సంస్కృతి ఎందుకు? Samskriti Enduku ?

40.00

1 in stock

Compare
Categories: , , Tag:

Description

About the book : 

మన సంస్కృతి నిరాడంబరమైన, ఆరోగ్యకరమైన, మరియు సంతులిత మైనది.
సమస్త భూతములు ఆత్మ స్వరూపమే, సర్వము బ్రహ్మమే” అని మన భావన. ఇక్కడ భూతములు అంటే మనిషితో సహా ప్రకృతిలోని సమస్త జీవులు, నిర్జీవులు అని అర్థం. కాబట్టి అన్ని జీవులలో ఉన్న శక్తి తనలో ఉన్నదని, అవి తనతో సమానమైన ప్రాముఖ్యత కలిగినవనే విశ్వాసాన్ని మన తత్వం కలిగిస్తుంది. ఈ భావన కారణంగానే భారతీయుడు పశుపక్ష్యాదులను, వృక్ష పర్వతాదులను, నదీనదాలను పూజ్య భావంతో చూస్తాడు. ఈ భావం కారణంగా ప్రకృతిని నాశనం చేయడు. అలాగే తన వలన ఇతరులకు కూడా జ్ఞానం కలిగే అవకాశం ఉందని, వారి ఆరాధన పద్ధతులూ ఆదరణీయాలేనని నమ్ముతాడు. కాబట్టి, భారతీయ విలువలు అవలంబించిన కాలాల్లో అతి ధనవంతులు కాకపోవచ్చు.  అలాగే అన్నానికి మొఖంవాచిన వారూ ఉండరు. ఉండేది సామాన్యమైన సంపదతో మానవత్వ లక్షణాలు పుష్కలంగా కలిగిన అత్యధిక సంఖ్యాకులు. మన సంప్రదాయంలో ధనవంతులు ఉన్నప్పటికీ నిరాడంబరంగానే జీవిస్తారుఇతరులను సేవిస్తారు.
ఇంతకూ పాశ్చాత్య భౌతికవాదం, భారతీయ వేదాంతం రెండూ యదార్థ ప్రపంచం మీద ఆధారపడినవి. కానీ ఒకటి ప్రపంచాన్ని తన బలహీనతలను రంగుటద్దాల నుంచి చూసి జీవితాన్ని దుఃఖమయం చేస్తుంది. మరొకటి ఉన్నత దృష్టితో ప్రపంచాన్ని అర్థం చేసుకుని జీవితాన్ని సమతూకంగా ఆనందమయం చేసుకునే మార్గం బోధిస్తుంది. సహాయం చేస్తుంది. భారతీయ దృష్టిని ఆధునిక శాస్త్ర జ్ఞానం కూడా బలపరుస్తోంది. మన సిద్ధాంతం విశ్వజనీనమైన ప్పటికీ యితర సంకుచిత సిద్ధాంతాల తాకిడికి తట్టుకునే శక్తి కలిగి ఉండాలని కూడా భారతీయ సంస్కృతి నొక్కి చెబుతుంది.

Author

Satyadeva Prasad Khandavalli

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

Select at least 2 products
to compare