Telugu Newsletter- Chaitra 5124
- April 29, 2022
- 0 Comment(s)
స్ఫూర్తిప్రదాత శ్రీ సోమయ్య
చాలాకాలం ఆంగ్లేయులకు, నిజాం నవాబులకు, తర్వాత కాలంలో నాస్తికవాదానికి, ఒకమేరకు ద్రవిడ వేర్పాటువాదానికి, అంతకుమించి కమ్యూనిస్టుల అంతర్జాతీయ వాదాలకు కూడా ఆటపట్టుగా ఉండిన ప్రాంతాలలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ఎండిపోకుండా, శుష్కించిపోకుండా కాపాడుకొంటూ రావటంలో శ్రీ సోమయ్యగారి పాత్ర అసామాన్యమైనది. ‘స్ఫూర్తిప్రదాత శ్రీ సోమయ్య’ అనే ఈ పుస్తకం శ్రీ గోపిరెడ్డిగారు సేకరించి సంకలనం చేసిన విషయాలన్నీ అలా ఉంచుతూనే క్రొత్తగా అనేకమంది వ్రాసి పంపించిన అనుభవాలను, జ్ఞాపకాలను శ్రీ కె. శ్యాంప్రసాద్ జోడించారు.
మార్క్సు – వివేకానందుడు : ఒక తులనాత్మక పరిశీలన
పరమేశ్వరన్ గారు భారతీయ విచారధారలో మూలాలు గల పరిశోధకుడు. చదువరులను అన్నిటికన్నా ఎక్కువగా ఆకట్టుకొనేది ఈ ఇద్దరు ప్రవక్తల సిద్ధాంతాలు, వ్యక్తిత్వాల, ప్రభావాల గురించిన విశ్లేషణ. అయితే మార్క్సిజం యొక్క బలహీనతను, స్వామీజీ వేదాంతపు ఔన్నత్యాన్ని విశ్లేషణాత్మకమైన రీతిలో బట్టబయలుగా ప్రదర్శించి వాటి మధ్యగల భేదాలను వివరించారు. పుస్తకం ఆద్యంతాలూ ఆయన విషయప్రధానమైన, విద్యాలయోచితమైన వైఖరిని అవలంబించారు.
కొన్ని పుస్తకాలు – మీ కోసం
ఆధునిక భారతీయ వైజ్ఞానికులు : భారత భారతి
12 ఆధునిక భారతీయ వైజ్ఞానికుల జీవితాని పరిచయం చేసే ” భారత భారతి ” పుస్తకాల సెట్.
హైందవి విశ్వంలో విస్తరించిన భారతీయ సంస్కృతీ
హైందవి – విశ్వంలో విస్తరించిన భారతీయ సంస్కృతీ రచయత : ముదిగొండ ఇందుశేఖర్
నిజాం Vs నిజం
తెలంగాణ స్వాతంత్ర పోరాటం ఒక చరిత్ర మాత్రమే కాదు.ఇది తెలంగాణ ప్రజల జీవన్మరణ పోరాటం మరియు ఒక ఆత్మగౌరవ నినాదం. ప్రతి పౌరుడు చదివి గర్వించదగ్గ చరిత్ర. ఏడుగురు విదేశీ నిజాముల దాస్య శృంఖలాలను పటాపంచలు చేసి, స్వతంత్ర భారతంలో కలవడానికి తెలంగాణ ప్రజలు జరిపిన అద్భుత తెలంగాణ స్వాతంత్ర పోరాటం ఇందులో ఆవిష్కృతమవుతుంది.
విద్యారణ్య విజయం
ప్రపంచ ప్రజలందరికీ ఆశ్చర్యం కలిగించే విధంగా, భారతదేశం నేటికీ హిందూదేశంగా గుర్తింపబడుతూ ఉండడానికి కారణమైన ముఖ్యమైన చారిత్రకమైన మలుపులో కీలకపాత్ర వహించిన వ్యక్తి విద్యారణ్యస్వామి, బలవంతాన మహమ్మదీయులుగా మార్చబడిన హరిహర రాయలు, బుక్కరాయలు అను సోదరులను మరల హిందూ ధర్మావలంబులుగా చేసి, వారిచే రాజ్యస్థాపన చేయించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. మనకు ప్రాతఃస్మరణీయుడు. విస్తృతమైన నేపథ్యాన్ని విశదీకరిస్తూ, సులభసుందరమైన, పఠనీయమైన శైలిలో ఒక చారిత్రక నవలగా అందించబడుతున్న ఆనాటి చరిత్ర ప్రతి ఒక్కరూ చదవదగినది. తెలుగువారికి నవయుగభారతి సగర్వంగా, సవినయంగా అందిస్తున్న కానుక శ్రీ వి.వి. సుబ్రహ్మణ్యం రచించిన విద్యారణ్య విజయం.


