
హిందూ ఈషాప్ బులెటిన్ – మాఘ మాసం – యుగాబ్ద 5124
- February 10, 2023
- 0 Comment(s)
హిందూ ఈషాప్ బులెటిన్ – మాఘ మాసం – యుగాబ్ద 5124
హిందూ ఈషాప్లో కొత్త పుస్తకాలు
మహేతిహాసం
“భారతాన్ని మూల గ్రంథాధ్యయనం చేయకుండానే దుష్ట పక్షపాతం పెంచుకున్నవారి కాల్పనిక గాథలు ఎన్నో అపోహలనీ, అసత్యాలనీ పోగుచేశాయి. వాటిని తూర్పారబట్టి, అసలు భారతంలోని యథార్థాంశాలను సప్రమాణంగా విశ్లేషించిన వ్యాసాలివి. మూల భారతంలోని శ్లోకాలను ఉటంకిస్తూ పూర్వాపర పరిశీలనతో రచించిన వ్యాసాలు మహాభారత స్వరూపాన్ని ఆవిష్కరించే సత్య దర్శనాలు. ” – బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ.
ఆధ్యాత్మిక, క్షాత్ర తేజం సంత్ సేవాలాల్ మహారాజ్
భారదేశ చరిత్రలో 18వ శతాబ్దం ఎంతో క్లిష్టమైనది. గొప్పగొప్ప రాజులు అంతరించారు. మరఠాలు శక్తివంతులవుతున్నారు. మరోవైపు బ్రిటిష్ వారు (ఈస్ట్ ఇండియా కంపెనీ) భారత్ ను తమ అధీనంలోకి తీసుకువచ్చే పని మొదలుపెట్టారు. మిషనరీలు క్రైస్తవ మతప్రచారం ముమ్మరం చేశారు. ఈ మూడు శక్తుల పోరాటం నడుస్తున్నది. అలాంటి పరిస్థితుల్లో సేవాలాల్ మహారాజ్ అవతరించారు. క్రైస్తవీకరణ సాగుతున్న సమయంలో బంజారాలలో హిందూ చైతన్యాన్ని పెంపొందించారు. భక్తి యుగంలో జన్మించిన మహాత్ములలాగా భక్తిని ప్రేరేపించారు. భక్తి ఆయుధంగా సంస్కరణ చేశారు. సమాజాన్ని సంఘటితం చేశారు. రాబోయే పరిణామాలను ముందుగా పసిగట్టారు. ఆ మహాత్ముని జీవిత చరిత్ర అందరూ చదవాలి. ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి. కందకుర్తి ఆనంద్ వ్రాసిన ఈ సంక్షిప్త జీవిత చరిత్ర సేవాలాల్ గురించిన ముఖ్యమైన సమాచారాన్ని మన ముందుంచుతుంది.
కొన్ని పుస్తకాలు – మీ కోసం
శ్రీ గురూజీ జీవన యజ్ఞము
రాష్ట్రీయ స్వయం సేవకసంఘకు ద్వితీయ సర్ సంఘచాలక్, పూజ్యశ్రీ. మాధవరావు సదాశివరావు గోళ్వాల్కర్, సంఘగంగను ఒక బృహత్తరధారగా యావద్దేశంలోనే కాక ప్రపంచమంతటా వ్యాపింపచేసిన యుగద్రష్ట. శ్రీ.గురూజీ అని ఆత్మీయంగా పిలువబడే వీరి జయంతి, మాఘ బహుళ ఏకాదశి(16th ఫిబ్రవరి ), సందర్భంగా క్రింది పుస్తకం చదివి, చదివించి వారికి నివాళులు అర్పిద్దాం.
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ ద్వితీయ సరసంఘచాలక్ పరమ పూజనీయ శ్రీ మాధవ సదాశివ గోళ్వల్కర్ (గురూజీ) జీవిత చరిత్ర ఇది.
నేడు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ పని దేశమంతటా విస్తరించి వుంది. సంఘ పేరుప్రతిష్ఠలు ప్రపంచమంతటా వ్యాపించి వున్నాయి. ఇదంతా ప్రధానంగా శ్రీ గురూజీ నాయకత్వం సాధించినదే. శ్రీగురూజీ జీవితం త్యాగమయం. తపోమయం. ఆయన మేధావి. ఆత్మజ్ఞాని. వ్యవహారదక్షుడు. మౌలికంగా ఆలోచించే సిద్ధాంతవేత్త, మహావక్త. కఠోరమైన ఆదర్శవాదానికి సముజ్వల ప్రతిబింబం ఆయన జీవితం. అయినా ఆయన పలుకు, పనితీరు మార్దవానికీ, నమ్రతకూ ప్రతిరూపాలు. ఆధునిక యుగంలో అసాధారణ ప్రజ్ఞాశాలి అయిన మహాపురుషుడు ఆయన.
