
హిందూ ఈషాప్ బులెటిన్ – వైశాఖ మాసం– యుగాబ్ద 5125
- May 7, 2023
- 0 Comment(s)
హిందూ ఈషాప్ బులెటిన్ – వైశాఖ మాసం – యుగాబ్ద 5125
హిందూ ఈషాప్లో కొత్త ఉత్పత్తులు
వీర సావర్కర్ ప్రతిమ – టేబుల్ టాప్
మే 28 – స్వాతంత్ర వీర సావర్కర్ జయంతి : ఎందరో విప్లవకారులకు, స్వాతంత్య్ర సమర యోధులకు స్ఫూర్తినిచ్చిన వీరుడు. రెండు యావజ్జీవ కారాగార శిక్షలు వడి అండమాన్ జైలులో 27 ఏళ్లు దుర్భర జీవితం గడిపినా చలించని ధీరుడు వీర సావర్కర్. దేశం కోసం జీవితాన్ని అర్పించుకున్న సావర్కర్ బ్రిటిష్ పాలనపై పోరాటానికి మాత్రమే పరిమితం కాలేదు. ఒక కవిగా, రచయితగా, వక్తగా, చరిత్ర కారునిగా, సంఘ సంస్కర్తగా హైందవ సమాజాన్ని జాగృత పరిచారు. వారిని తలచుకుని నివాళులర్పిద్దాం.
ఒక టేబుల్ మీద పెట్టుకోగలిగే విధంగా (టేబుల్ టాప్ ) ఉన్న వీర సావర్కర్ ప్రతిమను ఆఫీస్ లో మరియు ఇంటియందు టేబుల్ పైన ఉంచటం ద్వారా మనం స్ఫూర్తి పొందటమే కాక, చిన్న పిల్లలకు వారిని గురించి తెలిపే అవకాశం ఉంటుంది.
భారత మాత ప్రతిమ
ఒక టేబుల్ మీద పెట్టుకోగలిగే విధంగా (టేబుల్ టాప్ ) ఉన్న ఈ ప్రతిమ హిందూ ఈషాప్ లో లభ్యం అవుతోంది. దేశభక్తిని పెంపొందిస్తూ, చేసే ప్రతీ పనినీ దేశానికి అంకితం చేయాలనే భావనని వృద్ధి చేయాలనే సంకల్పంతో మన ముందుకు తీసుకురాబడింది, భారత మాత ప్రతిమ. ఎవరికైనా బహూకరించటానికి సైతం చక్కని ఎంపికగా నిలుస్తుంది.
కొన్ని పుస్తకాలు – మీ కోసం
ఆవరణ
లక్ష్మి, స్వేచ్చాభావాలు కలిగిన మరియు తెలివైన అమ్మాయి, చలనచిత్ర నిర్మాత. ఆమె ప్రేమించిన వ్యక్తి అయిన అమీర్‌ను వివాహం చేసుకోవడానికి గాంధేయవాది అయిన తన తండ్రితో సైతం సంబంధాలను తెంచుకుంది. లాంఛనంగా ఇస్లాం స్వీకరించి, తన పేరును రజియాగా మార్చుకోమని అమీర్ చేసిన అభ్యర్థనను ఆమె అయిష్టంగానే అంగీకరిస్తుంది. అయితే, తన భర్త తాను అనుకున్నంత ఓపెన్ మైండెడ్ & అభ్యుదయ భావాలు గల వ్యక్తి కాదని తెలుసుకుని ఆమె ఆశ్చర్యపోయింది. వివాహం తర్వాత, అమీర్ తన కుటుంబపు సంప్రదాయాలననుసరించి , వారి మతం యొక్క సిద్ధాంతాలను అనుసరించమని ఆమెను బలవంతం చేయడానికి ప్రయత్నిస్తాడు. ఆమెలో చెలరేగిన ఘర్షణ భారతదేశ చరిత్రలో కులమతాల వెనుక ఉన్న అనేక పొరలను తెలుసుకునేందుకు కారణం అయింది. శతాబ్దాలుగా భారతీయ సమాజంలో చాలా మార్పులు వచ్చినప్పటికీ, ఇంకా మార్పు రావాల్సిన అంశాలు చాలా ఉన్నాయని ఆమె కనుగొనటానికి ఆమె చేసిన కృషికి నవలా రూపమే ఈ ‘ఆవరణ’. ప్రముఖ కన్నడ రచయిత S.L భైరప్ప రచించిన రెండవ చారిత్రక నవల,’ఆవరణ’ గ తెలుగులో శ్రీమతి అరిపిరాల సువర్ణచే మొదటిసారి ఆంగ్లంలోకి అనువదించబడింది,
జిహాద్
ఇవాళ ఉగ్రవాదం ప్రపంచాన్ని వణికిస్తున్న అతి తీవ్రమైన ఉపద్రవం. ఉగ్రవాదం ఒక విధమైన మనస్తత్వం నుంచి పుడుతుంది. కొన్ని మతాలు తమ అనుయాయుల్లో అటువంటి మనస్తత్వాన్ని రూపొందిస్తాయి. నిజానికవి మతాలు కావు. మతరూపంలో ఉన్న సామ్రాజ్యవాద రాజకీయ ఉద్యమాలు. అలాంటి మతరూప సామ్రాజ్యవాద ఉద్యమాల నిజరూపాన్ని గుర్తించి తమను తాము రక్షించుకోవడం ప్రతి నాగరికుడి ప్రాణావసరం.
ఈ పుస్తకం ఇస్లాం మూలాధారాలలో ప్రతిబింబించే ఆ మత మూల స్వరూపాన్ని పాఠకుల ముందుంచే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ఇస్లాం యొక్క రెండు ముఖ్య లక్షణాలైన జిహాద్, జిజియాల విషయంలో ఇస్లాం మూల గ్రంధాలు ఏం చెపుతున్నాయో ఉదాహరణ పూర్వకంగా వివరిస్తుంది.
రాణా ప్రతాప్
మే 09 – మహా రాణా ప్రతాపసింహుని జయంతి : ప్రాతఃస్మరణీయుడైన మహారాణాప్రతాపసింహుడు దేశం, ధర్మం, సంస్కృతి స్వాతంత్ర్యం కోసం పోరాడి భావితరాలకు స్ఫూర్తిగా నిలిచాడు. మొగలు పాదుషా అక్బర్ గుండెల్లో నిద్రించిన ధీశాలి, ధీరోదాత్తుడు, మేవారు రాజు మహారాణాప్రతాప్. భారతదేశ చరిత్రలో మహారాణా ప్రతాప్ సాహసం, శౌర్యం, త్యాగం, బలిదానం, భావి స్వాతంత్ర్య పోరాటానికి స్ఫూర్తిగా నిలిచాయి. వారి చరిత్రని తెలుసుకుని ప్రేరణ పొందటమే మనము వారికిచ్చే ఘనమైన నివాళి. రాణా ప్రతాప్ జీవిత చరిత్ర హిందూ ఈషాప్ లో లభ్యమౌతోంది.
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు
మే 7 – అల్లూరి సీతారామ రాజు బలిదానం : ‘మన్నెం దొర’ అల్లూరి సీతారామ రాజు బ్రిటిష్ వారిపై సాయుధ పోరాటానికి తెర లేపిన భారత మాట ముద్దుబిడ్డ. మన్నెం సేనతో తెల్లదొరలను గడ గడ లాడించిన ఈ తెలుగు సింహం, ఆంగ్లేయుల తుపాకీ గుళ్లకు, గుండె చూపి దేశమాత దాస్య విముక్తికై బలిదానమొనర్చిన రోజున వారి చరిత్ర చదివి పులకించిపోదాం.
విప్లవ వీరుడు అల్లూరి సీతారామ రాజు – Viplava Veerudu Alluri Sitaramaraju ( Telugu )