Newsletter Telugu- Jyestha maas
- June 20, 2022
- 0 Comment(s)
జ్యేష్ఠ మాసం-యుగాబ్ద 5124
ప్రపంచ యోగ దినోత్సవ శుభాకాంక్షలు June 21
హిందూ ఈషాప్లో కొత్త పుస్తకాలు
శ్రీ శివ భారతం
ప్రతికూల పరిస్థితిల్లో శిరసు వంచి, అనుకూల పరిస్థితుల్లో శిరసు నెత్తిన అపార రాజనీతి విశారదుడు, సమరాంగణ సార్వభౌముడు ఛత్రపతి శివాజి. అట్టి మహా పురుషుని జీవితాన్ని తెలుగు పాఠకుల కోసం, కడు రమణీయంగా ఆవిష్కరించిన గడియారం శేష శాస్త్రి గారి ‘శివభారతం’ ప్రధానంగా వీర రస కావ్యం. కరుణ, భీభత్సం, అద్భుతం వంటి అంగ రసాలు కూడా ఈ కావ్యం లో కనిపిస్తాయి. ప్రతి పద్యంలో ఓజో గుణం ప్రత్యక్షమవుతుంది.
ఏష ధర్మ సనాతనః
వేదాలతో మొదలుకొని స్మృతులు, పురాణాలు, మంత్రశాస్త్రాలు, స్తోత్రాది వాఙ్మయ సర్వస్వం… ఇవన్నీ కలిపి సనాతన ధర్మానికి ఆలంబనాలు.
వాటిలోని శాశ్వత విలువలను ఎప్పటికప్పుడు స్మరించుకుంటూ, ఆయా దేశ కాలాలకు అనుగుణంగా సమన్వయించుకుంటూ సాగినపుడే మన జీవితా లకు సాఫల్యం. సనాతన ధార్మిక వచనాలను “ఇవేవో జీవితాలకు అతీతమైన మాటలు’ అని త్రోసిపుచ్చటం పరిపాటి. కానీ అవి జీవితాన్ని సరిగ్గా నిర్వచించి జీవింప జేసే అక్షరసత్యాలు. ఈ సత్యాన్ని చాటడానికి చేసిన చిన్న ప్రయత్నమిది.
కొన్ని పుస్తకాలు – మీ కోసం
యోగ
వివేకానంద కేంద్రం యొక్క ప్రచురణ, యోగా పుస్తకంలో రోజువారీ వ్యాయామాలు, సాధారణ యోగాసనాలు, ప్రాణాయామం, సూర్యనమస్కారం మరియు ముద్రలను నిర్వహించడానికి సూచనలు మరియు దృష్టాంతాలు ఉన్నాయి. ఇది చాలా సులభమైన మరియు స్పష్టమైన పుస్తకం.
తవాస్మి : 4 పుస్తకాల సెట్
రామాయణంలోని ఒక్కో ఘట్టం, ఒక్కో పాత్ర మనకు ఎలాంటి సందేశాన్ని ఇస్తుందో సవివరంగా చర్చించారు. ఈ పుస్తకం ద్వారా కేవలం నీతి, నియమాలే కాకుండా…ఉత్తమ జీవన సందేశం అందించారు