కాశ్మీర్ వ్యధ Kaashmir Vyadha

సంక్షిప్త పరిచయం

జాతి పట్ల బాధ్యత మరచి, చవకబారు రాజకీయ మెరమెచ్చులను ఆశించి, అడుగడుగునా ఒత్తిళ్లకుతలొగ్గి,  అడ్డమైన రాజీలు పడి – ఇంతకాలంగా (370 అధికరణపు రద్దుకు ముందువరకూ) మనలనేలిన వారు మనకు చేసిన మేరలేని  అన్యాయాన్ని, దాని భయానక పర్యవసానాలను కాశ్మీర్ సమస్యకు సంబంధించినంతవరకూ చర్చిస్తూ,  370 అధికరణపు రద్దు యొక్క ఆవశ్యకతామూలాలను కళ్ళకి కట్టించే రచన ‘కాశ్మీర్ వ్యధ’. ఇది అశేష ప్రజాదరణ పొందిన శ్రీ. ఎంవిఆర్ శాస్త్రి గారి ‘కాశ్మీర్ కథ’ కు కొనసాగింపుగా వచ్చిన తరువాయి భాగం.

150.00

2 in stock

Compare

Description

కాశ్మీర్ వ్యథ :

అరవైఏళ్ల కిందటే ఇండియన్ యూనియన్లో జమ్మూ కాశ్మీర్ విలీనమైనా భారత జీవనస్రవంతికి కాశ్మీర్ ఇప్పటికీ దూరమే. కాశ్మీరుకీ మనకీ మధ్య కనిపించని అడ్డుగోడలు ఎక్కడివి? కాశ్మీర్ లోయలో ఆజాదీ అరుపుల సబబెంత? అజాద్ కాశ్మీర్లో ఆజాదీ ఎంత?రిపబ్లిక్ భారత్లో భాగమైన జమ్ముకాశ్మీర్లో మరల ఆజాదీ ఏమిటి? ‘ఆపరేషన్ టోపాక్’ లో ఏముంది?    అరవైఏళ్ల అనర్థక విధానాల, అసమర్థ నిర్వాకాల దుష్పరిణామాలను కళ్లకు కట్టించే పుస్తకం ‘కాశ్మీర్ వ్యథ’

భూతల స్వర్గమైన కాశ్మీర్ రావణ కాష్ఠంలా రగలటానికి కారకులెవరు, కారణాలేంటి? కాశ్మీర్లో నిజమైన మైనార్టీలెవరు, ఎందుకు మైనార్టీలైనారు?   అసలు ఇంతటి కాశ్మీర్ ఆర్తికి కర్తలెవరు?

ఇటువంటి సంధించవలసిన అనేక ప్రశ్నలకు సమాధానమే ఈ ‘కాశ్మీర్ వ్యథ’.

కాశ్మీర్ స్వతంత్ర భారతంలో విలీనమయ్యే సమయంలోని అవకతవకల గురించీ, మన ఉదాసీనత వలన సర్వమంగళమైన మంగళడామ్ గురించి, త్రిశంకు నరకంలో కొట్టుమిట్టాడుతున్న పాక్ ఆక్రమిత కాశ్మీరీల గురించి, కాశ్మీర్ నడిబొడ్డున ప్రముఖులను సైతం సునాయాసంగా చంపిపారేసిన మిలిటెంట్ల విలయానికి వెనుక కల మూలాల గురించి, మన మాతృభూమిలో అంతర్భాగమైన సుందర కాశ్మీరంలో ‘అమరనాధుని’ సాక్షిగా సమరసత వెల్లివిరియటానికి కల అడ్డంకుల గురించి, శాశ్వతమైన తాత్కాలిక 370 అధికరణం గురించీ – ఇలా అనేక  విషయాలను నిక్కచ్చిగా, నిష్పాక్షికంగా మరియు నిర్ద్వందంగా చర్చించిన  హస్తభూషణమే ‘కాశ్మీర్ వ్యథ’.

రచయిత పరిచయం 
 
శ్రీ MVR శాస్త్రి గారు అనుభవజ్ఞులైన రచయిత మరియు పాత్రికేయులు. ఆంధ్రభూమి పత్రికకు గాను 24  సం.లు సంపాదకులుగా పనిచేసారు. వేల కొద్దీ వ్యాసాలతో పాటు 15  పుస్తకాలను రచించారు. ‘ఉన్నమాట’ శీర్షికన వెలువడిన  వీరి వ్యాసంగాలు తెలుగులో బహుళ ప్రజాదరణ పొందినవిగా ప్రఖ్యాతి చెందాయి.

 

Author

M.V.R.Sastry

Reviews

There are no reviews yet.

Be the first to review “కాశ్మీర్ వ్యధ Kaashmir Vyadha”

You may also like

Select at least 2 products
to compare