Description
About the book :
స్వతంత్ర సమర జ్వాలలు*
శ్రీ నారాయణ వినాయక కాకత్కర్ (నా.వి.కాకత్కర్) గారు తరుణ్ భారత్ పత్రిక కోసం మరాఠీలో 9.8.66 నుండి 12.2.67 వరకు బాలల ఉపయొగార్థం ప్రచురించిన వ్యాసాల సంపుటి ఈపుస్తకం. ఈ పుస్తకం తెలుగు సేత.. అగస్త్య రాజు ఏకాంత పురుషోత్తమరావు గారు.
ఇందులో…
1857 నుండి 1947 వరకు స్వాతంత్య్ర సంపాదనకు జరిగిన ప్రయత్న పరంపర ఎంతో ఆకర్షణీయంగా, ఉజ్వలంగా, ప్రేరణదాయకంగా వివరించారు. బాలలకే గాక అందరికీ ఇది ఉపయుక్తం.
1857 స్వతంత్ర సంగ్రామం కొరకు జరిగిన విస్తృత ప్రయత్నాలతో ఆరంభించి క్విట్ ఇండియా ఉద్యమం,ఆజాద్ హింద్ సేనల యుధ్దం,ఆతర్వాత నౌకా సైన్యం తిరుగుబాటు వరకు రేఖా మాత్రంగా, సమగ్రంగా వివరించబడినవి. తుపాకి గుండ్లను పూల చెండ్లుగా, ఉరికొయ్యలను ఉయ్యాలలుగా, కారాగారాలను ప్రాసాదాలుగా భావించి మాతృపద సేవలో పుష్పాలుగా తమ జీవితాలను అర్పించిన ఎందరో త్యాగధనులైన దేశభక్తుల వివరాలు మనకు ఈ పుస్తకంలో లభిస్తాయి. ఎంతమంది ప్రఙానిధులయిన దేశభక్తులు తమ జీవితాలను ధారబోస్తే మనకు స్వాతంత్య్రం లభించిందో, నేటి తరం తెలుసుకుని దాని ఆధారంగా ఎంత వైభవంగా మన భవితవ్యాన్ని రూపొందించుకోవాల్సి ఉందో గ్రహించాలి. అందుకు ఈ పుస్తకం పథప్రదర్శకం కాగలదు.
– నవయుగభారతి ప్రచురణ
Reviews
There are no reviews yet.