హిందూ ఈషాప్ బులెటిన్ – మార్గశిర మాసం – యుగాబ్ద 5124
- December 23, 2022
- 2 Comment(s)
హిందూ ఈషాప్ బులెటిన్ – మార్గశిర మాసం – యుగాబ్ద 5124
హిందూ ఈషాప్లో కొత్త పుస్తకాలు
హైదరాబాద్ నిరాయుధ ప్రతిఘటన
హైదరాబాద్ సంస్థానంలో ఉన్న 88శాతం హిందువులపై నిజాం, అతని ఖాక్సర్ పార్టీ దమనకాండకు పాల్పడ్డాయి. ఆ దమనకాండలో నిజాం సైన్యం, ఇత్తెహాదుల్ ముస్లిమీన్, రోహిలా, పఠాన్, అరబ్ లు పాలుపంచుకున్నారు. ఈ దమనకాండ 1920లో ప్రారంభమై ఆ తరువాత క్రమంగా పెరిగింది. 1938నాటికి పరిస్థితులు భయానకంగా మారాయి. తమ బాధలు, కష్టాలను చెప్పుకునేందుకు కూడా హిందువులకు అనుమతి లేదు. అన్యాయ, నియంతృత్వ నిజాం పాలనకు వ్యతిరేకంగా నిరాయుధ ప్రతిఘటన తప్ప హిందువులకు మరొక మార్గం లేకపోయింది.
మహిళలు మరియు శబరిమల
పునరుత్పత్తి వయస్సులో ఉన్న స్త్రీలను శబరిమలలోకి ఎందుకు అనుమతించరు? అని అడిగిన వారందరికీ ఈ పుస్తకం ఒక సమాధానం. ఈ పుస్తకం శబరిమల ఆలయంలో మహిళలపై ఆంక్షల వెనుక ఉన్న శాస్త్రీయతను, మునుపెన్నడూ చర్చించని దృక్పథాన్ని అందిస్తుంది. శబరిమలకి సంబంధించిన ఐదు దేవాలయాల సందర్శన ఆమె శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేసిందో నమోదు చేసిన రచయిత, వారి ప్రత్యక్ష అనుభవాన్ని ఈ పుస్తకంలో అందించారు. ఆయుర్వేదం, చక్రాలు, తంత్రం మరియు ఆగమ శాస్త్రం వంటి భారతదేశ సాంప్రదాయ విజ్ఞాన శాస్త్ర-సంబంధిత ఆధారాల ద్వారా ఆలయ స్వభావాన్ని వివరిస్తూ, స్త్రీ దృక్కోణం నుండి శబరిమల గురించి రచించబడిన అరుదైన పుస్తకం ఇది. అదే సమయంలో, రచయిత యొక్క వ్యక్తిగత అనుభవాలు ఈ లోతైన శాస్త్రాల అవగాహనను సులభతరం చేస్తాయి. ఈ పుస్తకం శబరిమల వంటి దేవాలయాలు మానవ శరీరధర్మాన్ని, ముఖ్యంగా స్త్రీల ఋతుచక్రాలను ఎలా ప్రభావితం చేస్తాయో పాఠకులకు ఒక సంగ్రహావలోకనం అందిస్తుంది. ఈ పుస్తకం హిందూ దేవాలయాల పట్ల, ముఖ్యంగా శబరిమల పట్ల ఉన్న అవగాహనను మారుస్తుంది.
కొన్ని పుస్తకాలు – మీ కోసం
తెలుగు డైరీ – 2023
వెనుక పేజీ : ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ ( హైదరాబాద్ రాష్ట్ర విమోచనంలో కీలక పాత్రధారి)
ముఖ్యాంశాలు :
- తేదీలు (తిథుల సమేతంగా)
- ప్రతీ పేజీకి ఒక సూక్తి
- సంవత్సరపు ప్లానర్
- విశేషాంశాలపైన వివరణ
- పండుగలు, ప్రభుత్వ సెలవు దినాలే కాక జాతి స్మరించవలసిన దినాలు కూడా పొందుపరచబడ్డాయి.
- సంక్షిప్త పంచాంగ వివరములు (మాస, ఋతు,ఆయన ప్రారంభ సమయాలు, కార్తె,రాశి ప్రవేశాలు మరియు ఇతర నక్షత్ర సంబంధిత విషయాలు ) కలవు.
- పూర్తి వందే మాతరం, ఏకాత్మతా స్తోత్రం, ఏకాత్మతా మంత్రం అదనపు ఆకర్షణ
ఇండియా అనే భారత్
రచయిత : శ్రీ. జె . సాయి దీపక్
వలసవాదం, నాగరికత, రాజ్యాంగం… ఈ మూడూ మనదైన దేశీయ తాత్వికతపై ఎలాంటి ప్రభావాన్ని చూపాయి – అన్న అంశం ఈ పుస్తకంలో ఆసక్తికరంగా వివరింపబడినది.
వలసవాదం – వర్తమానంలో మనం మాట్లాడుకునే ప్రతిమాటలోనూ వలసవాద ఆధునికత వ్యక్తమవుతోందా? రోజూ దేవుణ్ని పూజించినా మన ఆలోచనను ప్రభావితం చేస్తున్నది ఏంటి?
