తిరుమల ఫై ఎందుకీ కక్ష?, దేవాలయాల ఆస్తులు ఏమంటున్నాయి? Tirumalapai enduku kaksha

దేవాలయ నిర్మాణం ఎంతో కష్టతరమైన వ్యవహారం. అది ఇటుక సున్నంలతో నిర్మితమైయ్యే కట్టడం కాదు. దేవాలయ నిర్మాణానికి పవిత్రత మూలాధారం, స్వతంత్రం వచ్చినప్పటి నుంచీ దేవాలయాలకు ప్రభుత్వం ఎటువంటి సహాయం చేయడంలేదు. ప్రభుత్వ సహాయాన్ని ప్రజలు ఆశించడమూలేదు. ఇటువంటి పరిస్థితిలో సెక్యులర్ రాజ్యవ్యవస్థలో, ఒక మతానికి చెందిన ధార్మిక సంస్థలకు సంబంధించిన పాలనా నిర్వహణపై ప్రభుత్వం చట్టం చెయ్యొచ్చా? అంటూ రచయిత ప్రశ్నించిన తీరు పాఠకులను ఆలోచింపచేస్తుంది.

కుహనా సెక్యూలర్ ప్రభుత్వ విధానాల వలన కోట్ల విలువ చేసే ఆస్తులు తీవ్ర సంక్షోభంలో మునిగిపోతున్నాయి. దీనికి ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం కల, కోట్ల భక్తులకు కొంగు బంగారమైన తిరుమల  కూడా మినహాయింపు కాదు. తిరుమలలో స్వామివారి అమూల్య ఆభరణాలు, ఖజానా లెక్కలు, అతిధి గృహాల నిర్వహణ వంటి వాటిలో అవకతవకలను, సాక్షాత్తు ఏడూ కొండల్లో భూ కబ్జాలను , దేవాలయ ఉద్యోగాల్లో ఇతర మతస్థులు మరియు నాస్తికుల నియామకం వంటి అనేక విషయాలు ఇందులో గణాంకాల  సహితంగా చర్చింపబడ్డాయి. ఇవి ప్రతి హిందువు తెలుసుకుని జాగృతమవ్వవలసిన అంశాలు. ప్రారంభంలో సద్గురు శ్రీ. శివానంద మూర్తి గారి సందేశం ఈ పుస్తకానికి అదనపు విలువనద్దింది.హైందవం మతం మాత్రమే  కాదు సంస్కృతీ స్వాభిమాన పరంపరగా భావించే ప్రతీ ఒక్కరు చదివి తీరవలసిన పుస్తకం ‘ తిరుమల ఫై ఎందుకీ కక్ష?, దేవాలయాల ఆస్తులు ఏమంటున్నాయి?’.

100.00

Out of stock

Compare

Description

పుస్తక పరిచయం :

భారతీయ సామాజిక వ్యవస్థకు, హిందూ దేవాలయాలకు మధ్యగల సంబంధం కేవలం ఆరాధనో లేక కట్టడ నిర్మాణమో మాత్రమే కాదు. సామాజిక స్పృహ, సాంఘిక జీవనం, సంస్కృతీ- సంప్రదాయాల పవిత్రత వంటి అనేక అంశాలు వీటితో ముడిపడి ఉన్నాయి. హిందూ దేవాలయ నిర్వహణకు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రాకపోగా – వేల కోట్ల రూపాయల విలువైన దేవాలయ ఆస్తులు దోపిడీకి గురవుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం కల, కోట్ల భక్తులకు కొంగు బంగారమైన తిరుమల కూడా ఈ జాబితాలో ఉన్నదన్న విషయం ప్రతీ హిందువునీ ఆలోచించింప చేస్తుంది.

    దేవాదాయ – ధర్మాదాయ ఆస్తుల పైన ప్రభుత్వ విధానం, అధికారుల నిర్లజ్జ వైఖరి- నిబద్ధతా రాహిత్యం, అన్యమతస్థుల ప్రాబల్యం వంటి అనేక విషయాలను రచయిత ఎండగట్టిన తీరు ప్రశంసనీయం. ముఖ్యంగా దేవాలయ భూకబ్జాలు, నిర్వహణలో అవినీతి, అక్రమాలు, అడ్డగోలు పంపిణీల వంటి విషయాలను సోదాహరణంగా వివరించారు.

    హిందువుల పరమ పుణ్య క్షేత్రమైన తిరుమలలో స్వామివారి ఆభరణాలు, ఖజానా లెక్కలు, అతిధి గృహాల నిర్వహణ వంటి వాటిలో అవకతవకలను, సాక్షాత్తు ఏడూ కొండల్లో భూ ఆక్రమణలు, దేవాలయ ఉద్యోగాల్లో ఇతర మతస్థులు మరియు నాస్తికుల నియామకం వంటి విషయాలను నిలదీసిన విధం ప్రతీ హిందువును జాగృతపరుస్తుంది. ప్రారంభంలో సద్గురు శ్రీ శివానంద మూర్తి గారి సందేశం ఈ పుస్తకానికి అదనపు విలువనద్దింది.

హైందవం మతం మాత్రమే  కాదు సంస్కృతీ స్వాభిమాన పరంపరగ భావించే ప్రతీ ఒక్కరు చదివి తీరవలసిన పుస్తకం ‘ తిరుమల ఫై ఎందుకీ కక్ష?, దేవాలయాల ఆస్తులు ఏమంటున్నాయి?’.

రచయిత పరిచయం

1936లో నెల్లూరులో జన్మించిన శ్రీ . సర్వేపల్లి వెంకట శేషగిరి రావు గణిత శాస్త్రంలో డాక్టరేట్ పొందారు. 35 సం.ల పాటు ఉస్మానియా యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్, మాథెమటికల్ ఫిజిక్స్ లో పరిశోధనా పర్యవేక్షకులుగా పనిచేశారు. సైన్స్ పరిశోధనల రీత్యా దేశవిదేశాలు పర్యటించారు. సామాజిక, రాజకీయ విషయాలపైనా ఎన్నో వ్యాసాలు, గ్రంధాలూ వ్రాశారు. ‘ఎండ్ అఫ్ కమ్యూనిస్ట్ ఉటోపియా’, ‘పొలిటికల్ ఇస్లాం ఇన్ ఇండియా’, ‘మావోయిస్టు ఇన్సూర్జెన్సీ, ఏ పర్స్పెక్టివ్’ వారి కలం నుంచి వెలువడిన కొన్ని గ్రంధాలు.

Author

S.V.Seshagiri Rao

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

Select at least 2 products
to compare