Sale!

శివానంద స్ఫూర్తి- Sivananda Sphoorti

శివానంద స్ఫూర్తి

భక్తుల అనుభవాలు – జ్ఞాపకాలు

Original price was: ₹250.00.Current price is: ₹235.00.

3 in stock

Compare

Description

మన పుణ్యభూమి మహాత్ములకు పెట్టింది పేరు. వేదయుగం నుంచి నేటి దాకా ఎందరో యోగులు, సిద్ధులు, సద్గురువులు, అవతారపురుషులు, మహాజ్ఞానులు, మహాద్రష్టలు కోరిన వారికి కొంగుబంగారమై, సాధకులకు బోధకులై, చేయిపట్టి తీరం దాటిస్తూనే ఉన్నారు. జాతి జీవనంలో దివ్యకాంతులు విరజిమ్ముతూనే ఉన్నారు. సర్వకాలాల్లో ఆధ్యాత్మికరంగాన్ని సుసంపన్నం చేసిన మహనీయులు లెక్కకు మిక్కిలే అయినా శివానంద గురుదేవులతో పోల్చదగిన మహత్తు మనకు తెలిసిన వేల ఏళ్ల భారతదేశ చరిత్రలో మరొక్కటి కానరాదు.కైలాసంలో ఉంటే శివుడు. నరుడికి జ్ఞానబోధ చేసేటప్పుడు కృష్ణ భగవానుడు. దిగంబరుడైతే త్రైలింగ స్వామి. కౌపీనం మాత్రం ధరిస్తే రమణమహర్షి. మల్లెపూవులాంటి బట్టల్లో రాజాధిరాజసంతో వెలిగిపోయే ఆహార్యంలో వారి పేరు ఈ శతాబ్దిలో శివానందమూర్తి. ఎవరు ఎలాంటి వారైతే వారికి అలా కనపడుతూ, ఏ రంగంలో నిష్ణాతులకు ఆ రంగంలోనే కొత్త ఎరుకను కలిగించి, గొప్ప పాఠాలు నేర్పుతూ… కోరిన వారికి కోరుకున్నది అర్హతను, యోగ్యతను బట్టి కాదనకుండా ఇచ్చేస్తూ… ఆదర్శ గురువు, ఆదర్శ పౌరుడు, ఆదర్శ గృహస్థు ఎలా ఉండాలో ఆచరణలో చూపిస్తూ నిర్విచారంగా నిర్వికారంగా చడీ చప్పుడు కాకుండా తన పెద్ద కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడే ఈ సద్గురువు ఉనికే లోకానికి దీవెన.. విశిష్ట రంగాలలో ఉన్న సద్గరు శివానందమూర్తిగారి భక్తుల అనుభవాల సంకలనమే ఈ గ్రంథం.

Publisher : Durga ; Paperback ; Pages : 192 ; Author : MVR Sastry

Author

M.V.R.Sastry

Reviews

There are no reviews yet.

Be the first to review “శివానంద స్ఫూర్తి- Sivananda Sphoorti”

Select at least 2 products
to compare