స్ఫూర్తిప్రదాత శ్రీ సోమయ్య Spoorthipradata Sri Somayya
స్ఫూర్తిప్రదాత శ్రీ సోమయ్య Spoorthipradata Sri Somayya
చాలాకాలం ఆంగ్లేయులకు, నిజాం నవాబులకు, తర్వాత కాలంలో నాస్తికవాదానికి, ఒకమేరకు ద్రవిడ వేర్పాటువాదానికి, అంతకుమించి కమ్యూనిస్టుల అంతర్జాతీయ వాదాలకు కూడా ఆటపట్టుగా ఉండిన ప్రాంతాలలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ఎండిపోకుండా, శుష్కించిపోకుండా కాపాడుకొంటూ రావటంలో శ్రీ సోమయ్యగారి పాత్ర అసామాన్యమైనది.
‘స్ఫూర్తిప్రదాత శ్రీ సోమయ్య’ అనే ఈ పుస్తకం శ్రీ గోపిరెడ్డిగారు సేకరించి సంకలనం చేసిన విషయాలన్నీ అలా ఉంచుతూనే క్రొత్తగా అనేకమంది వ్రాసి పంపించిన అనుభవాలను, జ్ఞాపకాలను శ్రీ కె. శ్యాంప్రసాద్ జోడించారు.
మనదే మనదే కాశ్మీరం manade manade kaashmiram
కాశ్మీర్ కథ Kaashmir Katha ( Telugu )
యావద్భారతాన్ని చిరకాలంగా కలవరపరుస్తున్న కాశ్మీర్ సమస్యకు మూలమేమిటి?
ఈ కథ ఎక్కడ మొదలైంది ? ఎన్ని మలుపులు తిరిగింది? సుందర కాశ్మీరాన్ని పాకీ దయ్యాల దిబ్బగా మార్చిన పాపంలో ఎవరి వాటా ఎంత ఎంత? అనర్థాలకు అసలు కారణమైన 370వ అధికరణం ఏ పరిస్థితుల్లో పుట్టింది ? కాశ్మీర్ కూ, దేశానికీ ఎంత హాని చేసింది?
ఒక యోగి ప్రస్థానం : మఠాధిపతే ముఖ్యమంత్రి Oka Yogi Prasthanam
Telugu translation by Sri Komalla Thirupati Reddy of the book The Monk Who Became Chief Minister. భారతదేశంలోనే అతి పెద్ద రాష్ట్రం అయిన ఉత్తర ప్రదేశ్ కి 21వ ముఖ్యమంత్రిగా 2017 మార్చి 19న యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్తరాఖండ్ పర్వత గ్రామాలలో బిడియస్తుడు, అంతర్ముఖుడు అయిన ఒక బాలుడి జీవన ప్రయాణం గురించి, కోట్ ద్వార్ లోని కళాశాలలో సైన్సు విభాగంలో ఆధునిక విద్యను అభ్యసించిన ఒక యువకుడి గురించి, తదనంతరం సన్యాసిగా మారి అకుంఠిత దీక్షతో వేదాధ్యయనం చేసిన ఒక ధార్మిక వ్యక్తి గురించి ఈ పుస్తకం కూలంకషంగా వివరిస్తుంది.
మానవోత్తమ రామ Manavothama Rama
మానవోత్తమ రామ Manavothama Rama
శ్రీరాముణ్ణి మానవోత్తముడిని , పురుషోత్తముడిని చేసిన , రామాయణం లో మహర్షి వాల్మీకి చే చెప్పబడిన 16 గుణాలు – ఆయా గుణాలు రామాయణంలో ఏఏ సందర్భాలలో ప్రస్ఫుటితమైయ్యింది , ఆ గుణాలు ప్రస్తుత కాలం లో మనకు ఏవిధంగా వ్యక్తిత్వ వికాసానికి నిర్మాణానికి ఉపయోగపడతాయి. వాటిని వివరించే పుస్తకం ఈ మన ” మానవోత్తమ రామ “.
రాణా ప్రతాప్ Rana Pratap ( telugu )
రాణాప్రతాపునివంటి త్యాగమూర్తి వీరచరిత్రం చదివి ఒకానొక క్లిష్ట సమయంలో ఒక జాతి అంతరించిపోకుండా ఎలా నిలబడిందో, ఆపైన ఎలా కొనసాగిందో. తెలిసికొననివారు జాతికి ఉపయోగపడే ఉత్కృష్ట కార్యాలను చేయజాలరు. అన్నివైపుల నుండి వివిధవిధాల మాయోపాయాలతో ఎన్నెన్నో విదేశీశక్తులు మనదేశాన్ని శఙరించడానికి క్రమ్ముకొనివస్తున్న ఈ తరుణంలో మనజాతి జనులందరికీ అవశ్యపరనీయమైనది ఈ రాణా ప్రతాప్ చరిత్ర.
