హిందూ ఈషాప్ బులెటిన్ – చైత్ర మాసం– యుగాబ్ద 5125
- April 8, 2023
- 0 Comment(s)
హిందూ ఈషాప్ బులెటిన్ – చైత్ర మాసం – యుగాబ్ద 5125
హిందూ ఈషాప్లో కొత్త పుస్తకాలు
సెక్యులర్ ప్రపంచం’లో సెమిటిక్ మతాలు
అబ్రహామీయ మతాలు (సెమిటిక్ మతాలు) అంటే ఏమిటి? వాటి తాత్విక భూమిక, మూలాలు ఏమిటి? వాటి లక్ష్యం ఏమిటి? అవి పనిచేసే తీరు ఏమిటి? ప్రపంచంలోనేకాక, మన దేశంలో అవి సృష్టించిన, సృష్టిస్తున్న సమస్యలు ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానమే ‘సెక్యులర్ ప్రపంచం’లో సెమిటిక్ మతాలు అనే పుస్తకం. నిజమైన మతసమానత్వానికి చేటు తెచ్చే ఈ మతాల గురించి తెలుసుకోవడానికి ఈ పుస్తకం తప్పక చదవాలి.
స్వాతంత్య్ర సమరంలో విజ్ఞాన శాస్త్రం
స్వాతంత్య్ర అమృత మహోత్సవాల సందర్భంగా స్వాతంత్య్ర సంగ్రామంలో విజ్ఞాన శాస్త్ర రంగం ద్వారా జరిగిన కృషిని, వెలుగులోకి రాని గాధలను వెలికితీయుటకు విజ్ఞాన భారతి చేసిన చిన్న ప్రయత్నమే ఈ పుస్తకం. విజ్ఞాన భారతి అఖిలభారత సంఘటనా కార్యదర్శి మాన్యశ్రీ జయంత్ సహస్ర బుద్ధే ఎంతో పరిశోధన గావించి ఈ అంశాలను వెలుగులోకి తీసుకురావడానికి కృషి సల్పారు. వారి మార్గదర్శకంలో సైన్స్ ఇండియా ( విజ్ఞాన భారతి మాస పత్రిక) కలెక్టర్స్ ఎడిషన్స్ రూపంలో ప్రముఖ శాస్త్రవేత్తల, ప్రొఫెసర్ల వ్యాసాలను రెండు భాగాలుగా ప్రచురించడమైనది. అందులో మొదటి భాగాన్ని ఈ పుస్తక రూపంలో మీకు అందించడం జరుగుతోంది.
వారు చేసిన సూచనమేరకు ఈ పుస్తకాన్ని ఇప్పటిదాకా మరాఠీ, హిందీ, తమిళ భాషలలో అనువదించి ముద్రించడమైనది. ఇప్పుడు తెలుగు భాషలో ముద్రించి మీ ముందుకు తీసుకురాబడినది. వారి మార్గదర్శకంలోనే విజ్ఞాన భారతి ఈ అంశాన్ని దేశవ్యాప్తంగా ముందుకు తీసుకు వెళ్లడంలో సఫలీకృతమైంది.
కొన్ని పుస్తకాలు – మీ కోసం
ఇదీ క్రైస్తవం !
హిందువులకు కొన్ని వందల ఏళ్లుగా క్రైస్తవులతో పరిచయం ఉంది. హిందూ దేశంలో క్రైస్తవులు నివసిస్తూ మతప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంకా అనేక విధాలుగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఇటీవల క్రైస్తవుల నుండి హిందువులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. హిందు-క్రైస్తవ సంబంధాలలో అనేక ఒడిదుడుకులు చోటుచేసుకున్నాయి. హిందువులు క్రైస్తవుల మాటలను, చేతలను తమకు చేతనైన రీతిలో వ్యాఖ్యానించుకుని అర్ధం చేసుకుంటున్నారు. తమ అవగాహన మేరకు క్రైస్తవులతో వ్యవహరిస్తున్నారు.
