ఉండదని గమనించండి. పద్యము అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడని సాధారణ భాషలో ఉన్నాయి
రాణా ప్రతాప్ Rana Pratap
రాణాప్రతాపునివంటి త్యాగమూర్తి వీరచరిత్రం చదివి ఒకానొక క్లిష్ట సమయంలో ఒక జాతి అంతరించిపోకుండా ఎలా నిలబడిందో, ఆపైన ఎలా కొనసాగిందో. తెలిసికొననివారు జాతికి ఉపయోగపడే ఉత్కృష్ట కార్యాలను చేయజాలరు. అన్నివైపుల నుండి వివిధవిధాల మాయోపాయాలతో ఎన్నెన్నో విదేశీశక్తులు మనదేశాన్ని శఙరించడానికి క్రమ్ముకొనివస్తున్న ఈ తరుణంలో మనజాతి జనులందరికీ అవశ్యపరనీయమైనది ఈ రాణా ప్రతాప్ చరిత్ర.
కశ్మీర రాజతరంగిణి కథలు Kashmira Rajatarangini Kathalu
కథలు కల్హణ విరచితమైన ‘కశ్మీర రాజతరంగిణి’ ఆధారంగా రాసిన కథలు. కల్హణుడు 11వ శతాబ్దంవాడు
తిరుమల లీలామృతం