ఆ మహా దేశ సేవకుని జీవిత చరిత్రను బాలకులు, కిశోరులు, నవయువకులు చదవాలని, వారి జీవితంలోని మహత్తర ఘట్టాలను మననం చేసుకోవాలని, ఆ ఒరవడిలో తమ జీవితాలను వికసింపజేసుకోవాలని, సద్గుణాలతో సంపన్నం చేసుకోవాలని, తమ జీవన పుష్పాలను భరతమాత చరణాల ముందు అర్పించాలనే ఆకాంక్ష వారిలో మొగ్గ తొడగాలని – ఈ ఆలోచనతో శ్రీ ప్ర.గ. సహస్రబుద్దే ఈ పుస్తకాన్ని హిందీలో రచించారు. శ్రీకందర్ప రామచంద్రరావు దానిని తేట తెలుగులోనికి అనువదించారు.
హిందూ స్వరాజ్య, శివాజీ మహారాజ్: పోలో T-షర్ట్
” హిందూ స్వరాజ్యం , ఈశ్వర సంకల్పం ” – “Hindu Swaraj – The Divine Will”
వెనుకవైపు స్ఫూర్తిదాయకమైన తెలుగు ఉల్లేఖనం(కోట్) మరియు ముందువైపు ఆంగ్ల ఉల్లేఖనం(కోట్)తో శివాజీ మహారాజ్ చిత్రం ఉన్న టీ-షర్టు;
Colour : పీచ్ (Peach )
విచారణల కోసం, దయచేసి 8520999582 కి “Shivaji T” అని SMS/ Whatsapp లేదా hindueshop.helpdesk@gmail.com కి ఇమెయిల్ చేయండి.
జాగృతి వార పత్రిక సంవత్సర చందా
జాగృతి తెలుగు వార పత్రిక వార్షిక చందా Rs . 650 /- ;
ఈ చందా నేరుగా జాగృతి పత్రిక టీం కి చెరవేస్తాము. పత్రిక డెలివేరి బాధ్యత జాగృతి టీం వహిస్తుంది. దీనిలో హిందూ ఈషాప్ ప్రమేయము ఉండదు.
దీప మాలిక – 3 పుస్తకాల సెట్
చిరుదీపాలు
దేశవిదేశాలలో రాజులు, యోగులు, సామాజిక సంస్కర్తలు,రకరకాల రంగాలలో పేరొందిన సాధారణ వ్యక్తులు జన్మించారు. నిజానికి ప్రతి ఒక్కరి జీవితమూ ఒక సందేశమే ! అయితే అందరి జీవితచరిత్రలనూ ఒకచోట వ్రాయడం అసాధ్యం.కాబట్టి వారి వారి జీవితాల్లోని విశేష ఘట్టాల్ని సూక్ష్మరూపంలో ఏర్చికూర్చడం జరిగింది.
మహాపురుషుల అడుగుజాడలు సామాన్యులకు రాచబాటలవుతాయి.
దారిదీపాలు
జీవితంలో ఏదో ఒకటి సాధించిన వారికి సంబంధించిన ఘటనలు ముందుతరాలవారికి దారిదీపాలు.
మనమూ ఉన్నత లక్ష్యాలను చేరుకోడానికి , జీవితాన్ని చూడాల్సిన తీరుని తెలుసుకోవడానికి దారిచూపే దీపాలివి.
ఆకాశదీపాలు
జీవితం కంప్యూటర్ కు పరిమితమై , మెకానికల్ గా తయారైన ప్రస్తుత రోజుల్లో కనీసం సరదాకైనా మహాసాధకుల జీవన సంఘటనలను చదవాలి. జీవితం ఎంత లోతైనదో, సృజనాత్మకత ఎంత పదునైనదో తెలుస్తుంది.
కథ లేదా సంఘటన అనేది ఒక జీవన శకలాన్ని, దృశ్యాన్ని ప్రదర్శిస్తుంది. సందేశాన్ని అందించడమేగాక ఓ దార్శనిక కోణాన్ని ఆవిష్కరిస్తుంది.