క్రైస్తవుల పట్ల హిందువుల అవగాహన సమగ్రమైనది కాదని అనేక సందర్భాల్లో రుజువైంది. క్రైస్తవుల మాటలకు, చేతలకు హిందువులు చెప్పుకుంటున్న అర్ధాలు సరైనవి కావని దేశంలో గతంలో జరిగిన, ఇప్పుడు జరుగుతున్న అనేక సంఘటనలను బట్టి చెప్పవచ్చు. కాబట్టి హిందువులు క్రైస్తవాన్ని, క్రైస్తవ మత గ్రంథాన్ని, క్రైస్తవ ప్రవక్తను గురించి మరింత నిర్దుష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఈ పుస్తకం అందుకు సహాయపడుతుంది. ఇప్పటి వరకు హిందువులు క్రైస్తవ ప్రచారం ద్వారా మాత్రమే క్రైస్తవం గురించి తెలుసుకున్నారు. ఆ ఎరుక మీద అభిప్రాయాలు ఏర్పరచుకుని, ఆ అభిప్రాయాల ఆధారంగా క్రైస్తవులతో వ్యవహరిస్తున్నారు. కానీ క్రైస్తవ ప్రచారంలో నిజమెంత? నిజాయితీ ఎంత? వారు చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉందా? ఒకవేల వారి మాటలకూ, చేతలకు పొంతన లేనట్లయితే దానికి కారణం ఏమిటి?
క్రైస్తవులు ఏ లక్ష్యంతో మన మధ్య పనిచేస్తున్నారు? వారి చర్యలు, ప్రచారాల ద్వారా మనకు కలిగే కష్టనష్టాలేమిటి? — ఈ విషయాలను హిందువులు తగినంత పట్టించుకోలేదు.
ఈ పుస్తకం క్రైస్తవాన్ని అర్ధం చేసుకోవడంలో హిందువులకే కాక క్రైస్తవులకు కూడా సహాయపడుతుంది.
రమణ శర్మ కథలు – 3 పుస్తకాల సెట్
ఏప్రిల్ 14th – భగవాన్ శ్రీ. రమణ మహర్షి మహా సమాధి పొందిన రోజు. క్రింది పుస్తకాల ద్వారా వారి బోధనలను తెలుసుకుని, వారికి నమస్సులు అర్పిద్దాం.
రమణ శర్మ గారి కలం నుంచి వచ్చిన మూడు కధ సంకలనాలు ఉన్నతమైన రచన శైలికి అద్ధం పట్టాయి.
ఆధునిక భారతీయ వైజ్ఞానికులు : భారత భారతి
ఏప్రిల్ 14వ తేదీ – ఆధునిక భారతీయ వైజ్ఞానికులలో అగ్రగణ్యులైన శ్రీ. మోక్షగుండం విశ్వేశ్వరయ్యను సంస్మరించుకుందాం. వారికి నివాళులు అర్పిద్దాం.
ఏప్రిల్ 26వ తేదీ – అపారమైన మేధస్సుతో భారతదేశపు కీర్తిని ప్రపంచ గణిత శిఖరాలపై ఎగురవేసిన మహాగణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ సంస్మరణ దినోత్సవం.
12 ఆధునిక భారతీయ వైజ్ఞానికుల జీవితాని పరిచయం చేసే ” భారత భారతి ” పుస్తకాల సెట్.
- శాంతి స్వరూప్ భట్నాగర్
- మేఘనాథ్ సాహా
- డా. ప్రఫుల్ల చంద్రరే
- నందలాల్ బోసు
- డా. సి. వి. రామన్
- డా. యం. విశ్వేశ్వరయ్య
- బీర్బల్ సహానీ
- సత్యేన్ద్రనాథ్ బోస్
- డా. జగదీశ చంద్రబోస్
- విక్రం సారాభాయ్
- శ్రీనివాస రామానుజం
- హోమీ బాబా
రణభూమి కురుక్షేత్ర బోర్డు గేమ్
షిప్పింగ్ ఏప్రిల్ 15, 2023 నుండి ప్రారంభమవుతుంది. ఈరోజే 20% తగ్గింపుతో ప్రీ-ఆర్డర్ చేయండి
- మహాభారతం ఆధారంగా బోర్డ్ గేమ్.
- రణభూమి కురుక్షేత్ర అనేది కురుక్షేత్ర యుద్ధం యొక్క సంఘటనలను ప్రస్ఫుటించే బోర్డ్ గేమ్.
- మహాభారతం గురించి తెలుసుకోవడానికి సులభమైన మార్గం.
- 44 ప్రత్యేక దివ్యాస్త్రాలు కలవు.
- సూత్రధార్ యాప్‌లో గేమ్‌కు సంబంధించిన 2+ గంటల వీడియో కంటెంట్ ప్రీమియం బిల్డ్.
- ధృడత, నాణ్యత కల డిజైన్ మరియు ముచ్చటైన ఫినిషింగ్ ను కలిగి ఉంటుంది.