సృష్టి సంరక్షణ లో భారతీయ ఆవు

50.00

2 in stock

Compare

Description

భారతీయ దేశీ ఆవు ప్రాముఖ్యము మరియు ఆవశ్యకతలను గూర్చి వివరించి చెప్పుటయే ఈ పుస్తకరచనలోని ముఖ్యోద్దేశము. మనదేశీ ఆవు భారతీయ జీవనానికి వెన్నెముక వంటిది. మనదేశీ ఆవు లేకుండా మన భారతదేశ ఆర్థిక, వ్యవసాయ, ఆరోగ్య, పర్యావరణ వ్యవస్థలను, ప్రాణికోటిని, అరణ్యాలను, భారతీయ సంస్కారాలను కాపాడుకొనుట
సాధ్యము కాదు. ఈ దిశలో విశ్వమంగళ గోగ్రామయాత్ర ఎంతో ప్రభావాన్ని కలిగించే అడుగులు వేసింది. ఆ తరువాత సమాజంలో జాగృతి ప్రారంభమైంది. మన అవుయొక్క ప్రాముఖ్యమును గూర్చి వివిధ కోణాలలో, సంక్షిప్తంగా, ఈ పుస్తకములో పరిచయము చేయబడింది. దీనివలన ప్రజలలో గోమాతకు సంబంధించిన విషయములో ప్రేరణ లభించి…..

స్వావలంబన కలిగిన, సుఖసమృద్ధులతో కూడిన, ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మాణంచేయుటలో ముందుడుగు వేయుటకు వీలుకలుగును. నేడు దేశంలో ఎంతోమంది ఈ కార్యంలో కార్యశీలురైయున్నారు. అనేకులు స్ఫూర్తిని పొంది, పని చేస్తున్నారు. స్వదేశీ ఆవు లక్షలాదిమంది ప్రజలకు జీవనోపాధిని కలిగించే సామర్థ్యం కలిగిఉందనే నమ్మకం ఏర్పడింది. మన దేశనాయకులు విదేశానుకరణము వదలి, స్వదేశీ పరికరాలను ఉపయోగించి, గోఆధారిత గ్రామీణ వికాస మార్గంలో ప్రయాణించాల్సిన అవసరం క్రమక్రమంగా అందరూ గ్రహిస్తున్నారు. ఈ విధానము అతి తక్కువ ఖర్చుతో, తేలికగా, సునాయసంగా, ప్రభావవంతంగా, శీఘ్రముగా సత్ఫలితాలను ఇచ్చును.

మనము 'ధర్మ' శబ్దాన్ని ఒక ఆరాధన లేక ఉపాసనాపద్ధతి మాత్రమే అనుకొని, దానిని మన
జీవనవిధానంనుండి తొలగించి వేస్తున్నాము. దీని ఫలితంగా  “పాపము పుణ్యము” అనే భావన మననుండి అదృశ్యమైపోయింది. ప్రజలకు తప్పుడుపనులు చేయుటలో భయంలేకుండా పోయింది. ప్రభుత్వంనుండి దండనభయము అసలేలేదు. అందువలన ధర్మము మరియు నీతితో కూడిన జీవనమువైపుగా ప్రజలను నడిపించుటకు ప్రత్యేక ప్రయత్నం చేయవలసి ఉంది. సమాజాన్ని ఈ మార్గంలో తీసుకొనిపోవుటకు, ఆవు ఒక అద్భుతమైన సాధనము, ఈ
దృష్టితో, యువతరానికి స్ఫూర్తినందింప చేసే ఒక ప్రయత్నమే ఈ చిన్ని పుస్తకము,

Author

Shanker Lal

Reviews

There are no reviews yet.

Be the first to review “సృష్టి సంరక్షణ లో భారతీయ ఆవు”

Select at least 2 products
to compare