హిందూ ఈషాప్ బులెటిన్ – దీపావళి యుగాబ్ద 5124
- October 24, 2022
- 0 Comment(s)
హిందూ ఈషాప్ బులెటిన్ – దీపావళి – యుగాబ్ద 5124
దీపావళి శుభాకాంక్షలతో 
హిందూ ఈషాప్లో కొత్త పుస్తకాలు
హిందూ నేషన్ ( ఇదే హైందవం – 1 )
ప్రముఖ రచయిత శ్రీ ఏం వీ ఆర్ శాస్త్రి గారి “ఇదే హైందవం” సిరీస్ లో మొదటి పుస్తకం.
లోకాస్సమస్తాః సుఖినో భవంతు అని సర్వమానవ సంక్షేమాన్ని, విశ్వ శాంతిని కాంక్షిస్తూ లోకానికి వెలుగు నిచ్చే హిందూ సంస్కృతి, హిందూ నాగరికత, హిందూ జాతీయతల ప్రపంచ వ్యాప్త వైభవోజ్వల చరిత్రను రచయిత నేటితరానికి రేఖామాత్రంగా పరిచయం చేసే ప్రయత్నం చేశారు.
మత పరమైన ఉద్రిక్తత అంతకంతకూ పెరుగుతూ , ఆవేశకావేశాలు హెచ్చుతూ, జాతివిచ్చిన్న, విద్రోహకర ధోరణులు ప్రబలుతూ ఆలోచనాపరులకు ఆందోళన కలిగిస్తున్న తరుణంలో మతాలకు, మత విభేదాలకు అతీతమైన జాతీయత , ఈ జాతికి మూలకందమైన ధార్మికత, వాటికి కలుగుతున్న విఘాతాలవంటి అతి ప్రధాన అంశాలపై మౌలిక పునరాలోచన రేకెత్తటానికి ఈ ప్రయత్నం ఏకాస్తయినా ఉపకరిస్తుంది.
హైదరాబాద్ ప్రజాసమరం
పాత తరానికి చెందిన సోషలిస్టు మేధావి, రాజకీయ నాయకుడు చెరుకు మాధవరెడ్డి ఒక భావ తరంగం! శాంతి విప్లవం! నిఖార్సయిన సామ్యవాది అంతకు మించి గొప్ప మానవతావాది రాజీపడని ప్రజాస్వామ్యవాది.
మీ కోసం
సరస్వతీ మాత – వాల్ హ్యాంగింగ్
సరస్వతీ మాత in Digital Concept Art .
సరస్వతీ దేవి కృపాకటాక్షాలు అందరికి లభించును గాక…!!!.
या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता
या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना।
या ब्रह्माच्युत शंकरप्रभृतिभिर्देवैः सदा वन्दिता
सा माँ पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा ॥1
Size : 12″ ( inches ) * 15″ ( inches ) ; MDF ( medium density fiberboard )
ధర్మ సింధు
వేదాలలో నిర్దేశించిన విహితకర్మలు, ధర్మాలు, ఆచరించవలసిన విధానాలు, సామాన్యులకు తెలియజేసే అపూర్వ ధర్మశాస్త్ర గ్రంథం.
సాధన పథం
వేదాంతబోధ సంపూర్ణ జీవనానికి, జీవిత సాఫల్యానికి ప్రధాన ప్రబోధం కనుక బుద్ధిశక్తి వికసించే యువతకు దానిని అందించాలన్నది ఈ పుస్తకపు ముఖ్య లక్ష్యం.వృత్తిజ్ఞానం, ప్రపంచజ్ఞానం, శాస్త్రజ్ఞానం, ఆత్మజ్ఞానం.. ఈ నాలుగూ పూర్ణ వ్యక్తిత్వానికి ముఖ్యమైనవనే సందేశాన్ని ఈ పుస్తకం ప్రసరిస్తోంది. జ్ఞానసముపార్జనలో వే విజ్ఞాన ప్రకాశం ఆయా వాక్యాల వివరణతో అందించడం గొప్ప అంశం. ఉన్నత లక్ష్యం, అంకితభావం కలిగి; లక్ష్యాన్ని దూరం చేసే ఆకర్షణలనుండి తనను తాను నియంత్రించుకొనే క్రమశిక్షణా సరళిని ఆచరణ యోగ్యంగా చూపించడం ఈ రచన యొక్క ప్రత్యేకత.
ప్రేరణ : 5 బొమ్మల పుస్తకాల సెట్
5 బొమ్మల పుస్తకాల సెట్ ( కామిక్ )
* స్వామి వివేకానంద
* సోదరి నివేదిత
* బాల గంగాధర తిలక్
* శ్రీ అరబిందో
* నేతాజీ సుభాష్ చంద్ర బోస్