Telugu Newsletter – Vaishakha month
- May 23, 2022
- 0 Comment(s)
హిందూ ఈషాప్ బులెటిన్-
వైశాఖ మాసం-యుగాబ్ద 5124
హిందూ ఈషాప్లో కొత్త పుస్తకాలు
యుగద్రష్ట డాక్టర్ హెడ్గేవార్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ ( RSS) సంస్థాపకులు పూజ్యులు డాక్టర్ కేశవ బాలిరామ్ హెడ్గేవార్ జీవితం పై ఈ పుస్తకం అనేక కోణాలలో ఆయిన జీవితాన్ని పరిచయం చేస్తుంది.
దగాపడ్డ తమ్ములార దారిని గుర్తించండి
దగా పడ్డ తమ్ములెవరో దారిని గుర్తించాల్సిన వారెవరో వివరించిన పుస్తకం మార్కెట్ లోకి వచ్చింది.
కొన్ని పుస్తకాలు – మీ కోసం
భారత్ దేశ చరిత్ర లో ఆరు స్వర్ణ పత్రములు
ఇది స్వాతంత్ర్య వీర్ సావర్కర్ రచించిన 6 Glorious Epochsకి తెలుగు అనువాదం.
మార్గదర్శకులు మహర్షులు నాలుగు భాగాలు. మొదటి భాగంలో 10, రెండవ భాగంలో 10 , మూ డవ భాగంలో 10, నాలుగవ భాగంలో 11 మంది మహర్షుల విశేషాలు ఉన్నాయి. ఋషుల జీవితాలలోని సంఘటనల వెనుక దాగిన తత్వ రహస్యాలను, వారు మనకు అందించే సందేశాలను అద్భుతంగా వివరించిన ఈ పుస్తకాలు చదివి అందరూ భారతీయ సంస్కృతి గురించి అపారమైన జ్ఞానం పొందవచ్చును.
పథదర్శిని శ్రీరామ కథ
ఇది శ్రీమతి గారు ఇచ్చిన రామాయణం ప్రవచనాలకు తెలుగులోకి అనువాదం. లక్ష్మీబాయి కేల్కర్ , రాష్ట్ర సేవిక సమితి వ్యవస్థాపకురాలు .
సర్వసంభవామ్
తిరుమల-తిరుపతి దేవస్థానాల (T.T.D) కార్యనిర్వహణ అధికారిగా (Executive Officer) పనిచేసిన I.A.S అధికారి శ్రీ. పి. వి. ఆర్. కె. ప్రసాద్ గారికి ఆయన పదవీకాలంలో (1978-82) ఎదురైన అనుభవాల సమాహారమే ఈ పుస్తకం. “స్వాతి” సపరివార పత్రికలో ఒక్కొక్కటిగా ప్రచురితమైన ఈ అనుభవాలని సంకలనం చేసి పుస్తకంగా ప్రచురించారు. ఇందులో మొత్తం 30 అనుభవాలను పొందుపరిచారు. ఆరునుంచీ ఎనిమిది పేజీలు ఉన్న ఒక్కో అనుభవమూ, కళ్ళకు కట్టినట్టుగా, అదే సమయంలో సంక్షిప్తంగానూ వ్యక్తీకరించబడింది.