Sale!

వేయి పడగలు Veyi Padagalu

వేయిపడగలు నవలలో భారతీయ సంస్కృతి, ఆచార వ్యవహారాలు, విశేషాలు, మధ్య తరగతి జీవన విధానం విశేషంగా చూపబడ్డాయి. అనంతర కాలంలో తెలుగులో వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ నవలలకు, సినిమాలకూ ఇది ఏ మాత్రమూ తీసిపోదు సరికదా మరో పది మెట్లు పైనే ఉంటుందని చెప్పొచ్చు. దాని కథ, కథనం అంతటి ఉత్కంఠ భరితంగా సాగుతుంది

747.00 735.00

3 in stock

Compare

Description

About the book : 

ఇరవై ముద్రణలు పొందిన అద్భుతనవల, విశ్వనాథ సత్యనారాయణ ‘వేయిపడగలు’ ఒక అద్భుత సృష్టి.

వేయిపడగలు నవలలో భారతీయ సంస్కృతి, ఆచార వ్యవహారాలు, విశేషాలు, మధ్య తరగతి జీవన విధానం విశేషంగా చూపబడ్డాయి. అనంతర కాలంలో తెలుగులో వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ నవలలకు, సినిమాలకూ ఇది ఏ మాత్రమూ తీసిపోదు సరికదా మరో పది మెట్లు పైనే ఉంటుందని చెప్పొచ్చు. దాని కథ, కథనం అంతటి ఉత్కంఠ భరితంగా సాగుతుంది. కోకిలమ్మ పెళ్ళి, కిన్నెరసాని పాటలు ఆనాటి యువతరాన్ని ఆకట్టుకొనే వ్యావహారిక భాషలో వ్రాశారు. విశ్వనాథ నవలలలో పురాణవైర గ్రంథమాల క్రింద వచ్చిన 12 నవలలు మహాభారతానంతర పూర్వయుగ భారతదేశ చరిత్రను మరొకవిధంగా చూపుతాయి. అయితే వీటిలో ప్రతి నవలా ఉత్సుకతతో నిండిన కథ, అనితర సాధ్యమైన శైలి, విశేషమైన పాత్రలతో పాఠకులను ఆకట్టుకొంటాయి.

భారతీయ భాషల్లోనే కాదు, ప్రపంచభాషల్లోనూ ఇంకెక్కడా ఇట్లాంటి నవల వున్నట్టు చూడము. ‘వేయిపడగలు’ కేవలం 29 రోజుల్లోనే వ్రాయబడిన నవల. ఎనిమిదివందలకిపైగా పుటల్లో పరచుకున్న కథకు భారతీయ ధర్మమూ దాని హ్రాసమూ ఇతివృత్తం. ఇది ప్రధానంగా ప్రతీకాత్మక నవల ‘వేయిపడగల పాము విప్పారుకొని వచ్చి కాటందుకొన్నదీ కలలోన రాజును’ అన్న పాటతో మొదలవుతుంది వేయిపడగలు. కావ్యోపక్రమంలోనే కావ్యతత్త్వాన్ని సూచించే శిల్ప సంప్రదాయాన్నిట్లా పాటించారు విశ్వనాథ. వేయిపడగలపాము కుండలినీ సాధనకు ప్రతీక. ఆదిశేషునికి కూడా వేయి పడగలుంటాయి.

ఇందులో అరుంధతీ ధర్మారావులు నాయికానాయకులు. ‘వేయిపడగలు’లోని పలు పాత్రలు మానుష ప్రపంచాన్ని దాటి పోతాయి. అక్ష్మణస్వామి (ఏనుగు), పసిరిక వంటి పాత్రలు దీనికి ఉదాహరణలు. ఇక ధర్మారావు ధర్మం రూపుకట్టిన పాత్ర. గోపన్న కతడు సాక్షాత్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అపరావతారం.

