Telugu Newsletter-Phalguna masa
- March 25, 2022
- 0 Comment(s)
ఒక యోగి ప్రస్థానం : మఠాధిపతే ముఖ్యమంత్రి
The Monk Who Became Chief Minister అనే పుస్తకానికి తెలుగు అనువాదం. భారతదేశంలోనే అతి పెద్ద రాష్ట్రం అయిన ఉత్తర ప్రదేశ్ కి 21వ ముఖ్యమంత్రిగా 2017 మార్చి 19న యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్తరాఖండ్ పర్వత గ్రామాలలో బిడియస్తుడు, అంతర్ముఖుడు అయిన ఒక బాలుడి జీవన ప్రయాణం గురించి, కోట్ ద్వార్ లోని కళాశాలలో సైన్సు విభాగంలో ఆధునిక విద్యను అభ్యసించిన ఒక యువకుడి గురించి, తదనంతరం సన్యాసిగా మారి అకుంఠిత దీక్షతో వేదాధ్యయనం చేసిన ఒక ధార్మిక వ్యక్తి గురించి ఈ పుస్తకం కూలంకషంగా వివరిస్తుంది.
1000 ఏళ్ళ కాశ్మీరం అసలు చరిత్ర మన ముందుకు.. #కశ్యప ప్రజాపతి ఈ భూమి మీద తన సంకల్ప శక్తితో సృష్టించిన అందాల హిమ సీమ కాశ్మీరం.. నాటి నుంచి నేటి ఆర్టికల్ 370 రద్దు, ఆ తరువాత పరుగులు పెడుతున్న అభివృద్ధి, 2022 వరకూ కాశ్మీర్ చరిత్ర “మనదే మనదే కాశ్మీరం” అనే ఈ పుస్తకం లో ఉన్నది.
బ్రిటిషు మహా సామ్రాజ్యాని గడగడలాడించిన గండరగండడు గాజుకళ్ళ పెద్దలు గుర్తించని అసలుసిసలు జాతీయవీరుడు అల్లూరి సీతారామరాజు చారిత్రాత్మక పోరాట గాథ చరిత్రకెక్కని కొత్త కోణంలో ప్రామాణికంగా, నిష్కర్షగా ఎం.వి.ఆర్.శాస్త్రిగారి విలక్షణ నిజనిర్ధారణ “విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు”.
కాశ్మీర్ కథ
యావద్భారతాన్ని చిరకాలంగా కలవరపరుస్తున్న కాశ్మీర్ సమస్యకు మూలమేమిటి? ఈ కథ ఎక్కడ మొదలైంది ? ఎన్ని మలుపులు తిరిగింది? సుందర కాశ్మీరాన్ని పాకీ దయ్యాల దిబ్బగా మార్చిన పాపంలో ఎవరి వాటా ఎంత ఎంత? అనర్థాలకు అసలు కారణమైన 370వ అధికరణం ఏ పరిస్థితుల్లో పుట్టింది ? కాశ్మీర్ కూ, దేశానికీ ఎంత హాని చేసింది?
ఒక విజేత ఆత్మకథ
భారతీయ ప్రతిభా విశేషాలు