విశ్వ విజ్ఞాత వరాహమిహిర Vishwa Vigyata Varahamihira

₹150.00

2 in stock

Compare

Description

చారిత్రక నవల’గా పేర్కొనబడే రచనలు రెండు రకాలుగా ఉండటం మనం చూస్తుంటాం. చరిత్రలో ప్రసిద్ధులైన ఒక వ్యక్తినో, ఒక స్థలాన్నో, ఒకానొక కాలాన్నో నేపధ్యంగా తీసికొని, వీలయినంతమేరకు కాల్పనికతను జోడించుకొంటూ వ్రాసేవి (వీటిని హిస్టారికల్ నావెల్స్ అనటం కంటే, ‘నావెల్ హిస్టరీస్’ అనటం సమంజసంగా ఉంటుందనే అభిప్రాయం బహుళంగా ఉంది) ఒక రకమైతే, చరిత్ర పఠనము, అధ్యయనమూ చాలా చాలా చిక్కుముడులతో కూడుకొన్నవై, చదివేవారి సహనశక్తిని, ఓపికనూ పరీక్షించేవిగా ఉంటాయి కాబట్టి, ఒకటి రెండు కల్పితపాత్రలను ప్రవేశపెట్టినా, వారి చుట్టూ కథ అల్లుతూ, ఆనాటి ఘట్టాలను సులభ గ్రాహ్యమైన పద్ధతిలో చెప్పుకొంటూ పోయి, కార్యకారణ సంబంధాన్ని వివరిస్తూ, చరిత్ర నేర్పే పాఠాలను గ్రహింపజేసేవి రెండవ రకం.
ఈ నవలలో కథానాయకునిగా చెప్పబడిన వరాహమిహిరుడు. అతని సహాధ్యాయి, పోషకుడూ అయిన విక్రమాదిత్యుని చరిత్రలేగాక, ఆకాలంలోనే మనుగడ సాగిస్తూ, నాటి హిందూదేశంమీద, నాటి వైజ్ఞానిక ఆవిష్కరణలమీద ప్రభావం చూపిన పర్షియన్, రోమన్ దేశాల చరిత్రలు కూడా విపులంగా (అవసరమైన మేరకు) ప్రస్తావించబడినవి.

ఈ నవలను చదవటం సత్కాలక్షేపంగా మిగిలిపోవటం కాక, ఎంతో జ్ఞానదాయకంగానూ ఉండగలదన్న విశ్వాసంతో, ఈ గ్రంథ ప్రచురణను చేపట్టటం జరిగింది. తెలుగు పాఠకులు దీనిని ఆదరిస్తారని మా విశ్వాసం.

Publisher :Navayugabharathi ; Author : Palanki Satya ;

Pages :148; PaperBack

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

Select at least 2 products
to compare