Description
ఐర్లాండ్ జన్మించిన సోదరి నివేదిత భారతదేశానికి విచ్చేసి, భారతదేశ చరిత్రలో మరియు స్వాతంత్య్ర పోరాటంలో ఈమె పాత్ర ప్రముఖంగా చెప్పుకోదగ్గది. పరాయి ప్రభువుల నుంచి దాస్యశృంఖలాలను ఛేదించుకోవటానికి మనం పోరాడటం సహజమే. తనివితీరని ఆధ్యాత్మిక జిజ్ఞాసతో, తాను నమ్మిన సిద్ధాంతాలకోసం ఆమె చేసిన పోరాటం అద్వితీయం. తన జీవితాన్ని మన దేశసేవకు అంకితం చేయటమే కాకుండా, 1899వ సంవత్సరంలో కలకత్తా నగరాన్ని ప్లేగు వ్యాధి కబళించినప్పుడు, 1906వ సంవత్సరం నాటి బెంగాలు కరువు సందర్భంలో సోదరి నివేదిత తన ప్రాణాలకు తెగించి చేసిన సేవలు అనుపమానం. వీటితోపాటుగా, భారతీయ శాస్త్రవేత్త శ్రీ జగదీశ్ చంద్రబోసును ప్రోత్సహించి, ఆర్థిక సహయం చేకూర్చటంలో ఈమె పాత్ర మరువలేనిది.
Publisher : V Kendra ; Paperback ; Author : Nivedita Bhide ; Pages : 122

