Description
ఆదిశంకరభగవత్పాదులు నెలకొల్పిన కామకోటిపీఠపరంపరలో ౬౮ ఆచార్య పురుషులుగా జగత్ప్రసిద్ధి గాంచిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి శ్రీచరణులు విద్యార్థి దశలోనే సన్యసించి, అచిరకాలంలో వేద శాస్త్ర పురాణాదులను పుక్కిటబట్టారు. దేశ విదేశాలకుచెందిన ౧౭ భాషలను అభ్యసించారు. ప్రాచీన విద్యలు, నవీన కళలు పెక్కింటిలో సర్వంకష ప్రతిభను సాధించారు.
దేశమంతటా వేద పాఠశాలలు నెలకొల్పి వేదాధ్యయనాన్ని ప్రోత్సహించారు. ఆలయ మంటపాల నెన్నిటినో నిర్మించారు. ధర్మ సంవర్ధనమే లక్ష్యంగా ఇరవై సంవత్సరాలు పాదయాత్ర చేస్తూ యావద్భారతం పర్యటించారు. హిందూమత సంరక్షణకు, వివిధ శాఖలకు చెందిన హిందూ మతావలంబుల సమైక్యతకు అద్వితీయమైన కృషిచేశారు. ఎల్లెడల ధర్మ సంస్థలనూ, సేవాసంఘాలను వెలయింపజేశారు.
Publisher : Kanchi Kamakoti Peetam ; Pages : 248;PaperBack



Reviews
There are no reviews yet.