ఆధునికతను సందేహం లేకుండా అంగీకరించడం అంతిమంగా ప్రాచీనతను తిరస్కరించడం కాదా?
యూరోపియన్ వలసవాదం భారతీయ చింతనా సర్వస్వంపై ఎలాంటి ప్రభావం చూపింది? వలసవాదం వలన మన తాత్విక చింతన ప్రభావితమైనదా? ఒక వేళ భారతీయ చైతన్యం వలసవాద ప్రభావానికి గురైతే, యూరోపియన్ వలసవాద పూర్వ తాత్వికత గురించి ఎలా తర్కిస్తాం? మన చైతన్యాన్ని వలసవాదం ఎలా నిర్ణయిస్తోంది?
నాగరికత – పాశ్చాత్య నాగరికత, సింధూనాగరికత కన్నా గొప్పదా? యూరోపియన్ ఆధునికత లేదా హేతు ఆధారిత చింతన ప్రాకృతిక చింతనను ప్రభావితం చేసిందా? పాశ్చాత్య అర్థంలో శాస్త్రీయం అంటే ఏంటి? ప్రాక్పశ్చిమ దర్శనాల్లో శాస్త్ర ప్రాతిపదికను ఎలా నిర్వచించారు?
రాజ్యాంగం – రాజ్యాంగం ‘భారతీయ’ ఆత్మను నిజంగానే ప్రతిబింబిస్తుందా?
ఏముంది మన రాజ్యాంగంలో. ప్రజాస్వామ్య భావనను మించిన నైతికత మన సమాజంలో లేదా ? నాగరికతగా మనం కీర్తించే పట్టణీకరణ వల్ల మనకు ఒనగూడింది ఏంటి? మనం అత్యున్నతమైందని కీర్తించే రాజ్యాంగంపై వలసవాద ప్రభావం ఏమేరకు ఉంది?
నిజంగానే ఉంటే మనం ఏం చేయగలం?
తీవ్రమైన సైద్ధాంతిక చర్చలోకి దిగితే భారతీయ చరిత్ర రచనపై ప్రాచీనత ప్రభావం ఉందా? పాశ్చాత్య ప్రభావం వుందా?
భారతీయులు అంగీకరించిన నాగరికత, రాజ్యాంగం రెండూ వలసవాద ప్రభావంతో రూపొందినవే… అంటూ “భారత దేశం” అనే అనుభూతిని ఒక సంస్కృతిగా, భారత సంస్కృతి ఎలా మలచుకుంది అనే అంశం పై రచింపబడిన సమగ్ర పుస్తక త్రయంలోని ఈ మొదటి పుస్తకం 1920 వరకు జరిగిన సంఘటనలతో ముగుస్తున్నది
సత్యపథం
భారతదేశం-పురాతన దేశం. విశ్వగురువుగా కీర్తింపబడిన దేశం. సనాతన ధర్మం మన దేశానికి ప్రాణం. విశ్వవిద్యాలయాల నుంచి డిగ్రీలు చేతపట్టుకుని బయటకు వస్తున్న మేధావులు బ్రిటను వారు దుర్బుద్ధితో కల్పించిన విష సిద్ధాంతాలను, తప్పుడు చరిత్రను వల్లెవేసుకుని వస్తున్నారు. తరతరాలకు కల్పిత చరిత్రను బోధిస్తున్నారు. ఈ ప్రచారవేత్తలలో దుర్బుద్ధితో కొందరు, అమాయకంగా, అనాలోచితంగా కొందరు ఈ కుట్ర కొనసాగింపులో భాగస్వాములవుతున్నారు. ఈ విషపన్నాగం నుంచి విముక్త అయినప్పుడే మనకు నిజమైన బౌద్ధిక స్వరాజ్యం ఏర్పడుతుంది. అటువంటి స్వాతంత్య్ర సాధన కోసం, స్వ-జాతీయ భావనిష్ఠతో బి.ఎస్. శర్మగారిచే రచింపబడిన పుస్తకం ‘సత్యపథం’.
A నుంచి Z వరకు వర్గీకృతమైన ఈ 26 వ్యాసాలలో బ్రిటను వారు ప్రచారం చేసిన వివిధ ద్రోహపూరిత అసత్యాలను గురించిన విశ్లేషణను రచయిత అందించారు . తరతరాలుగా వాస్తవాల వక్రీకరణను ఎందుకు ప్రచారం చేస్తున్నారో, అసలు సత్యం ఏమిటో వివరించారు. ఈ వ్యాసాలతో ఆవిష్కృ వాస్తవాలు మళ్లీ వెలుగు చూడాలి. చరిత్రలోని వక్రీకరణలు తొలగాలి!
99 సెకన్ల కథలు
2 comments on “హిందూ ఈషాప్ బులెటిన్ – మార్గశిర మాసం – యుగాబ్ద 5124”
Dear sir,
I am placing an order to supply the books to our college library. Please send me the books and also send me the bank account details like Account Number, IFSC code so that I can send money through NEFT to your account.
College address: Principal, Sri Ramakrishna Degree (Autonomous) College, Srinivasa Nagar, Nandyal-518 501 A.P.
With regards,
Dr.G.Ramakrishna Reddy,
Chairman.
Mobile & Wattsapp No. 9440290459
Namaste Ramakrishna garu,
We have sent the details on your email.