Description
భారతదేశ విభజన గురించి గత ఏడు దశాబ్దాల కాలంలో చాలా సాహిత్యం వచ్చింది. ఈ సాహిత్యంలో భారతదేశానికి, పాకిస్తాన్కి చెందిన ఎందరో మేధావులు రాసిన పుస్తకాలు ఉన్నాయి. నిజానికి భారతదేశం నుంచి కంటే పాకిస్తాన్ నుంచే ఎక్కువ సాహిత్యం ఈ అంశం మీద తయారైంది. ఇక విదేశీ మేధావులు కూడా ఈ అంశం మీద పరిశోధన చేయడంలో. సంబంధిత పత్రాలను తయారుచేయటంలో విశేషంగా కృషి చేశారు.
‘ముక్కలైన స్వాతంత్ర్యం’ (Partitioned Freedom) అనే ఈ పుస్తకం అనేక కోణాల్లో ఇప్పటికే వచ్చి ఉన్న సాహిత్యానికి కొనసాగింపే. ఎప్పుడైనా వాస్తవాలు వాస్తవాలే. వాటిని మార్చలేం. కానీ ఒక రచయిత ఇలాంటి చారిత్రిక అంశాలమీద రచన చేసేటప్పుడు ఆ అంశాన్ని తనకు తోచిన కీలకమైన దృక్పథంలోంచి చూసి రాయడంలో మాత్రం కావలసినంత స్వేచ్ఛ తీసుకోగలడు.
Publisher : Emesco ; Paperback ; Pages : 236 ; Author : Ram Madhav



Reviews
There are no reviews yet.