Description
About the Set of 4 volumes :
గురుపద్య విద్యకు ఆద్యుడు నన్నయభట్టారకులు. వారి కవితా శిల్పమును విశ్వనాథులవారు
” విశ్వనాథ విమర్శ గ్రంథ నిధి “లో నన్నయగారు రచించిన ఆదికావ్య కథారహస్యము గుర్తుకు వస్తుంది.
ఈ గ్రంథములో ప్రధానముగా నన్నయ్య గారి కధాకధన వైఖరి విశ్వనాథులవారు వివరించారు.
ఈ విమర్శనా గ్రంధములో
Vol 1
నన్నయ్యగారి ప్రసన్నకధాకలితార్ధయుక్తి
ఉత్తర హరివంశ కావ్యకర్త “నాచనసోమన్న”రస పరిజ్ఞాన వైశిష్ట్య విమర్శనము.
ఆంధ్రకవితా పితామహులైన అల్లసాని పెద్దన్నగారి “మనుచరిత్ర” కధాకధన శిల్పవైభవ విమర్శనము.
మహాకవి కాళిదాసుని అభిజ్ఞాన శాకుంతలము “శాకుంతలము యెుక్క అభిఙ్ఞానత”
విశ్వనాధుల వారి ఈ విమర్శన వ్యాసములు ౧౯౪౯ సంవత్సరములో భారతి పత్రికలో ధారావాహికముగా ప్రచురించబడినది.
“సాహిత్య సురభి “
విశ్వనాధుల వారి “సాహిత్య సురభి ” అను ఈ గ్రంధము సుమారు ౩౦౦ పద్యముల సంకలనము.
పూర్వము , వీధి నాటకములు , హరికధలు,పురాణప్రవచనాలు, పురాణాలు, మన భాషను గొప్పగా ప్రచారము చేసేవి.
ప్రస్తుతము మన దేశములో మన గ్రంధముల మీద ఆసక్తి తగ్గి విదేశి భాష మీద మోహము పెరిగి, మన భాషకన్న ఆంగ్ల భాష అర్ధం చేసుకొనుట సులభమను దుస్థితి ఏర్పడింది.
ఈ ౩౦౦ పద్యాలు పూర్వము ఎక్కువ ప్రాచుర్యము మరియు కంఠస్తము గావించబడినవి కొన్ని పద్యములు ధర్మమును ,కొన్ని లోతైన వేదాంతర్ధములతో, కొన్ని సాహిత్య సౌరభముతో నిండినవి.
కావ్యానందము
భారతదేశవాసులు సాహిత్యము నందు,కవితామార్గము నందు,రస సిధ్ధాంతమును నమ్ముదురు. “రసో వై సః ” అని.
ఇతర దేశ సాహిత్యములందు ఈ బుధ్ధి లేదు.
వారి పూర్వీకులు వారికి తెలియ చేయలేదు, మన పూర్వీకులు మనకు తెలియ చేశారు, అందుకే మనది రస సిధ్ధాంతము.
రసమే ఆనందము, ఆనందమును పొంది ఆనందము కలవారము అవుతున్నాము.
ఏ భాషలోనైనను ఉత్తమ గ్రంధమును చదివి ఆనందము పొందవచ్చు.
ఆ ఆనందము, సంతోషము,సుఖము,ఉత్సాహము,మెచ్చుదల, పఠితయొక్క విమర్శదృష్టికి తృప్తి.
అందుచేత ఈ కావ్యములో ఆనంద విచారము చర్చించబడినది.
“కావ్యపరీమళము “ ఈ గ్రంధములో విశ్వనాధుల వారు,
అల్లసాని పెద్దన గారి “మనుచరిత్రము”.
తెనాలి రామకృష్ణుల వారి “పాండురంగమహత్యము” నంది (ముక్కు ) తిమ్మన గారి ” పారిజాతపహరణము”
రామరాజభూషణుల వారి “వసు చరిత్ర” శ్రీనాధ కవి సార్వభౌముల “హరవిలాసము”
శ్రీనాధ కవి సార్వభౌముల “భీమేశ్వర ఖండము” ధూర్జటి గారి ” శ్రీ కాళహస్తి మహత్యము”
నాచన సోమన్న గారి ” ఉత్తర హరివంశము” చేమకూర వేంకటకవి గారి “విజయ విలాసము”
పై కావ్యముల కవితా సౌరభానిని వివరించారు.
Reviews
There are no reviews yet.