హిందూ ఈషాప్ బులెటిన్ – ఆషాఢమాసం-యుగాబ్ద 5124
- July 18, 2022
- 0 Comment(s)
హిందూ ఈషాప్ బులెటిన్-
ఆషాఢ మాసం-యుగాబ్ద 5124
హిందూ ఈషాప్లో కొత్త పుస్తకాలు
సంక్షిప్త భారత దేశ చరిత్ర – సంస్కృతి
ఇది చరిత్రకు సంబంధించిన పాఠ్యగ్రంథం కాదు. ఇది భారతదేశ చరిత్ర, సంస్కృతులను గురించి తెలుసుకోవాలనుకొనే ఆసక్తి వున్న వారి కొరకు రూపొందించబడిన సంక్షిప్త పరిచయం. ఈ రచనకు వుపయోగపడిన ఆధారాలు వివిధ గ్రంథాల్లో లభించేవే. ద్వితీయ శ్రేణికి సంబంధించిన ప్రామాణికమైనవి. అయితే ఆయా రచయితల తర్కం, వ్యాఖ్యానాలు మాత్రం వడబోయబడ్డాయి.
గోవా ఇంక్విజిషన్ : క్రైస్తవమత విచారణ సంస్థ
ఇంక్విజిషన్ అనేది క్రైస్తవ మతస్తులు కానివారిని, తమకు నచ్చని సాటి క్రైస్తవులకు అవిశ్వాసులనే ముద్ర వేసి, వేటాడి, శిక్షించడానికి ఏర్పడిన ఒక క్రైస్తవమత విచారణ సంస్థ. “హోలీ పోలీస్” (పవిత్ర పోలీస్) అనేది ఇంక్విజిషన్ అధికార నామం. క్రైస్తవమతం పుట్టిన నాటి నుంచీ అసహనం దాని సహజ లక్షణంగా ఉంటూ వచ్చింది. రోము సామ్రాజ్యానికి ఆధికారిక మతంగా మారిన తరువాత అది మరింత గట్టి పడింది. 13వ శతాబ్దిలో దక్షిణ ఫ్రాన్సును అల్లకల్లోలం చేసి, అక్కడి జనాభాను తుడిచిపెట్టి, నాగరికతను రూపుమాపిన క్రూసేడులు ఇంక్విజిషన్ అనే మతయుద్ధాలు ‘పవిత్ర’ సంస్థ ఆవిర్భావానికి దారితీశాయి.
కొన్ని పుస్తకాలు – మీ కోసం
తిరుమల ఫై ఎందుకీ కక్ష?, దేవాలయాల ఆస్తులు ఏమంటున్నాయి?
దేవాలయ నిర్మాణం ఎంతో కష్టతరమైన వ్యవహారం. అది ఇటుక సున్నంలతో నిర్మితమైయ్యే కట్టడం కాదు. దేవాలయ నిర్మాణానికి పవిత్రత మూలాధారం, స్వతంత్రం వచ్చినప్పటి నుంచీ దేవాలయాలకు ప్రభుత్వం ఎటువంటి సహాయం చేయడంలేదు. ప్రభుత్వ సహాయాన్ని ప్రజలు ఆశించడమూలేదు. ఇటువంటి పరిస్థితిలో సెక్యులర్ రాజ్యవ్యవస్థలో, ఒక మతానికి చెందిన ధార్మిక సంస్థలకు సంబంధించిన పాలనా నిర్వహణపై ప్రభుత్వం చట్టం చెయ్యొచ్చా? అంటూ రచయిత ప్రశ్నించిన తీరు పాఠకులను ఆలోచింపచేస్తుంది.
ఒక విజేత ఆత్మకథ
తన పూర్తి పట్టుదల మరియు కృషితో విజయం సాధించిన ప్రతి సామాన్యుడు తన కథను మిగిలిన వారితో పంచుకోవాలి, ఎందుకంటే వారు అతని కథలో కొనసాగడానికి ప్రేరణ మరియు శక్తిని పొందవచ్చు. ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’ అనేది దార్శనికుడైన శాస్త్రవేత్త డాక్టర్. అబ్దుల్ కలం గారి ఆత్మ కథ “ది వింగ్స్ అఫ్ ఫైర్” కు తెలుగు అనువాదం.
కార్గిల్ యుద్ధం ఓ విజయం, ఓ గుణపాఠం
ప్రపంచంలోనే ఎత్తైన పర్వత ప్రాంతాలలో ఇటీవల కాలంలో భీకరంగా జరిగిన యుద్ధం కార్గిల్. అంతకు ముందు చైనా – రష్యా మధ్య జరిగిన యుద్ధం తర్వాత అణ్వస్త్రాలు గల రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధం ఇది. అత్యంత క్లిష్టమైన భూభాగంలో, దొంగచాటుగా ప్రవేశించిన శత్రు సేనలను పారద్రోలడం కోసం మన సైనికులు ప్రదర్శించిన అసమానమైన వీరోచిత సహస, పరాక్రమాలు ఎల్లప్పుడూ గుర్తుంటాయి.
చందమామ కథలు 1
పలు భారతీయ భాషల్లో ప్రచురితమైన ‘చందమామ’ పాత తరంలో ఇంటింటా ప్రతిహృదయంతోనూ పెనవేసుకుపోయింది. ఇది కొత్త తరాలకూ వారసత్వంగా పాకింది. రాజుల సాహసకథలు, ఏడేడు సముద్రాలు, రెక్కల గుర్రాలు, మంత్ర తంత్రాలు, మర్రిచెట్టు తొర్రలు, బేతాళ కథలు, దేవుళ్ళు, దెయ్యాలు, అపూర్వ శక్తులు…అబ్బో! ఎన్నెన్ని కథలో. ఎన్ని శక్తులున్నా మానవశక్తే గొప్పదని నిరూపిస్తాయి ఇవన్నీ. అప్పట్లో ఎంతోమంది పిల్లలు కూడా ఎంతో స్ఫూర్తితో ఈ కథల్ని ఉత్సాహంగా రాసేవారు. అటువంటి అనేక కథల సంపుటి మీకోసం మన హిందూ ఈషాప్ లో ఉన్నయి.