హిందూ ఈషాప్ బులెటిన్ – ఫాల్గుణ మాసం – యుగాబ్ద 5124
- March 10, 2023
- 0 Comment(s)
హిందూ ఈషాప్ బులెటిన్ – ఫాల్గుణ మాసం – యుగాబ్ద 5124
హిందూ ఈషాప్లో కొత్త పుస్తకాలు
విస్మృత సామ్రాజ్యం విజయనగరం
ఉత్తర దిశనుండి మహమ్మదీయుల దండయాత్రలను నిరోధించి దక్షిణ భారతదేశాన్ని రెండు శతాబ్దాలకు పైగా కాపాడిన హిందూ రాజ్యంగా విజయనగరం చరిత్రకారులు మన్ననలందుకున్నది. విజయనగర సామ్రాజ్య వైభవాన్ని చాటిచెప్పే మహానగరం విజయనగర పట్టణం, శత్రు రాజులు కూడా జీవితంలో ఒక్కసారి ఈ నగరాన్ని దర్శించి తరించాలని ఉవ్విళ్లూరారంటే అందులో ఆవంతైనా అతిశయోక్తి లేదు.
మోడి 20 ఏళ్లు – స్వప్నించాడు సాధించాడు
భారత దేశ రాజకీయాలలో నరేంద్ర మోదీ ఎదుగుదల ఒక వరద వెల్లువ లాంటిది. ఈ దేశం మీద ఆయన పాలనా విధానాల ప్రభావం ఎంత లోతుగా, విస్తృతంగా పడిందంటే, ఈ దేశ పాలనా సరళిని, భారత దేశ రాజకీయ చరిత్రను భవిష్యత్తులో రెండు శకాలుగా విభజించి చెప్పుకొంటారు ‘మోదికి ముందు, మోదికి తరువాత.’
కొన్ని పుస్తకాలు – మీ కోసం
యుగద్రష్ట డాక్టర్ హెడ్గేవార్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ ( RSS) సంస్థాపకులు పూజ్యులు డాక్టర్ కేశవ బాలిరామ్ హెడ్గేవార్ జీవితం పై ఈ పుస్తకం అనేక కోణాలలో ఆయిన జీవితాన్ని పరిచయం చేస్తుంది.
రామం భజే శ్యామలం
“సీతా స్వయంవరానికి, సీతారాముల వివాహానికి ఏడాదికి పైగా గ్యాప్ ఉన్నది. సీతను వివాహం చేసుకోవడానికో… స్వయంవరంలో పాల్గొనడానికో.. రాముడు మిథిలకు వెళ్లలేదు. మిథిలలో రాజర్షి జనకుడి దగ్గర ఉన్న మహా ధనుస్సును చూడటానికి మాత్రమే రాముడు వెళ్లాడు. అక్కడ ధనుస్సును చూశాక దాన్ని ఎక్కుపెట్టాల్సి వచ్చింది. అప్పటికి సీతాస్వయంవరం జరిగి చాలాకాలమైంది. ”
ఇటువంటి అనేక వాల్మీకికృత రామాయణ అంశాలను తెలుసుకుంటూ స్పష్టత పొందటానికి చదవవలసిన పుస్తకం – రామం భజే శ్యామలం.
తవాస్మి : 4 పుస్తకాల సెట్
రామాయణంలోని ఒక్కో ఘట్టం, ఒక్కో పాత్ర మనకు ఎలాంటి సందేశాన్ని ఇస్తుందో సవివరంగా చర్చించారు. ఈ పుస్తకం ద్వారా కేవలం నీతి, నియమాలే కాకుండా…ఉత్తమ జీవన సందేశం అందించారు
మానవోత్తమ రామ
శ్రీరాముణ్ణి మానవోత్తముడిని , పురుషోత్తముడిని చేసిన , రామాయణం లో మహర్షి వాల్మీకి చే చెప్పబడిన 16 గుణాలు – ఆయా గుణాలు రామాయణంలో ఏఏ సందర్భాలలో ప్రస్ఫుటితమైయ్యింది , ఆ గుణాలు ప్రస్తుత కాలం లో మనకు ఏవిధంగా వ్యక్తిత్వ వికాసానికి నిర్మాణానికి ఉపయోగపడతాయి అని సోదాహరణంగా ఈ “మానవోత్తమ రామ ” పుస్తకంలో రచయిత భార్గవ వివరించారు .