Sale!

శ్రీ వసిష్ఠ – రామ సంవాదము ( Set of 4 Volumes ) Vasishtha Rama Samvadam

యోగవాసిష్ఠము, అఖండ రామాయణము అని వినుతికెక్కిన గ్రంథరాజమే ‘వసిష్ఠ రామ సంవాద’ రూపమున నాలుగు సంపుటములుగా ఆవిష్కరింపబడినది. అవతార పురుషుడు, ధర్మాత్ముడు అయిన శ్రీరామచంద్రునికి కలిగిన నిరాశా నిస్పృహలతో కూడిన వైరాగ్యము తొలగించి కార్యోన్ముఖుడిని కావించడానికి వసిష్ఠులవారు చేసిన ఫలవంతమైన ప్రయత్నమిది. ఇందులో బ్రహ్మజ్ఞానం, కర్మజ్ఞాన మార్గాలను రెండింటిని ఆచరిస్తేనే మోక్షము లభిస్తుందని తెలుపబడుతుంది. ఎంతో సున్నితము, జటిలము అయిన భావ పరంపర చక్కని సరళమైన తెలుగులో అనువదించబడింది. అందరికీ జ్ఞానమార్గాన్ని చూపే అమూల్యమైన గ్రంథమిది.

మొదటి సంపుటంలో – వైరాగ్య, ముముక్షు వ్యవహార, ఉత్పత్తి ప్రకరణములు; రెండవ సంపుటంలో స్థితి, ఉపశమన ప్రకరణములు; మూడవ నాల్గవ సంపుటాలలో నిర్వాణ ప్రకరణము ఉన్నాయి.

Original price was: ₹1,500.00.Current price is: ₹1,425.00.

1 in stock

Compare

Description

పుస్తక పరిచయం :

శ్రీ వసిష్ఠ – రామ సంవాదము (శ్రీవాల్మీకి మహర్షి ప్రణీత యోగవాసిష్ఠము) ఆర్షధర్మ వాఙ్ఞయ వినీలాకాశంలో జాజ్వల్యమానంగా భాసిస్తున్న తారలెన్నో. ఆ తారా సమూహంలో విశిష్టంగా భాసిస్తూ ధ్రువతార అని పరిగణించదగినది శ్రీ యోగవాసిష్ఠము.

వాసిష్ఠ రామాయణము, మహారామాయణము, ఆఖండ రామాయణము అని కూడ గణుతికెక్కిన ఈ గ్రంథం వాల్మీకి మహర్షిచే విరచితమైనది. ముప్పైరెండు వేల శ్లోకాలతో ఒప్పారే ఈ బృహద్గ్రంథంలో వైరాగ్య-ముముక్షువ్యవహార-ఉత్పత్తి-స్థితి-ఉపశమ-నిర్వాణ అనే ఆరు ప్రకరణాలు ఉన్నాయి. వసిష్ఠ మహర్షి శ్రీరామచంద్రమూర్తికి చేసిన అద్వైత వేదాంత బోధ ఇందలి విషయం. ఈ పుస్తకం నాలుగు సంపుటాల సంకలనం.

మొదటి సంపుటంలో – వైరాగ్య, ముముక్షు వ్యవహార, ఉత్పత్తి ప్రకరణములు; రెండవ సంపుటంలో స్థితి, ఉపశమన ప్రకరణములు; మూడవ నాల్గవ సంపుటాలలో నిర్వాణ ప్రకరణము ఉన్నాయి.

ISBN : 978-9383972142 ; RK Math Publication ; Pages : 3021; Telugu editing : YH Ramakrishna

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

Select at least 2 products
to compare