శ్రీ గురూజీ జీవన యజ్ఞము

30.00

3 in stock

Compare

Description

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ ద్వితీయ సరసంఘచాలక్ పరమ పూజనీయ శ్రీ మాధవ సదాశివ గోళ్వల్కర్ (గురూజీ) జీవిత చరిత్ర ఇది.

 

నేడు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ పని దేశమంతటా విస్తరించి వుంది. సంఘ పేరుప్రతిష్ఠలు ప్రపంచమంతటా వ్యాపించి వున్నాయి. ఇదంతా ప్రధానంగా శ్రీ గురూజీ నాయకత్వం సాధించినదే. శ్రీగురూజీ జీవితం త్యాగమయం. తపోమయం. ఆయన మేధావి. ఆత్మజ్ఞాని. వ్యవహారదక్షుడు. మౌలికంగా ఆలోచించే సిద్ధాంతవేత్త, మహావక్త. కఠోరమైన ఆదర్శవాదానికి సముజ్వల ప్రతిబింబం ఆయన జీవితం. అయినా ఆయన పలుకు, పనితీరు మార్దవానికీ, నమ్రతకూ ప్రతిరూపాలు. ఆధునిక యుగంలో అసాధారణ ప్రజ్ఞాశాలి అయిన మహాపురుషుడు ఆయన.

 

ఆ మహా దేశ సేవకుని జీవిత చరిత్రను బాలకులు, కిశోరులు, నవయువకులు చదవాలని, వారి జీవితంలోని మహత్తర ఘట్టాలను మననం చేసుకోవాలని, ఆ ఒరవడిలో తమ జీవితాలను వికసింపజేసుకోవాలని, సద్గుణాలతో సంపన్నం చేసుకోవాలని, తమ జీవన పుష్పాలను భరతమాత చరణాల ముందు అర్పించాలనే ఆకాంక్ష వారిలో మొగ్గ తొడగాలని – ఈ ఆలోచనతో శ్రీ ప్ర.గ. సహస్రబుద్దే ఈ పుస్తకాన్ని హిందీలో రచించారు. శ్రీకందర్ప రామచంద్రరావు దానిని తేట తెలుగులోనికి అనువదించారు.

Author

Sahasrabuddhe P.G.

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

Select at least 2 products
to compare