కథాస్థలమైన సుబ్బన్నపేట ఓ గ్రామం. అది కాలక్రమంలో పాశ్చాత్యపుపెను ప్రభావాలతో ఆధునిక నాగరకతా పోకడలు పోయి, ఎట్లా పలుదుష్పరిణామాలకు లోనైందోనన్నది ‘వేయిపడగలు’ ఇతివృత్తం. సుబ్బన్నపేట యవద్దేశానికీ లక్ష్యభూతమైన గ్రామం. అది సుబ్రహ్మణ్య శబ్దానికి వికృతి. సుబ్రహ్మణ్యేశ్వరుడు వేయిపడగల స్వామి. వేయిముఖాలైన ధర్మానికి చిహ్నం. ”వేయిముఖాలుగా ధర్మం పరిపాలింపబడ్డ యా దేశమే సుబ్బన్నపేటగా చెప్పబడింది. అంతేగాని, యిది ఒక ఊరుకాదు. ఇది ఒక జమీందారీ కాదు …..” అని విశ్వనాథవారే ఒక రేడియో ప్రసంగంలో వివరించారు (జాగృతి 18-3-1955)

”ఔను, నీవు మిగిలితివి, ఇది నా జాతి శక్తి, నా యదృష్టము” అంటుంది ధర్మారావు పాత్ర నవల చివరలో. సర్వధర్మాలూ నశించినప్పటికీ భారతదేశాన దాంపత్య ధర్మం ఒకటి మిగిలిందన్నది దాని అంతరార్ధం. రామేశ్వర శాస్త్రి, రంగాజమ్మ, మంగమ్మ, రంగారావు, హరప్ప, రుక్మిణమ్మారావు, కేశవరావు, దేవదాసు, పసిరిక, గణాచారి….. ఇట్లా ఎన్నో పాత్రలు ఆయా వ్యవస్థలకూ ధోరణులకు చిహ్నాలు; ప్రతీకలు.

ISBN : TELBOOK036 ; Publisher : Viswanadha prachuranalu ; Pages : 999 ;

About the Author :

Viswanadha Satyanarayana (10 September 1895 – 18 October 1976) is popularly known as the Kavi Samraat (Emperor of Poetry and Emperor of all Poets), was a Telugu writer of the 20th century. His works included poetry, novels, drama, short stories and speeches, covering a wide range of subjects such as analysis of history, philosophy, religion, sociology, political science, linguistics, psychology and consciousness studies, epistemology, aesthetics and spiritualism.
Viswanatha’s style of poetry was classical in nature and his popular works include Ramayana Kalpa Vrukshamu (Ramayana the wish-granting divine tree), Kinnersani patalu (Mermaid songs) and Veyipadagalu (The Thousand Hoods).

He was awarded the Jnanpith Award and Padma Bhushan in 1971.

Viswanadha was of the view that history is not the story of kings but the narrative that gives one an understanding of the sociological, political, economic, cultural, scientific, spiritual and aesthetic lives of man in a given time, and their evolution. Based on Kota Venkatachalam’s chronology Vishwanatha wrote three series of novels depicting all these aspects of ancient and medieval society, along with stories woven around the famous characters of three royal lineages:

1. Purana Vaira Granthamala is a series of 12 novels about the Magadha Royal dynasties after Mahabharata war. In this series, there are two tendencies – Krishna representing Dharma, and Jayadratha representing the darker side of human psyche, the unrighteous side. The primary characters in each of the 12 novels behave under the influence of these two tendencies, each having its temporal victories.

2. Nepala Rajavamsa Caritra is a series of 6 novels about the Nepali Royal dynasties. This series expounds Carvaka school of thought, its intricacies and sub-schools, social life and values influenced by carvakas.

3. Kashmira Rajavamsa Caritra is a series of 6 novels woven around the Royal dynasties that ruled Kashmir.

Literary career:

Viswanatha’s literary works includes 30 poems, 20 plays, 60 novels, 10 critical estimates, 200 Khand kavyas, 35 short stories, three playlets, 70 essays, 50 radio plays, 10 essays in English, 10 works is Sanskrit, three translations, 100 introductions and forewords as well as radio talks. Some of his poems and novels have been translated into English, Hindi, Tamil, Malayalam, Urdu and Sanskrit.

Veyipadagalu was later translated into Hindi by former Prime Minister PV Narasimha Rao as Sahasraphan.

Author

Viswanatha Satyanarayana

Reviews

There are no reviews yet.

Be the first to review “వేయి పడగలు Veyi Padagalu”