
హిందూ ఈషాప్ బులెటిన్ – పుష్య మాసం – యుగాబ్ద 5124
- January 13, 2023
- 0 Comment(s)
హిందూ ఈషాప్ బులెటిన్ – పుష్య మాసం – యుగాబ్ద 5124
హిందూ ఈషాప్లో కొత్త పుస్తకాలు
ఆర్ ఎస్ ఎస్ ప్రణాళిక 21వ శతాబ్దం కోసం
ఆర్ ఎస్ ఎస్ ప్రణాళిక 21వ శతాబ్దం కోసం RSS Roadmaps ( Telugu )
- Book is expected to be released around Jan 20th, 2023
- RSS – Roadmaps for the 21st Century పుస్తకం యొక్క తెలుగు అనువాదం .
ఈ పుస్తకం ద్వారా శ్రీ సునీల్ అంబేకర్ సంఘ, సంఘ అంతర్గత కార్య ప్రణాళికలను ప్రపంచం ముందు ఉంచారు. సంఘ గతానికి, భారతీయ సమాజంలో భవిష్యత్తులో సంఘం నిర్వహించబోయే ప్రముఖ పాత్రకు వారధిలా ఉంది ఈ పుస్తకం.
– టీవీ మోహన్ దాస్ పాయ్, చైర్మన్, ఆరిన్ క్యాపిటల్ పార్ట్ నర్స్
సంగచ్చధ్వం, వసుధైవ కుటుంబకం లాంటి ఉన్నత భావాలను కలిగిన అందరినీ కలుపుకుని ముందుకెళ్ళే ప్రపంచం కోసం ఆర్ఎస్ఎస్ యువకులను తయారు చేస్తుందని ఆశిస్తున్నాను.
– కైలాశ్ సత్యార్థి నోబెల్ శాంతి బహుమతి (2014) గ్రహీత
సంఘాన్ని అర్థం చేసుకోవాలనుకునే వారి కోసం సులభరీతిలో సిద్ధం చేయబడినది ఈ పుస్తకం. ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవటానికి ఇది అత్యంత ఆవశ్యకం కూడా.
– ఆనంద్ కుమార్ సూపర్ 30 సంస్థాపకులు
సమశ్రుతి
ఈ పుస్తకము ఒక అనుభవ సంపుటము.
భగవదనుభవానికి ఒక అభివ్యక్తి కలిగితే , అది ఒక విద్యగానో , దర్శన శాస్త్రముగానో, కళావిష్కరణగానో ప్రకాశమానము అవుతుంది. ఇక్కడ అనేక వ్యక్తీకరణలు ఏర్పడ్డాయి. అవన్నీ వేటికవే మనల్ని పరమాత్మాభిముఖంగా గొనిపోయేవే. మణులన్ని ఒక హారమందు పొదవు కొన్నట్లు, ఇందులో కొన్ని ‘విద్య’లు అమరినాయి. గణపత్యుపాసనము కలిగించిన ఋతంభరా ప్రజ్ఞాస్వరూపమిది.
ఈ సంపుటీకరణం హృత్కేంద్రమును ఆశ్రయించింది . అనేక దేవతా తత్త్వములన్ని గురువునందే దర్శనము చేస్తూ జీవుడు పొందిన అనుభవ సాంద్రతకు ఇచ్చిన వ్యక్తరూపమిది.
కొన్ని పుస్తకాలు – మీ కోసం
భారత యువత మేలుకోండి
విద్యార్థుల కొరకు ప్రత్యేక కానుక .
విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి 6 పుస్తకాల సెట్.
• యువతా! మేల్కోండి మీ శక్తిని తెలుసుకోండి!
• భారత జాతికి నా హితవు
• యువకులకు వివేకానందుని పిలుపు
• నిజమైన వ్యక్తిత్వం అంటే?
