హిందూ ఈషాప్ బులెటిన్ – శ్రావణ మాసం – యుగాబ్ద 5124
- August 24, 2022
- 0 Comment(s)
హిందూ ఈషాప్ బులెటిన్ – శ్రావణ మాసం – యుగాబ్ద 5124
హిందూ ఈషాప్లో కొత్త పుస్తకాలు
మహాభారత విజ్ఞాన సర్వస్వం
విజ్ఞాన సరస్వమనేది ఆధునిక సాహిత్య ప్రక్రియల్లో ఒకటి. ఇది మన ప్రాచీన సాహిత్య ప్రక్రియల్లో లేదు. అందుకే ఆనాటి కవులు, ముఖ్యంగా విజ్ఞాన ప్రసారాపేక్ష గల్గిన రచయితలు తమ రచనల్లో, అనాటికి ప్రచారంలోనున్న సామాజిక విషయాలు, శాస్త్ర విషయాలు మొదలైన అనేకానేక విజ్ఞానాంశాలను తమ రచనల్లో సంకలనం. చేసి పెట్టారు. అలా ఎక్కువ మోతాదులో వివిధాంశాలను సంకలనం చేసిన ప్రాచీన రచనలు నేడు విజ్ఞాన సరస్వ లక్షణాలు గల గ్రంథాలుగా చెప్పబడుతున్నాయి. అటువంటి గ్రంథాల్లో తెలుగులో ప్రథమంగా చెప్పుకోదగింది ఆది కావ్యమైన మహాభారతం. ఈ మహాభారతం మూల గ్రంధంగా రచింపబడిన విజ్ఞాన సర్వస్వం, మహా భారతాన్ని నామ, సూక్తి, శాస్త్ర విజ్ఞాన భాండాగారంగా వెల్లడిచేస్తోంది.
ఆఖరి ప్రవక్త .. అతని మతం
ఆఖరు ప్రవక్తగా ముస్లింలు చెప్పే మహమ్మద్ ప్రవక్త జీవితమే ఇస్లాంకు ఆధారం. ప్రవక్త ఏం చెప్పారో, ఏం చేశారో అదే తమకు ఆచరణీయం, అనుసరణీయని ముస్లింలు పదేపదే ప్రకటిస్తుంటారు. ఆ విధంగానే తాము నడుచుకుంటామని, నడుస్తున్నామని చెపుతారు.
ఇంతకీ మహమ్మద్ జీవితం ఏమిటి? ఆయన చెప్పిన, చేసిన పనులు ఏమిటి? అన్న విషయాలను వివరించే అనేక అరబిక్ గ్రంధాలు ఉన్నాయి. అలాగే అనేకమంది యూరోపియన్లు పరిశోధన చేసి ప్రవక్త జీవితచరిత్రను వ్రాశారు. అరబిక్ పండితుడు, పరిశోధకుడు డా. మార్గోలియత్ వ్రాసిన ‘Mohammad & The Rise of Islam’ అనే 600పేజీల బృహత్ గ్రంథపు సంక్షిప్త అనువాదమే ‘ఆఖరు ప్రవక్త – అతని మతం’. ఇస్లాం పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవాలనుకునేవారికి ఉపయుక్తమైనది.
కొన్ని పుస్తకాలు – మీ కోసం
పురాణ తత్వ దర్శనము
ఇది పద్ధెనిమిది పురాణాల సర్వాంగీణ పరిచయం. దీనిలో పురాణ కథల వైజ్ఞానిక రహస్యాలున్నాయి. పురాణాలలో నిబిడీకృతమైన జ్ఞానాన్నిప్రతీఒక్కరి చేత దర్శింపచేసే అరుదైన పుస్తకరాజం. పురాణాలను నిందించేవారి ఆక్షేపాలకు సహేతుకమైన సుసంగతమైన సమాధానాలు దీనిలో ఉన్నాయి.
దీప మాలిక – 3 పుస్తకాల సెట్
చిరుదీపాలు, దారిదీపాలు మరియు ఆకాశదీపాలు అనే మూడు పుస్తకాల కదంబమే ఈ “దీపమాలిక” . దేశవిదేశాలలోని వివిధ రంగాలలో పేరొందిన వ్యక్తుల జీవితాల్లోని విశేష ఘట్టాల్ని సూక్ష్మరూపంలో ఏర్చికూర్చడం జరిగింది.జీవితం కంప్యూటర్ కు పరిమితమై , మెకానికల్ గా తయారైన ప్రస్తుత రోజుల్లో కనీసం సరదాకైనా మహాసాధకుల జీవన సంఘటనలను చదవాలి. జీవితం ఎంత లోతైనదో, సృజనాత్మకత ఎంత పదునైనదో తెలుస్తుంది.మహాపురుషుల అడుగుజాడలు సామాన్యులకు రాచబాటలవుతాయనే సందేశాన్ని అందించడమేగాక ఓ దార్శనిక కోణాన్ని ఆవిష్కరించే పుస్తకాల సముచ్ఛయమే దీప మాలిక.
స్వరాజ్య సాధనలో ఆర్ ఎస్ ఎస్
స్వాతంత్ర్యాన్ని స్వరాజ్యంగా మలచడంలో కూడా సంఘం కీలక పాత్ర పోషించింది. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తల్లో దేశం ఎదుర్కొన్న బాలారిష్టాలను, సమస్యలను తీర్చడంలో వేలాది సంఘ స్వయంసేవకులు అపూర్వమైన ధైర్యసాహసాలు, త్యాగాన్ని ప్రదర్శించారు. ముఖ్యంగా రక్తసిక్తమైన దేశ విభజన సమయంలో ముస్లింలీగ్ ముష్కర మూకల నుండి సిక్కులు, హిందువులను కాపాడి సురక్షితంగా భారత్ కు చేర్చడంలో స్వయంసేవకులు చూపిన తెగువ, దేశభక్తి అమోఘం
పరివర్తన పథం
మన పూర్వికులు మనకు మంచి ఆరోగ్య సూత్రాలు, జీవన విలువలు నేర్పారు. కాని, కాల క్రమేనా మన సమాజము అవి మరిచింది. మన సమాజం , ధర్మం ముందు ఉన్న సవాళ్ళు ను పరిష్కరించే ప్రయత్నమూ ఈ ” పరివర్తన పథం” పుస్తకాల సెట్. సామాజిక పరివర్తన ద్వారా దేశపు సర్వతోముఖమైన అభివృద్ధిని సాధించ గలము. ఈ సెట్ లో … 1.కుటుంబానికి కరదీపిక 2.యోగ – ఆసనాలు, ప్రాణాయామ , ముద్రలు, క్రియలు 3. సామజిక సామరస్యపు సాధనలో కొన్ని సఫల ప్రయోగాలు 4. మత మార్పిడులు – – సవాళ్ళు – చట్టపరమైన పరిష్కారాలు 5. సృష్టి సంరక్షణలో భారతీయ ఆవు … కలవు.