నేతాజీ Netaji by MVR Sastry
నేతాజీ Netaji by MVR Sastry
భారత స్వాతంత్ర్య సమర ప్రధాన సేనాపతి ఆల్ టైమ్ గ్రేట్ విప్లవ వీరుడు నేతాజీ సుభాస్ చంద్ర బోస్ ( Netaji Subhash Chandra Bose ) రాజకీయ జీవిత అద్భుత చరిత్ర భారత స్వాతంత్ర్య పోరాట ప్రధాన ఘట్టాలు, వాటిలో బోస్ పాత్ర, ప్రభావాలపై విఖ్యాత రచయిత ఎం.వి.ఆర్.శాస్త్రి విలక్షణ విశ్లేషణ.
ఈ పుస్తకం వారు వ్రాసిన ” నేతాజీ సుభాస్ చంద్ర బోస్” పుస్తకం రెందువ భాగం .
ఆరోగ్య సాధన Arogya Sadhana
ప్రాచీన భారతంలో మన పూర్వీకులు సహజ జీవన విధానాల ద్వారా సంపూర్ణ ఆరోగ్యమును కలిగి వారి ఐహిక, ఆధ్యాత్మిక జీవిత లక్ష్యాలను సాధించగలిగారు. అటువంటి జీవన విధానాన్ని ఈ ఆధునిక కాలంలో కూడా సాధించడానికి అవసరమైన సాధనా పద్ధతులు శాస్త్రీయంగా, సులువుగా మరియు ఆచరణ యోగ్యంగా ఈ పుస్తకంలో వివరింపబడ్డాయి.
కశ్మీర రాజతరంగిణి కథలు Kashmira Rajatarangini kathalu
కథలు కల్హణ విరచితమైన ‘కశ్మీర రాజతరంగిణి’ ఆధారంగా రాసిన కథలు. కల్హణుడు 11వ శతాబ్దంవాడు.
ఒక విజేత ఆత్మకథ Oka Vijetha Atmakatha
Telugu translation of Dr. APJ Abdul Kalam’s Wings of Fire .
తిరుమల లీలామృతం Tirumala Leelamrutam
About : ISBN : 978-9380409924 ; Emesco books ; Pages : 184 ; Author : PVRK …
దగాపడ్డ తమ్ములార దారిని గుర్తించండి dagapadda tammulara
దగా పడ్డ తమ్ములెవరో దారిని గుర్తించాల్సిన వారెవరో వివరించిన పుస్తకం మార్కెట్ లోకి వచ్చింది.
తిరుపతి కథలు Tirupati Kathalu
తిరుపతి కథలు Tirupati Kathalu
Author : Prof Peta Srinivasulu Reddy Sahithi Books ;
కంచి పరమాచార్య అమృతవాణి – 10 Volumes Amrutavani
కంచి పరమాచార్య అమృతవాణి – 10 Volumes Amrutavani
కంచి మహాచార్య అమృతవాణి 1 – 10 లో
అమృతవాణి – 1 : అద్వైతం ; అమృతవాణి – 2 : నమో నమ: ;
అమృతవాణి – 3 : షట్పదీస్తోత్రం ; అమృతవాణి – 4 : సనాతనధర్మంలో సంఘసేవ
అమృతవాణి – 5 : గణపతి ; అమృతవాణి – 6 : సాక్షి పరమాత్మ
అమృతవాణి – 7 : శంకర విజయం ; అమృతవాణి – 8 : అద్వైతసాధన
అమృతవాణి – 9 : గురుసంప్రదాయం ; అమృతవాణి – 10 : గోసంరక్షణ
సాధన పథం Sadhana Patham : 40 Success Tips for Students
సాధన పథం Sadhana Patham : 40 Success Tips for Students
- From the works of Swami Chidrupananda , compiled by Sri BS Sarma
నిజాం vs నిజం Nizam vs Nijam
తెలంగాణ స్వాతంత్ర పోరాటం ఒక చరిత్ర మాత్రమే కాదు.ఇది తెలంగాణ ప్రజల జీవన్మరణ పోరాటం మరియు ఒక ఆత్మగౌరవ నినాదం. ప్రతి పౌరుడు చదివి గర్వించదగ్గ చరిత్ర. ఏడుగురు విదేశీ నిజాముల దాస్య శృంఖలాలను పటాపంచలు చేసి, స్వతంత్ర భారతంలో కలవడానికి తెలంగాణ ప్రజలు జరిపిన అద్భుత తెలంగాణ స్వాతంత్ర పోరాటం ఇందులో ఆవిష్కృతమవుతుంది.
