Description
About the book :
అరాష్ట్రీయుడూ, సర సంహారకుడూ, శీలభ్రష్టుడూ, దోపిడీదారు, కపటవర్తనుడూ అయినా సరే ఢిల్లీని పాలించే ప్రభువే జగదీశ్వరుడు, అతడిని సేవించటమూ, కీర్తించటమూగాక తమమనుగడకు మరో మార్గమేలేదని దేశంలో వివిధరాజవంశాలవారు రాజీపడిపోయి, ఢిల్లీలోని అక్బరు పాదుషా మెప్పుదలకోసం ఎగబడుతున్న రోజులలో సనాతనధర్మమూ, హిందూ సంస్కృతి, స్వాభిమానములే ఈ జాతికి ఊపిరియని చాటి చెప్పుతూ అక్బరును ఎదిరించి నిలచిన మొనగాడు మహారాణా ప్రతాపుడు, అతడి వ్యక్తిత్వము, కర్తృత్వమూ, నేతృత్వమూ అత్యంత క్లిష్టదశలో హిందూజాతికి ప్రాణవాయువు నందించింది. తరువాత శతాబ్దంలో రంగంలోకి వచ్చిన శివాజీకి, ఛత్రసాల్కి, గురుగోవింద సింహునికి, మరెందరికో వెలుగుబాటు చూపించింది. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడడానికి భగత్సింగ్, చంద్రశేఖర ఆజాద్, అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ లాంటి వారికి ప్రేరణ నివ్వటమే కాదు, అత్యంత శక్తి శాలియైన అమెరికావంటి సూపర్ పవర్ దేశాన్ని నిలువరించి, తమ అస్తిత్వాన్ని కాపాడు కొనడానికి కొరియా, వియత్నాంలవంటి దేశాలకూ పధప్రదర్శకమైంది.
తాను, తన కుటుంబమూ, తన ప్రజానీకమూ ఎన్నోరకాల ఇక్కట్ల పాలయినా, కష్టాలూ, బాధలూ ధరించవలసి వచ్చినా, త్యాగాలు చేయవలసి వచ్చినా, దేశభవితవ్యాన్ని ఉజ్జ్వలంగా ఉంచడానికి ధీరగంభీరులమై వాటిని ఆహ్వానించవలెనే గాని, తాత్కాలిక సుభాలకూ, ప్రలోభాలకు లోబడిపోయి దేశచరిత్రలో చీకటి అధ్యాయాలను సృష్టించరా దన్న సందేశం రాణాప్రతావుని జీవితంలోని ప్రతి సన్నివేశంలో మనకు ద్యోతకమవు తుంది. అడుగడుగునా కష్టాలను, సవాళ్ళనూ ఎదుర్కొంటూ వీరోచితంగా నాడు సాగించిన పోరాటం తరతరాలకూ వెలుగునిచ్చే ఉజ్ఞుల చరిత్రగా రూపుదిద్దుకొంది.
రాణాప్రతాపునివంటి త్యాగమూర్తి వీరచరిత్రం చదివి ఒకానొక క్లిష్ట సమయంలో ఒకజాతి అంతరించిపోకుండా ఎలా నిలబడిందో, ఆపైన ఎలా కొనసాగిందో. తెలిసికొననివారు జాతికి ఉపయోగపడే ఉత్కృష్ట కార్యాలను చేయజాలరు. అన్నివైపుల నుండి వివిధవిధాల మాయోపాయాలతో ఎన్నెన్నో విదేశీశక్తులు మనదేశాన్ని శఙరించడానికి క్రమ్ముకొనివస్తున్న ఈ తరుణంలో మనజాతి జనులందరికీ అవశ్యపరనీయమైనది ఈ రాణా ప్రతాప్ చరిత్ర.
Publisher : Navayuga Bharati ; Pulicherla Sambasiva Rao ; Pages : 176


Reviews
There are no reviews yet.