• విద్యార్థులకు…
• ఏకాగ్రతా రహస్యం
భారతీయత : 4 పుస్తకాల సెట్
భారతీయుడై పుట్టి ధర్మమనే మాట ఎన్నడూ స్మరించనివాడు కన్న తల్లి దండ్రులను మరచినట్టే. మనకీ, ఇతర జాతులకు ఉన్న పెద్ద తేడా మనం నమ్ముకున్న ధర్మమే. నేడు మనదేశంలో ధర్మాల్ని మరపింపజేసింది ధనమే. దీనికోసం ఎన్ని పాపాలైనా మనుష్యులు చేస్తున్నారు. ఈ ధర్మానికి అనేక ముఖాలున్నాయి. సామాన్య ప్రజలు చేసే మహాపాపమూ లేదు. మహా పుణ్యమూ లేదు. వారిలో ధర్మాన్ని గురించిన చర్చ కాస్త జరిగితే, నైతికంగా వారిలో పెరిగిన ధర్మజ్ఞానం దేశాన్ని రక్షించగలదు. ధనమూ, విద్య, అధికారమూ పెద్ద స్థాయిలో అనుభవిస్తున్న వర్గానికి ఒక మోహం ఆవరించి ఉండడం చేత ఎవరి బోధలూ వారికి చేరలేవు. ఇక పేదవర్గానికి, శ్రమజీవులకు ధర్మబోధ చాలా వరకూ అనావశ్యకమూ, అసందర్భము. వారిలో ఉండే కించిత్ దైవభక్తి, పాపభీతి వాళ్ళ భవిష్యత్తులో వాళ్లని ఉన్నతస్థాయికి ఎదగనిస్తుంది. వారి వర్తమాన దారిద్య్రంలో పేదరికంలో పాపక్షయమూ అవుతుంది. వారికే దేశంలో మంచి భవిష్యత్ కనబడుతోంది. మధ్యతరగతిలో, ధర్మాన్ని స్మరించేవారు జ్ఞానమార్గంలో పెరగగలరు. ధర్మాన్ని విస్మరించిన ధనార్జన, దానం విస్మరించిన ధనపు మూటలు, అంతులేని లాభం, లోభం జీవనమార్గంగా కలిగినవారి దేశంలో పెద్దసంఖ్యే. వారి భవిష్యత్తు ధర్మదేవతే నిర్ణయిస్తుంది. ఈ విధంగా
ధర్మాన్ని గూర్చిన ప్రస్తావన ఏదోవిధంగా చేయడమే భారతీయత.
సుభాస్ చంద్ర బోస్
జనవరి 23 – సుభాష్ చంద్ర బోస్ జయంతి
జయంతే తప్ప వర్ధంతి లేని భారత మాత ముద్దు బిడ్డ, ఆజాద్ హిందూ ఫోజు స్థాపకులు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గురించి తెలుసుకుందాం.
భారత స్వాతంత్య్ర సమర ప్రధాన సేనాపతి, ఆల్ టైమ్ గ్రేట్ విప్లవ వీరుడు – నేతాజీ సుభాస్ చంద్ర బోస్ ( Netaji Subhash Chandra Bose ) రాజకీయ జీవిత అద్భుత చరిత్ర, భారత స్వాతంత్య్ర పోరాట ప్రధాన ఘట్టాలు, వాటిలో బోస్ పాత్ర, ప్రభావాలపై విఖ్యాత రచయిత ఎం.వి.ఆర్.శాస్త్రి విలక్షణ విశ్లేషణ.
భారత మాత – లామినేటెడ్ చిత్రపటము ( గోడకు వ్రేలాడదీసేది)
Bharat Mata – Wall Hanging Laminate
గణతంత్ర దినోత్సవాన భారత మాతకు స్వాగతం పలకండి.
” उत्तरं यत समुद्रस्य हिमाद्रेश्चैव दक्षिणं । वर्षं तद भारतं नाम भारती यत्र संततिः ” – विष्णु पुराण
* విష్ణు పురాణంలో ఉటంకించిన శ్లోకంకల భారత మాత లామినేటెడ్ చిత్రపటము.
* దేశభక్తి భావనను మరియు సౌబ్రాతృత్వ ఏకాత్మతా భావనలను పిల్లలకు కలిగించటానికి ప్రతీ ఇంట్లో ఉండవలసినది – భారత మాత చిత్రపటం .