అమర కోశము – గురుబాలప్రబోధికావ్యాఖ్యతో Amarakoshamu

సంస్కృతభాషను అభ్యసించగోరే ప్రతి విద్యార్థి అమరకోశం అంతో యింతో కంఠస్థం చేసే ఉంటాడంటే అతిశయోక్తి కాదు. ఇది సంగ్రహమూ, సమగ్రమూ, సులభంగా కంఠస్థం చేయదగ్గదీ అవటమే దీని విస్తృతప్రచారానికి కారణం.

500.00

1 in stock

Compare

Description

అమరకోశం సంస్కృత భాషలో రచింపబడ్డ నిఘంటువులలో ప్రసిద్ధమైనదీ,  ప్రామాణికమైనదీ మాత్రమే కాదు ప్రాచీనమైనది కూడా. దీని అసలు పేరు ‘నామలింగానుశాసనము’. అయినా ఇది గ్రంథకర్త పేరుతోనే అమరకోశంగా ప్రచారాన్ని పొందింది.  సంస్కృతభాషను అభ్యసించగోరే ప్రతి విద్యార్థి అమరకోశం అంతో యింతో కంఠస్థం చేసే ఉంటాడంటే అతిశయోక్తి కాదు. ఇది సంగ్రహమూ, సమగ్రమూ, సులభంగా కంఠస్థం చేయదగ్గదీ అవటమే
దీని విస్తృతప్రచారానికి కారణం.

అమరకోశానికి పూర్వం నిఘంటువులు నిరుక్తానికి తర్వాత అమరకోశ రచనకు పూర్వమూ కొన్ని నిఘంటువులు
ఉండేవని వానిలోనుండి ఆయా వ్యాఖ్యలలో పేర్కొనబడిన ఉద్ధరణాలవల్ల తెలుస్తోంది కాని ఆ గ్రంథాలు లభించటం లేదు. ఆ నిఘంటుకర్తలు ఏడుగురు.

వ్యాధి ఈయన ‘ఉత్పలిని’ అనే నిఘంటువును రచించాడు. హేమచంద్రాచార్యుడు తన అభిధానచింతామణి అనే కోశానికి
తానే రచించిన టీకాలో ఉత్పలిని నిఘంటువునుంచి పలు ఉద్ధరణలు  ఇచ్చాడు. టీకాసర్వస్వం, రామాశ్రమీ వ్యాఖ్యల్లో వ్యాడి గ్రంథంలోనుంచి ఉద్ధరణలు కనిపిస్తాయి.

Jayalakshmi Publications ; Pages : 909 ; Hardcover ; Telugu book

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

Select at least 2 products
to compare