Description
దేవాలయం హిందూధర్మానికి హిమాలయ శిఖరం వంటిది.
అటువంటి ఆలయాల విశిష్టత, ఆగమశాస్త్ర నిబంధనలను గురించి రచయిత ఈ గ్రంథం రచించారు.
కందుకూరి వేంకట సత్య బ్రహ్మాచార్య ఆగమశాస్త్ర పండితులుగా పేరు గాంచారు.
అనేకమంది సంప్రదాయ శిల్పులకు ఆగమ, శిల్పశాస్త్ర రీతిగా విగ్రహనిర్మాణ విధానం, ఆగమ సంప్రదాయవిషయంలో బోధన చేశారు.
ఆలయములు ఆగమములు గ్రంథంలో ప్రాశస్త్యం గల ఆలయాలను గురించి వివరణాత్మక చిత్రాలతో సహా వివరించారు.
ప్రతి ఒక్కరు దేవాలయాలను దర్శించాలి. దేవాలయాలు దేవునికి నిలయాలు.
మానవుని మనుగడకు, చిత్తశుద్ధికి, ప్రశాంత జీవనానికి ఏకైక గమ్యస్థానం’ అంటారు రచయిత.
ఆలయాల ఆలంబన లేకుండా హైందవ సంస్కృతి చుక్కాని లేని నావ వలె ఉంటుందంటారు.
దేవాలయాలు ధ్వంసమైనపుడు వాటిని జీర్ణోద్ధరణ చేయకుంటే అక్కడ దుర్భిక్షం, ప్రజా పీడన,
రాజపీడన జరుగుతుందని, ప్రజలు అనేక ఆపదలకు గురవుతారని ఆగమశాస్త్రం చెబుతున్నదని రచయిత పేర్కొన్నారు.
ఆలయాల జీర్ణోద్ధరణ ఏ విధంగా చేయాలో రచయిత సవివరంగా తెలిపారు. ఆలయాలు, ఆగమాలకు ఉన్న అవినాభావ సంబంధాన్ని ఈ గ్రంథం తెలియజేసింది.
ప్రతి ఆలయంలో ఆయా ఆగమములు, వాటి విధానాలు, అవి సూచించిన మార్గంలోనే
ఆలయ నిర్వహణ జరగాలని రచయిత విన్నవించారు.
దేవాలయాల విశిష్టతను గురించి తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవవలసిన పుస్తకం ‘ఆలయములు ఆగమములు’



Reviews
There are no reviews yet.