Description
పుస్తక పరిచయం :
Telugu translation by Sri Komalla Thirupati Reddy of the book The Monk Who Became Chief Minister
భారతదేశంలోనే అతి పెద్ద రాష్ట్రం అయిన ఉత్తర ప్రదేశ్ కి 21వ ముఖ్యమంత్రిగా 2017 మార్చి 19న యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్తరాఖండ్ పర్వత గ్రామాలలో బిడియస్తుడు, అంతర్ముఖుడు అయిన ఒక బాలుడి జీవన ప్రయాణం గురించి, కోట్ ద్వార్ లోని కళాశాలలో సైన్సు విభాగంలో ఆధునిక విద్యను అభ్యసించిన ఒక యువకుడి గురించి, తదనంతరం సన్యాసిగా మారి అకుంఠిత దీక్షతో వేదాధ్యయనం చేసిన ఒక ధార్మిక వ్యక్తి గురించి ఈ పుస్తకం కూలంకషంగా వివరిస్తుంది.
నాథ్ పంత్ సాంప్రదాయంలోని ఒక యువ సన్యాసి తన గురువు అయిన మహంత్ అవైద్య నాథ్ గారి దగ్గర రాజకీయాలలో ఎలా ఓనమాలు దిద్దుకున్నారో, ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లోనే అత్యంత ఉన్నత పదవిని ఎలా అలంకరించారో ఈ పుస్తకం చదివి తెలుసుకోవచ్చు. భారత రాజకీయ ప్రహేళికలో 80 లోక్ సభ స్థానాలు కలిగి, దాదాపు 22 కోట్ల జనాభా వున్న ఉత్తర ప్రదేశ్ చాలా ప్రధాన, ప్రభావవంతమయిన రాష్ట్రం. ఇప్పటికే ఎంతో మంది ప్రధాన మంత్రలను ఈ దేశానికి అందించిన ఘన చరిత కలిగిన ఉత్తర ప్రదేశ్ ఈ మోడీ శకానంతర కాలంలో యోగీ ఆదిత్య నాథ్ రూపంలో మరో ప్రధాని కాగల నేతను కూడా అందించింది అని చెప్పవచ్చు. అత్యధిక జనాభా కలిగిన అదే ఉత్తరప్రదేశ్ ముఖ్య మంత్రిగా అనితర సాధ్యమైన బాధ్యతలు చేపడుతున్న యోగి ఆదిత్య నాథ్ నిశ్చిత ఆత్మకథ ఇప్పుడు మీ చేతుల్లో పుస్తకంగా వుంది.
Anvikshiki Books ; 180 pages ; Paperback ;


Reviews
There are no reviews yet.