దేశభక్తి కథలు Deshabhakti Kathalu
About the book : సంపాదకులు: కస్తూరి మురళీకృష్ణ, కోడీహళ్లి మురళీమోహన్
స్వరాజ్య సాధనలో ఆర్ ఎస్ ఎస్ Swarajya Sadhanalo RSS
స్వరాజ్య సాధనలో ఆర్ ఎస్ ఎస్ Swarajya Sadhanalo RSS
స్వాతంత్ర్యాన్ని స్వరాజ్యంగా మలచడంలో కూడా సంఘం కీలక పాత్ర పోషించింది. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తల్లో దేశం ఎదుర్కొన్న బాలారిష్టాలను, సమస్యలను తీర్చడంలో వేలాది సంఘ స్వయంసేవకులు అపూర్వమైన ధైర్యసాహసాలు, త్యాగాన్ని ప్రదర్శించారు. ముఖ్యంగా రక్తసిక్తమైన దేశ విభజన సమయంలో ముస్లింలీగ్ ముష్కర మూకల నుండి సిక్కులు, హిందువులను కాపాడి సురక్షితంగా భారత్ కు చేర్చడంలో స్వయంసేవకులు చూపిన తెగువ, దేశభక్తి అమోఘం.
సంస్కృతి ఎందుకు? Samskriti Enduku ?
About the book : మన సంస్కృతి నిరాడంబరమైన, ఆరోగ్యకరమైన, మరియు సంతులిత మైనది. సమస్త భూతములు ఆత్మ స్వరూపమే, సర్వము బ్రహ్మమే” …
మార్క్సు – వివేకానందుడు : ఒక తులనాత్మక పరిశీలన Marx – Vivekananda toolanatmaka
పరమేశ్వరన్ గారు భారతీయ విచారధారలో మూలాలు గల పరిశోధకుడు. చదువరులను అన్నిటికన్నా ఎక్కువగా ఆకట్టుకొనేది ఈ ఇద్దరు ప్రవక్తల సిద్ధాంతాలు, వ్యక్తిత్వాల, ప్రభావాల గురించిన విశ్లేషణ. అయితే మార్క్సిజం యొక్క బలహీనతను, స్వామీజీ వేదాంతపు ఔన్నత్యాన్ని విశ్లేషణాత్మకమైన రీతిలో బట్టబయలుగా ప్రదర్శించి వాటి మధ్యగల భేదాలను వివరించారు. పుస్తకం ఆద్యంతాలూ ఆయన విషయప్రధానమైన, విద్యాలయోచితమైన వైఖరిని అవలంబించారు.
Angleyula elubadi antuleni dopidi ఆంగ్లేయుల ఏలుబడి అంతులేని దోపిడి
Angleyula elubadi antuleni dopidi ఆంగ్లేయుల ఏలుబడి అంతులేని దోపిడి
About the book :
The colonial loot of Bharat during the British rule is documented in this book
పురాణవైర గ్రంథమాల 12 నవలలు Purana Vaira Granthamala
పురాణాల చారిత్రికతను తిరస్కరించే ధోరణిని విశ్వనాథ సత్యనారాయణ పురాణవైరమన్నారు. చారిత్రికాంశాలను పురాణాల నుంచి స్వీకరించి ఆయన పురాణవైర గ్రంథమాల రచించారు. ఈ నవలామాలిక లక్ష్యాలను పేర్కొంటూ ఆ లెక్క(పాశ్చాత్య చరిత్ర కారుల లెక్క) ప్రకారము కలి ప్రవేశము మొదలు- సంయుక్తా పృథ్వీరాజుల కథ దనుక, పాశ్చాత్యులు తారుమారు చేసిరి. ఆ కాలము, అనగా సుమారు మూడువేల యేండ్ల కాలము, మహమ్మదు గోరీ వచ్చువరకు మన చరిత్రలో పాశ్చాత్యులు చేసిన అవక తవకలు కాదని నవలల రూపమున నిరూపించుటకు చేసెడి ప్రయత్న మిది. అందుచేత దీనికి “పురాణవైరము” అని శీర్షిక ఏర్పరుపబడినది. అన్నారు విశ్వనాథ సత్యనారాయణ.
1. భగవంతుని మీది పగ ; 2. నాస్తికధూమము ; 3. ధూమరేఖ ; 4. నందోరాజా భవిష్యతి
5. చంద్రగుప్తుని స్వప్నము ; 6. అశ్వమేధము ; 7. అమృతవల్లి ; 8. పులిమ్రుగ్గు
9. నాగసేనుడు ; 10. హెలీనా ; 11. వేదవతి ; 12. నివేదిత