స్వదేశీ – ఆత్మశక్తి Swadeshi – Atmashakti

ఈ దేశ సాంస్కృతిక-ఆర్ధిక వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని, స్వ-ధర్మం, స్వ-భాష, స్వ-భూష, స్వ-భవనం, భజన, భోజనం వంటి ప్రాథమిక విషయాలపై భారతీయ తాత్విక చింతన ఆధారపడి ఉంది. దీనిని సాధించాలంటే ప్రజలలో ప్రగాఢమైన ఆత్మ విశ్వాసం, అఖండమైన శ్రద్ధ ఉండాలని ఈ పుస్తకంలో వివరించడం జరిగింది.

50.00

3 in stock

Compare

Description

About the book :

“స్వదేశీ – ఆత్మశక్తి” అనేది భారత సాంస్కృతిక-ఆర్ధిక పరమవైభవ పునరుత్థానం. ఇది భారతీయుల ఆత్మశక్తి పునఃజాగరణ ద్వార మాత్రమే సాధ్యమవుతుంది. బాహ్య ప్రపంచం మీద ఆధారపడదు.
స్వదేశీ అనేది కేవలం ఒక భౌతికపరమైన ఆర్థిక విధానం, నినాదం, వస్తువు మాత్రమే కాదు. అది ప్రతి వ్యక్తి హృదయాంతరాలలో దృఢంగా నిక్షిప్తమైన జాతీయ భావనను, దేశభక్తి అభివ్యక్తీకరణను సూచిస్తుంది. ఇందుకోసం స్థానిక ఉత్పత్తులను, వస్తుసేవలను ఉపయోగించాలి అలాగే స్థానిక పరిశ్రమలు, అంకుర పరిశ్రమలను ప్రోత్సహించాలి. తద్వారా మన దేశ ఆర్ధిక వ్యవస్థను మరింత స్వయం-సమృద్ధిగా వృద్ధి చేయగలం. దీనిని కాలానుకూలంగా మార్చుకోవచ్చు. ఇందుకోసం ఆత్మవిశ్వాసంగల ప్రజల సహకారం కావాలి. ఇది భారత ఆర్ధిక పరమవైభవంతో ముడిపడిఉంది.
జన్ (మనుషులు), జల్ (నీరు), జమీన్ (భూమి), జంగల్ (అడవి), మరియు జాన్వర్ (పశు పక్ష్యాదులు), పంచభూతాలలో భాగమైన వాయువు మరియు అగ్నిల సుపోషణ, సంరక్షణ – స్వదేశీ.
ఇష్టపూర్వకంగా దేశీ వస్తుసేవల వినియోగం – అవసరానికనుగుణంగా స్వదేశీ వస్తువుల వాడకం – తప్పనిసరైతే తప్ప విదేశీ వస్తువులు అనే సూత్రాన్ని దేశహితం కోసం భారతీయులు పాటించాల్సిన అవసరం ఉంది.
ఈ దేశ సాంస్కృతిక-ఆర్ధిక వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని, స్వ-ధర్మం, స్వ-భాష, స్వ-భూష, స్వ-భవనం, భజన, భోజనం వంటి ప్రాథమిక విషయాలపై భారతీయ తాత్విక చింతన ఆధారపడి ఉంది. దీనిని సాధించాలంటే ప్రజలలో ప్రగాఢమైన ఆత్మ విశ్వాసం, అఖండమైన శ్రద్ధ ఉండాలని ఈ పుస్తకంలో వివరించడం జరిగింది.

Author

Lingamurthy S Dr.

Reviews

There are no reviews yet.

Be the first to review “స్వదేశీ – ఆత్మశక్తి Swadeshi – Atmashakti”

Select at least 2 products
to compare