Telugu Newsletter – Magh
- December 10, 2021
- 0 Comment(s)
హిందూ ఈషాప్లో కొత్త పుస్తకాలు
తెల్ల చీకట్లు క్రమ్మీన వేళ
యుద్ధాలు, బొబ్బిలియుద్ధము, మూడవ పానిపట్టు యుద్ధము, ప్లాసీ కర్ణాటక యుద్ధమూ, బక్సార్ యుద్ధమూ ఈ కాలఖండంలో జరిగినవే. ఈ నవల కార్యరంగంగా తెలుగునాడునే తీసికొన్న కారణంగా మూడవ పానిపట్టు యుద్ధము, ప్లాసీయుద్ధమూ, బక్సార్ యుద్ధమూ విపులంగా చెప్పబడకపోయినా, దక్షిణాదిన సంభవించిన యుద్ధాలన్నీ విపులంగా చెప్పబడటమేగాక అవిస్మరణీయమైన బొబ్బిలియుద్ధం గుండెలను పిండివేసేతీరులో చెప్పబడటం ఈ గ్రంథంలోని ఒక ప్రత్యేకత.
స్వరాజ్య సాధనలో ఆర్ ఎస్ ఎస్
స్వాతంత్ర్యాన్ని స్వరాజ్యంగా మలచడంలో కూడా సంఘం కీలక పాత్ర పోషించింది. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తల్లో దేశం ఎదుర్కొన్న బాలారిష్టాలను, సమస్యలను తీర్చడంలో వేలాది సంఘ స్వయంసేవకులు అపూర్వమైన ధైర్యసాహసాలు, త్యాగాన్ని ప్రదర్శించారు. ముఖ్యంగా రక్తసిక్తమైన దేశ విభజన సమయంలో ముస్లింలీగ్ ముష్కర మూకల నుండి సిక్కులు, హిందువులను కాపాడి సురక్షితంగా భారత్ కు చేర్చడంలో స్వయంసేవకులు చూపిన తెగువ, దేశభక్తి అమోఘం.
సిఫార్సు
దేశభక్తి కథలు
ఉత్తమ సాహిత్యం సామాజిక శాస్త్రాలను మించి ప్రజలను ప్రభావితం చేస్తుంది. అధ్యయన సాధనంగా పనికొస్తుంది. ‘దేశభక్తి కథలు’ ఈ లక్ష్యాన్ని అక్షరాల నెరవేర్చాయి. ఇవి ఊసుపోక రాసినవి కావు. అవగాహన రాహిత్య స్థితి నుంచి జనాన్ని బయట పడేయటానికి ఈ కథలు ఎంతో ఉపకరిస్తాయి. ఎక్కడెక్కడి కథలనో ఏరి ఎంచి మరీ ఎందరెందరో రచయితల దృష్టి కోణాన్ని ఆవిష్కరించారు. ధర్మం – చరిత్ర – అస్తిత్వం – భక్తి – యుద్ధం – రాజకీయం – అన్ని కోణాల మూలాలు కాలాన్ని జయించి కళ్లను కట్టేస్తాయి!
ఆంగ్లేయుల ఏలుబడి అంతులే
బ్రిటీష్ పాలనలో భారతదేశం యొక్క దోపిడీ ఈ పుస్తకంలో నమోదు చేయబడింది.
వేదార్ధోపన్యాసములు
పుస్తకం లో :
1.వేద మహిమ 2. ధర్మ స్వరూపము 3. ప్రాతః కాలవిధి
4.కాల కృత్యాలు 5. సంధ్యావందనము 6. సంధ్య మంత్రార్థము
7. గాయత్రి మంత్రార్థము 8. పంచ మహాయజ్ఞాలు 9. వివాహ సంస్కారం
10 .గో మహత్యం 11. భక్తి – దేవాలయములు 12. బ్రహ్మజ్ఞానము
స్వతంత్ర సమర జ్వాలలు
1857 నుండి 1947 వరకు స్వాతంత్య్ర సంపాదనకు జరిగిన ప్రయత్న పరంపర ఎంతో ఆకర్షణీయంగా, ఉజ్వలంగా, ప్రేరణదాయకంగా వివరించారు. బాలలకే గాక అందరికీ ఇది ఉపయుక్తం.