Description
కాశ్మీర్ వ్యథ :
అరవైఏళ్ల కిందటే ఇండియన్ యూనియన్లో జమ్మూ కాశ్మీర్ విలీనమైనా భారత జీవనస్రవంతికి కాశ్మీర్ ఇప్పటికీ దూరమే. కాశ్మీరుకీ మనకీ మధ్య కనిపించని అడ్డుగోడలు ఎక్కడివి? కాశ్మీర్ లోయలో ఆజాదీ అరుపుల సబబెంత? అజాద్ కాశ్మీర్లో ఆజాదీ ఎంత?రిపబ్లిక్ భారత్లో భాగమైన జమ్ముకాశ్మీర్లో మరల ఆజాదీ ఏమిటి? ‘ఆపరేషన్ టోపాక్’ లో ఏముంది? అరవైఏళ్ల అనర్థక విధానాల, అసమర్థ నిర్వాకాల దుష్పరిణామాలను కళ్లకు కట్టించే పుస్తకం ‘కాశ్మీర్ వ్యథ’
భూతల స్వర్గమైన కాశ్మీర్ రావణ కాష్ఠంలా రగలటానికి కారకులెవరు, కారణాలేంటి? కాశ్మీర్లో నిజమైన మైనార్టీలెవరు, ఎందుకు మైనార్టీలైనారు? అసలు ఇంతటి కాశ్మీర్ ఆర్తికి కర్తలెవరు?
ఇటువంటి సంధించవలసిన అనేక ప్రశ్నలకు సమాధానమే ఈ ‘కాశ్మీర్ వ్యథ’.
కాశ్మీర్ స్వతంత్ర భారతంలో విలీనమయ్యే సమయంలోని అవకతవకల గురించీ, మన ఉదాసీనత వలన సర్వమంగళమైన మంగళడామ్ గురించి, త్రిశంకు నరకంలో కొట్టుమిట్టాడుతున్న పాక్ ఆక్రమిత కాశ్మీరీల గురించి, కాశ్మీర్ నడిబొడ్డున ప్రముఖులను సైతం సునాయాసంగా చంపిపారేసిన మిలిటెంట్ల విలయానికి వెనుక కల మూలాల గురించి, మన మాతృభూమిలో అంతర్భాగమైన సుందర కాశ్మీరంలో ‘అమరనాధుని’ సాక్షిగా సమరసత వెల్లివిరియటానికి కల అడ్డంకుల గురించి, శాశ్వతమైన తాత్కాలిక 370 అధికరణం గురించీ – ఇలా అనేక విషయాలను నిక్కచ్చిగా, నిష్పాక్షికంగా మరియు నిర్ద్వందంగా చర్చించిన హస్తభూషణమే ‘కాశ్మీర్ వ్యథ’.
Reviews
There are no reviews yet.